AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vizianagaram: అధికారులకు చుక్కలు చూపించిన ఏఈ.. సినీ ఫక్కీలో కారు గాల్లోకి లేపి మరీ..

Vizianagaram: సాయంత్రం 6:30 నిమిషాలు.. అంతా చీకటిగా ఉంది. అదే సమయంలో భలే ఛాన్స్ లే.. భలే ఛాన్స్ లే.. అని సంబర పడుతూ లంచం తీసుకొని కారులో కూర్చొని తాఫీగా లెక్కేసుకుంటున్నాడు ఓ లంచావతారి. ఇంతలో ఏసిబి అధికారులు ఎంట్రీ ఇచ్చి షాకిచ్చారు. ఇంకేముంది ఏసిబి అధికారులను చూసిన ఆ ఘనుడు చేసిన రచ్చ రచ్చ అంతా ఇంత కాదు. ఇంతకీ ఎవరా లంచావతారి..? ఆయన చేసిన హంగామా ఏంటి..? ఆ వివరాలివే.. 

Vizianagaram: అధికారులకు చుక్కలు చూపించిన ఏఈ.. సినీ ఫక్కీలో కారు గాల్లోకి లేపి మరీ..
Assistant Engineer Shantarao
Gamidi Koteswara Rao
| Edited By: |

Updated on: Aug 28, 2023 | 6:50 PM

Share

పార్వతీపురం మన్యం జిల్లా, ఆగస్టు 28: పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలంలో ఎలక్ట్రికల్ ఇంజనీర్ శాంతారావు ఏసిబి అధికారులకు చుక్కలు చూపించాడు. ఇటీవల ప్రమోషన్ మీద ఎలక్ట్రికల్ అసిస్టెంట్ ఇంజనీర్‌గా మక్కువ మండలానికి వచ్చిన పోలాకి శాంతారావు స్ట్రిక్ట్ ఆఫీసర్ గా పనిచేస్తూ బిల్డప్ ఇచ్చాడు. ఈ క్రమంలోనే మక్కువ మండలం మునక్కాయ వలసకు చెందిన ఈశ్వరరావు అనే రైతు తమ పంట పొలానికి విద్యుత్ కనెక్షన్ కావాలని ఏ ఈ శాంతారావును కలిశాడు. అందుకు దరఖాస్తు చేసుకున్నాడు. అయితే విద్యుత్ కనెక్షన్ ఇచ్చేందుకు లంచంగా అరవై వేల రూపాయలు కావాలని డిమాండ్ చేశాడు శాంతారావు. అందులో భాగంగా దరఖాస్తు రోజే నాలుగు వేలు ఫోన్ పే చేయమని డిమాండ్ చేశాడు. వెంటనే ఈశ్వరరావు నాలుగు వేలు ఫోన్ పే చేసి అనంతరం ఏసిబి అధికారులను ఆశ్రయించాడు. తరువాత రెండో వాయిదాగా నలబై వేలు ఇచ్చేందుకు సిద్ధమై ఏసిబి అధికారులకు సమాచారం ఇచ్చాడు రైతు. దీంతో రైతు ఈశ్వరరావు ఏ ఈ శాంతారావ్ ను కలిసి నలభై వేలు నగదు ఇచ్చాడు. అలా ఇచ్చిన నగదు ను కారులో కూర్చొని లెక్కేస్తుండగా ఏసిబి అధికారులు రంగంలోకి దిగారు.

ఏసిబి అధికారులను చూసిన ఏ ఈ శాంతారావు వెంటనే కారు డోర్స్ లాక్ చేసుకొని ఇంజిన్ స్టార్ట్ చేసి స్పోర్ట్స్ కారు లెవల్ లో ముందుకు దూకించాడు. ఎదురుగా ఏముంది? ఎక్కడికి వెళ్తున్నాను? అనే ఆలోచన కూడా లేకుండా కారు జంప్ చేశాడు. తీరా చూస్తే ఎదురుగా పంట పొలాలు, పెద్ద పెద్ద గట్లు తప్పా రోడ్డు లేదు. అయినా సరే ఏ మాత్రం తగ్గలేదు. పంటపొలాల్లో గట్లు మీద నుండి డ్రైవ్ చేస్తూ దూసుకుపోయాడు. కారు పొలం గట్లు మీద నుండి పాత సినిమాలో ఏ ఎన్ ఆర్ డ్రైవ్ చేసినప్పుడు గాల్లో ఎగిరెగిరి కారు పడిన టైప్ లో ఎగిరెగిరి పడుతుంది. అది చూసిన పోలీసులు ఏందిరా నాయన? ఇందేంది.. ఏమి చేస్తున్నాడు? ఎక్కడికి వెళ్తున్నాడు? ముందు వాడిని పట్టుకోండిరా అంటూ పెద్దగా అరుస్తూ తమ సిబ్బందికి ఆదేశించాడు ఏ సి బి, డి ఎస్ పి రామచంద్రరావు. దీంతో వెంటనే ప్రక్కనే ఉన్న ఒక బైక్ తీసుకొని కారును అడ్డుకునే ప్రయత్నం చేశాడు సి ఐ తెంటు శ్రీనువాసరావు. అలా బైక్ ను కారుకు అడ్డం పెట్టే ప్రయత్నం చేశాడు సి ఐ.

ఇవి కూడా చదవండి

అయినా శాంతారావు ఏ మాత్రం తగ్గకుండా సిఐ బైక్‌ని బలంగా ఢీకొట్టాడు. మళ్లీ కారు స్పీడ్ పెంచి ముందుకు దూసుకెళ్లాడు. ఆ ప్రమాదంలో ప్రాణాపాయం నుండి సిఐ శ్రీనువాసరావు తృటిలో తప్పించుకున్నప్పటికీ తీవ్ర గాయాలపాలయ్యాడు. దీంతో మిగిలిన సిబ్బంది శాంతారావ్ కోసం వెంబడించిన ఫలితం లేదు. రాత్రి సమయం కావడంతో అధికారుల కన్ను గప్పి ఎట్టకేలకు ఏసిబి అధికారులకు దొరక్కుండా తప్పించుకొని పారిపోయాడు. ప్రస్తుతానికి గాయాలైన సిఐ చికిత్స పొందుతున్నాడు. అయితే జరిగిన ఘటనతో అవాక్కయిన ఏసిబి బృందం ప్రత్యేక బృందాలతో శాంతారావు కోసం గాలిస్తున్నారు. స్వచ్చందంగా లొంగిపోతే మంచిది లేకపోతే కటిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఏదైనా ఇలాంటి ఘటనలు మళ్లీ మళ్లీ జరగకుండా జాగ్రత్తలు కూడా ఏసిబి అధికారులకు తప్పేలా లేదు .

ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి