AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Politics: ఢిల్లీకి చేరిన నకిలీ ఓట్ల రాజకీయం.. పోటాపోటీగా ఫిర్యాదులు.. ఈసీ నిర్ణయం ఎలా ఉండనుంది..

Andhra Pradesh Politics: ఏపీ రాజకీయాలు గరం గరంగా మారుతున్నాయి.. అధికార పార్టీ వర్సెస్ ప్రతిపక్షాలు.. ఒకటంటే.. రెండంటాం.. మూడంటే.. నాలుగంటాం.. ఇలా 2024 ఎన్నికలకు సిద్ధమవుతున్న పార్టీలు.. ఎత్తుకు పై ఎత్తులు వేసుకుంటూ ముందుకెళ్తున్నాయి.. ఈ క్రమంలోనే రాష్ట్ర సరిహద్దులు దాటి ఆంధ్రప్రదేశ్ రాజకీయం హస్తినకు చేరింది.

AP Politics: ఢిల్లీకి చేరిన నకిలీ ఓట్ల రాజకీయం.. పోటాపోటీగా ఫిర్యాదులు.. ఈసీ నిర్ణయం ఎలా ఉండనుంది..
YCP vs TDP
Shaik Madar Saheb
|

Updated on: Aug 28, 2023 | 7:45 PM

Share

Andhra Pradesh Politics: ఏపీ రాజకీయాలు గరం గరంగా మారుతున్నాయి.. అధికార పార్టీ వర్సెస్ ప్రతిపక్షాలు.. ఒకటంటే.. రెండంటాం.. మూడంటే.. నాలుగంటాం.. ఇలా 2024 ఎన్నికలకు సిద్ధమవుతున్న పార్టీలు.. ఎత్తుకు పై ఎత్తులు వేసుకుంటూ ముందుకెళ్తున్నాయి.. ఈ క్రమంలోనే రాష్ట్ర సరిహద్దులు దాటి ఆంధ్రప్రదేశ్ రాజకీయం హస్తినకు చేరింది. ఓట్ల తొలగింపు రాజకీయం తారస్థాయికి చేరి ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకునే వరకు వెళ్లింది. ఇలా నకిలీ ఓటర్‌ ఐడీ కార్డులపై వైసీపీ, టీడీపీ నేతలు చేస్తోన్న యుద్ధం ఢిల్లీకి చేరింది. పోటాపోటీగా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారు. ఒకరిపై మరొకరు దుమ్మెత్తిపోసుకున్నారు. దొంగ ఓట్ల ఏరివేత బాధ్యత పూర్తిగా ఈసీదేనని రెండు పార్టీల నేతలూ తేల్చేశారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఓట్ల అక్రమాలు జరిగాయంటూ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఢిల్లీ వెళ్లిన ఆయన సీఈసీతో గంటపాటు సమావేశమయ్యారు. తమ పార్టీ సానుభూతిపరుల ఓట్లను నిబంధనలకు విరుద్ధంగా తొలగించారని వివరించారు. సీఈసీతో సమావేశం తర్వాత బయటకు వచ్చిన చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికే ఢిల్లీకి వచ్చానన్నారు. ఆధారాలతో సహా ఈసీకి ఫిర్యాదు చేశామన్నారు. ఎన్నికలు జరిగే లోపే అధికారులు ఏపీకి వచ్చి పరిశీలించాలని కోరినట్లు చంద్రబాబు చెప్పారు.

ఇవి కూడా చదవండి

టీడీపీ ట్వీట్..

మరోవైపు టీడీపీ హయాంలో ఏపీలో ఓట్ల అవకతవకలు జరిగాయంటూ వైసీపీ నేతలు కూడా కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి నేతృత్వంలో వైసీపీ ఎంపీలు సీఈసీతో భేటీ అయ్యారు. ఏపీలో ఓట్ల తొలగింపుపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. 2014 నుంచి నమోదైన దొంగ ఓట్లపై విచారణ జరిపించాలని సీఈసీని కోరామని విజయసాయి చెప్పారు. ఆధార్‌తో ఓటర్‌ కార్డును అనుసంధానించడం ద్వారా బోగస్‌ ఓట్లను తొలగించవచ్చని సీఈసీకి సలహా ఇచ్చామన్నారు విజయసాయి.

వైఎస్ఆర్‌సీపీ ట్వీట్..

వైసీపీ, టీడీపీ నేతల ఫిర్యాదులపై సీఈసీ ఏం చేస్తుందోననేది ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. టీడీపీ చేస్తున్న ఆరోపణలకు గట్టి కౌంటరే ఇస్తున్న వైసీపీ.. ఆ ఆరోపణలకు కొట్టిపడేస్తోంది. దీనిపై సీఈసీ నిర్ణయం ఎలా ఉంటుందో వేచిచూడాల్సిందే.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..