Zodiac Signs: సెప్టెంబర్ 16 తర్వాత ఈ 5 రాశులవారు పట్టిందల్లా బంగారమే.. అపారమైన ధనప్రాప్తి.. మీ రాశి కూడా ఉందా..

Zodiac Signs: గ్రహాల రాకూమారుడిగా ప్రసిద్ధి చెందిన బుధుడు ఆగస్టు 24న సింహరాశిలోకి తిరోగమించాడు. ఇదే రాశిలో బుధుడు సెప్టెంబర్ 15 వరకు సంచరించి, సెప్టెంబర్ 16వ సాధారణ స్థితిలోకి వస్తాడు. ఫలితంగా రాశిచక్రంలోని కొన్ని రాశులు ఎంతగానో లాభపడనున్నాయి. ఈ క్రమంలోనే ఆయా రాశులవారు ధనవంతులుగా మారే అవకాశం ఉందని, వ్యాపారులను అనూహ్య ధనప్రాప్తి కలుగుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ సింహరాశిలో బుధుడి సంచారం ఏయే రాశులకు..

Zodiac Signs: సెప్టెంబర్ 16 తర్వాత ఈ 5 రాశులవారు పట్టిందల్లా బంగారమే.. అపారమైన ధనప్రాప్తి.. మీ రాశి కూడా ఉందా..
Mercury Transit 2023
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Aug 27, 2023 | 5:45 AM

Zodiac Signs: వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం గ్రహాల సంచార, తిరోగమనాలు మానవ జీవితాన్ని ఎప్పుడూ ప్రభావితం చేస్తాయి. అయితే ఈ ఫలితాలు ఎవరికి అనుకూలంగా, మరెవరికి ప్రతికూలంగా ఉంటుందనేది వారివారి రాశిలో గ్రహబలంపై ఆధారపడి ఉంటుంది. ఇదిలా ఉండగా గ్రహాల రాకూమారుడిగా ప్రసిద్ధి చెందిన బుధుడు ఆగస్టు 24న సింహరాశిలోకి తిరోగమించాడు. ఇదే రాశిలో బుధుడు సెప్టెంబర్ 15 వరకు సంచరించి, సెప్టెంబర్ 16వ సాధారణ స్థితిలోకి వస్తాడు. ఫలితంగా రాశిచక్రంలోని కొన్ని రాశులు ఎంతగానో లాభపడనున్నాయి. ఈ క్రమంలోనే ఆయా రాశులవారు ధనవంతులుగా మారే అవకాశం ఉందని, వ్యాపారులను అనూహ్య ధనప్రాప్తి కలుగుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ బుధుడు సెప్టెంబర్ 16న సాధారణ సంచారంలోకి రావడం ఏయే రాశులకు అనుకూలంగా ఉండనుందో ఇప్పుడు తెలుసుకుందాం..

మిధున రాశి: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధుడు సాధారణ సంచారంలోకి రావడం మిథున రాశివారికి ప్రయోజనకరంగా ఉండనుంది. ఫలితంగా మీరు తలపెట్టిన పనులు అన్నీ సక్రమంగా పూర్తవుతాయి. పెద్దల మన్ననలు, సమాజంలో మంచిపేరు పొందుతారు. అయితే ఈ సంచారం సమయంలో మిథున రాశి వారు ఎలాంటి వాదనలు పెట్టుకోకూడదు.

కర్కాటక రాశి: సెప్టెంబర్ 16న ప్రారంభమయ్యే బుధుడి సాధారణ సంచారం కారణంగా కర్కాటక రాశివారు ఎన్నో లాభాలను పొందుతారు. ఈ సమయంలో మీకు ధనప్రాప్తి, సంతాన ప్రాప్తి కలుగుతాయి. ఇంకా మీ బంధుమిత్రుల్లో మీపై గౌరవం పెరుగుతుంది.

ఇవి కూడా చదవండి

కన్యా రాశి: కన్యా రాశి వారికి బుధుడి సాధారణ సంచారం లాభాలను ఇస్తుంది. ఈ కాలంలో ఈ రాశి వ్యక్తులు ఉద్యోగ వ్యాపారంలో లాభపడతారు. వ్యక్తి ప్రమోషన్ పొందవచ్చు మరియు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.

వృశ్చిక రాశి: వృశ్చిక రాశి వారికి కూడా బుధుడి మాములు సంచారం చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ కాలంలో  మీరు ఆనందంగా జీవిస్తారు. ఈ సంచార సమయంలో మీరు ప్రారంభించిన ప్రతి ఒక్క పని కూడా సవ్యంగా పూర్తవుతుంది. ఇంకా ఆర్థిక పరిస్థితి మెరుగుపడడంతో పాటు అప్పుల బాధలు తప్పుతాయి.

మీన రాశి: బుధుడి సాధారణ సంచారం మీన రాశి వారికి ఎంతో మేలు చేస్తుంది. ఉద్యోగులకు పదోన్నతి, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు మంచి ఫలితాలు దక్కుతాయి. దాంపత్య జీవితంలో అన్ని రకాల సమస్యలు, వివాదాలు తొలగిపోతాయి.

Note: ఇక్కడ తెలియజేసిన సమాచారం వారివారి నమ్మకం, విశ్వాసాల మీద ఆధారపడి ఉంటుంది.  దీన్ని నిర్ధారించేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. పాఠకుల ఆసక్తి, నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సమాచారాన్ని అందించాము.

మరిన్ని జ్యోతిష్య కథనాలు చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.