Vizag: వైజాగ్ మేయర్ బస్ ప్రయాణం వెనుక స్టోరీ మీకు తెలుసా?
నగర మేయర్ హరి వెంకట కుమారి టీవీ9 మాట్లాడుతూ నగరంలో వాయు, శబ్ద కాలుష్యం పెరిగిపోయిందని వాటి నియంత్రణకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని కోరారు. నగరంలో ప్రైవేటు, ప్రభుత్వ సంస్థల యజమాన్యాలు వారంలో ఒక్క రోజు ప్రజారవాణాను వారి సిబ్బంది కూడా ఉపయోగించేలా చర్యలు చేపట్టాలన్నారు. కాలుష్య నియంత్రణ లో భాగంగా సాద్యమైనంతవరకు విధ్యుత్ వాహనాలను ఉపయోగించాలనీ కొరారు. కాలుష్య నియంత్రణకు జివిఎంసి విశేష కృషి చేస్తుందని, మొక్కలు సంరక్షణ, కార్యాలయంలోనికి ఉద్యోగుల వాహనాలు అనుమతించకపోవడం వంటి చర్యలు తీసుకున్నామన్నారు.

నిరంతరం కారులో తిరిగే విశాఖ నగర పాలక సంస్థ మేయర్ హరి వెంకట కుమారి ఒక్కసారిగా తన క్యాంప్ కార్యాలయం దగ్గర ఆర్.టీ.సీ బస్ ఎక్కి సాధారణ ప్రయాణికురాలిలా కనిపించడంతో అందరూ అవాక్కయ్యారు. ఎక్కడకు మేడమ్ అని అడగ్గా.. జీవిఎంసి కార్యాలయం వరకు టికెట్ కావాలని కండక్టర్‌ను అడిగారు. కండక్టర్ ఆశ్చర్యంగా మీరేంటి మేడమ్ బస్సెక్కారు అని అడగ్గా… కాలుష్య నియంత్రణలో భాగంగా ప్రతి సోమవారం బస్సులో ప్రయాణించాలని అనుకున్నామని, తానే కాదు జీవిఎంసీ కమిషనర్ దగ్గర నుంచీ ప్రతీ ఒక్కరూ ఈరోజు వాళ్లవాహనాల్ని వాడరని చెప్పారు. అందరూ ఇలాంటి పద్దతులను అవలంభించాలని కోరారు.
కార్యాలయానికే కాదు, సోమవారం ఏ కార్యక్రమానికి వెళ్ళాలన్నా బస్సులోనే
తమ సొంత వాహనాన్ని వదిలి, ప్రజారవాణా వ్యవస్థను ఉపయోగిస్తూ పలువురి ప్రజా ప్రతినిధులకు, ఉద్యోగులకు ఆదర్శంగా నిలుస్తున్నారు విశాఖ మేయర్. ఒక్క కార్యాలయానికి మాత్రమే కాదు, సోమవారం ఏ ఇతర అధికారిక కార్యక్రమాలకు వెళ్ళాలన్నా, చివరకు వ్యక్తిగత పనులపై వెళ్ళాలన్నా మేయర్ దంపతులు బస్సులోనే ప్రయాణిస్తున్నారు. మేయర్ ఆరిలోవలోని తమ క్యాంపు కార్యాలయం నుండి నేరుగా బస్సు ఎక్కి జీవీఎంసీ ప్రధాన కార్యాలయానికి వచ్చి డయల్ యువర్ మేయర్ – జగనన్నకు చెబుదాం కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఇతర కార్యక్రమాలను ముగించుకొని మరల తమ క్యాంపు కార్యాలయానికి కూడా బస్సులోనే వచ్చారు.
కాలుష్య నియంత్రణ అందరి బాధ్యత : మేయర్
ఈ సందర్భంగా నగర మేయర్ హరి వెంకట కుమారి టీవీ9 మాట్లాడుతూ నగరంలో వాయు, శబ్ద కాలుష్యం పెరిగిపోయిందని వాటి నియంత్రణకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని కోరారు. నగరంలో ప్రైవేటు, ప్రభుత్వ సంస్థల యజమాన్యాలు వారంలో ఒక్క రోజు ప్రజారవాణాను వారి సిబ్బంది కూడా ఉపయోగించేలా చర్యలు చేపట్టాలన్నారు. కాలుష్య నియంత్రణ లో భాగంగా సాద్యమైనంతవరకు విధ్యుత్ వాహనాలను ఉపయోగించాలనీ కొరారు. కాలుష్య నియంత్రణకు జివిఎంసి విశేష కృషి చేస్తుందని, మొక్కలు సంరక్షణ, కార్యాలయంలోనికి ఉద్యోగుల వాహనాలు అనుమతించకపోవడం వంటి చర్యలు తీసుకున్నామన్నారు. అన్నట్టు ప్రతి సోమవారం విశాఖ నగర పాలక సంస్థ కార్యాలయం లోకి ఏ వాహనాన్ని కూడా అనుమతించరు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..
