Big News Big Debate: పాతస్నేహం కొత్తగా చిగురిస్తోందా..? టీడీపీ- బీజేపీ మధ్య పొత్తు పొడుస్తుందా.. భేటీ అందుకేనా..
Big News Big Debate: ఏపీలో ఎవరు ఎవరితో పొత్తులు పెట్టుకుంటారనేది ఉత్కంఠను రేపుతోంది. పొత్తుల విషయం తమ కేంద్ర నాయకత్వం చూసుకుంటుందని బీజేపీ రాష్ట్ర పార్టీ చెబుతున్నా.. ఢిల్లీలో పరిణామాలు మాత్రం వేగంగా మారుతున్నాయి. ఇప్పటికే మూడు పార్టీలు కలిసివెళ్లాలని పవన్ కల్యాణ్ తన మనసులో మాట బయటపెట్టారు. ఇప్పుడు టీడీపీ కూడా సకుటుంబసమేత రాజకీయయాత్రలో ఉంది.
Big News Big Debate: ఏపీలో ఎవరు ఎవరితో పొత్తులు పెట్టుకుంటారనేది ఉత్కంఠను రేపుతోంది. పొత్తుల విషయం తమ కేంద్ర నాయకత్వం చూసుకుంటుందని బీజేపీ రాష్ట్ర పార్టీ చెబుతున్నా.. ఢిల్లీలో పరిణామాలు మాత్రం వేగంగా మారుతున్నాయి. ఇప్పటికే మూడు పార్టీలు కలిసివెళ్లాలని పవన్ కల్యాణ్ తన మనసులో మాట బయటపెట్టారు. ఇప్పుడు టీడీపీ కూడా సకుటుంబసమేత రాజకీయయాత్రలో ఉంది. అధికారిక కార్యక్రమాల కోసం హస్తినకు వెళ్లిన చంద్రబాబు.. పనిలో పనిగా పొత్తులపైనా జాతీయపార్టీ అధ్యక్షులతో చర్చించారా? వైసీపీకి వచ్చిన డౌట్ ఏంటి? ఏపీలో జరుగుతున్న చర్చేంటి?
ఎన్టీఆర్ స్మారక నాణెం విడుదల సందర్భంగా ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబునాయుడు బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాతో చర్చలు జరిపారు. ఇదే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్‌టాపిక్ అయింది. రాష్ట్ర బీజేపీ అద్యక్షురాలు పురంధేశ్వరి కూడా ఉండటంతో రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. 2018 నుంచి రెండుపార్టీల టీడీపీ-బీజేపీ మధ్య గ్యాప్ ఉంది. ఓటమి తర్వాత మారిన పరిస్థితుల్లో మళ్లీ బీజేపీకి దగ్గరయ్యేందుకు టీడీపీ ప్రయత్నిస్తుందన్న అభిప్రాయం బలంగా ఉంది. సరిగ్గా ఈసమయంలోనే జనసేన అధినేత పవన్‌కల్యాణ్ కూడా టీడీపీ, బీజేపీ, జనసేన కలిసే ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందంటూ పదేపదే చెబుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో చంద్రబాబు- జేపీ నడ్డా మధ్య చర్చలు మరోసారి పొత్తులపై చర్చలకు ఆస్కారం ఇచ్చాయి. మూడు నెలల క్రితం కూడా అమిత్‌షా, జేపీ నడ్డాతో చంద్రబాబు సమావేశమయ్యారు. తర్వాత రాజకీయంగా అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి.
తాజాగా ఢిల్లీలో పరిణామాలపై వైసీపీ తనదైనశైలిలో స్పందించింది. చంద్రబాబును బీజేపీకి దగ్గర చేసే ప్రయత్నంలో పురంధేశ్వరి ఉన్నారని అర్ధం వచ్చేలా ట్వీట్ చేశారు ఎంపీ విజయసాయిరెడ్డి. సరిగ్గా ఇదే సమయంలో ఢిల్లీ పరిణామాలను ఉద్దేశించి సీఎం జగన్ కూడా నగరిలో చేసిన పరోక్ష వ్యాఖ్యలపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.
త్వరలో అసెంబ్లీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో పొత్తల అంశం ఏపీలో హాట్‌టాపిక్‌గా మారుతోంది. బీజేపీ-జనసేన మధ్య బంధం కొనసాగుతోంది.. టీడీపీని కూడా కలుపుకుని పోవాలన్న పవన్ కల్యాణ్ వ్యూహం నిజమవుతోందా?
బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ లైవ్ వీడియో చూడండి..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..