Zodiac Signs: సెప్టెంబర్‌ నెలలో ఈ రాశులవారిదే అదృష్టం.. పట్టిందల్లా బంగారం.. మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి..

September 2023: సెప్టెంబర్ నెలలో ఏకంగా 5 గ్రహాలు తమ రాశిని మార్చబోతున్నారు. ఈ కారణంగా రాశి చక్రంలోని కొన్ని రాశులవారికి శుభ ఫలితాలు కలగనున్నాయి. ఆగస్టు పూర్తి కావడానికి ఇంకా వారం రోజులు కూడా లేదు, అంటే కొన్ని రాశులవారు అదృష్టవంతులుగా మారేందుకు ఇంకా 5 రోజుల సమయమే మిగిలి ఉంది. సెప్టెంబర్‌లో రాశిని మారుస్తున్న గ్రహాల విషయానికి వస్తే.. సెప్టెంబర్ 4న శుక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించనుండగా, అదే రోజున బృహస్పతి మేషరాశిలో తిరోగమనం..

Zodiac Signs: సెప్టెంబర్‌ నెలలో ఈ రాశులవారిదే అదృష్టం.. పట్టిందల్లా బంగారం.. మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి..
September 2023
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Aug 26, 2023 | 5:41 AM

September 2023: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ప్రతి నెలా వాటి రాశిని, నక్షత్రాన్ని మారుస్తుంటాయి. దీంతో రాశి చక్రంలోని వివిధ రాశులవారికి వారి గ్రహ బలాలను అనుసరించి ప్రత్యేక ఫలితాలు సిద్ధిస్తాయి. ఈ ఫలితాలు కొందరికి అనుకూలంగా, మరి కొందరికి ప్రతికూలంగా ఉండవచ్చు. ఇదిలా ఉండగా సెప్టెంబర్ నెలలో ఏకంగా 5 గ్రహాలు తమ రాశిని మార్చబోతున్నారు. ఈ కారణంగా రాశి చక్రంలోని కొన్ని రాశులవారికి శుభ ఫలితాలు కలగనున్నాయి. ఆగస్టు పూర్తి కావడానికి ఇంకా వారం రోజులు కూడా లేదు, అంటే కొన్ని రాశులవారు అదృష్టవంతులుగా మారేందుకు ఇంకా 5 రోజుల సమయమే మిగిలి ఉంది.

సెప్టెంబర్‌లో రాశిని మారుస్తున్న గ్రహాల విషయానికి వస్తే.. సెప్టెంబర్ 4న శుక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించనుండగా, అదే రోజున బృహస్పతి మేషరాశిలో తిరోగమనం చెందుతాయి. అలాగే సెప్టెంబర్ 14న బుధుడు సింహరాశిలోకి, సెప్టెంబర్ 17న సూర్యుడు కన్యారాశిలోకి ప్రవేశించనున్నాడు. ఇక సెప్టెంబర్ 24న కన్యారాశిలో కుజుడు అస్తమిస్తాడు. ఇలా 5 గ్రహాలు ఒకే నెలలో రాశిని మార్పు చేయనున్నాయి. ఫలితంగా లాభపడబోతున్న రాశులేమిటంటే..

మేష రాశి: సెప్టెంబర్ నెల మేష రాశివారికి చాలా ప్రయోజనకరంగా ఉండే అవకాశం ఉందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. మీ నుంచి డబ్బులు తీసుకున్నవారు తిరిగి ఇచ్చేస్తారు. అలాగే వ్యాపారాల్లో లాభాలు, కొత్త ఆదాయ మార్గాలను కనుగొంటారు. నిలిచిపోయిన పనులు వేగంగా పూర్తవుతాయి. కుటుంబ సభ్యుల నుంచి మద్ధతు లభిస్తుంది.

ఇవి కూడా చదవండి

సింహ రాశి: సెప్టెంబర్ నెల సింహ రాశివారికి కూడా  చాలా అనుకూలంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. ఈ సమయంలో మీ ప్రసంగాలు మీలోని నాయకత్వ లక్షణాలను బయట పెడతాయి. మీపై అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. ఇంకా వ్యాపారులు అధిక మొత్తంలో ఆదాయం పొందుతారు. ఈ కారణంగానే ఇది మీరు పెట్టుబడి పెట్టేందుకు సానుకూల సమయం.

మిథున రాశి: మిథున రాశికి చెందినవారికి సెప్టెంబర్ నెల ఎంతో లాభదాయకంగా ఉండనుందని, ఈ సమయంలో మీ ఆరోగ్యం మెరుగు పడుతుందని చెబుతున్నారు. అలాగే దీర్ఘకాలికంగా మిమ్మల్ని వేధిస్తున్న సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న విద్యార్థులు సానుకూలమైన ఫలితాలను పొందుతారు.

Note: ఇక్కడ తెలియజేసిన సమాచారం వారివారి నమ్మకం, విశ్వాసాల మీద ఆధారపడి ఉంటుంది.  దీన్ని నిర్ధారించేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. పాఠకుల ఆసక్తి, నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సమాచారాన్ని అందించాము.

మరిన్ని జ్యోతిష్య కథనాలు చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.