Zodiac Signs: గ్రహచార రీత్యా జీవితంలో మీకు గాడ్ ఫాదర్‌గా నిలిచేది ఎవరు? ఈ ఆసక్తికర విషయాలు తెలుసుకోండి..
Zodiac Signs: ఏ రంగంలోనైనా పైకి రావాలంటే, ఆశయం లేదా లక్ష్యం సాధించాలంటే జీవితంలో ఒక గాడ్ ఫాదర్ అవసరం. మనకు సహాయం చేసేవారు, చేయూతనిచ్చేవారుంటే ఆశించిన విధంగా పైకి రావడం తేలికవుతుంది. జాతక చక్రం ప్రకారం లేదా గ్రహచారం ప్రకారం మనకకు అటువంటి గాడ్ ఫాదర్ ఎవరైనా ఉంటారా?
Astrology in Telugu: ఏ రంగంలోనైనా పైకి రావాలంటే, ఆశయం లేదా లక్ష్యం సాధించాలంటే జీవితంలో ఒక గాడ్ ఫాదర్ అవసరం. మనకు సహాయం చేసేవారు, చేయూతనిచ్చేవారుంటే ఆశించిన విధంగా పైకి రావడం తేలికవుతుంది. జాతక చక్రం ప్రకారం లేదా గ్రహచారం ప్రకారం మనకకు అటువంటి గాడ్ ఫాదర్ ఎవరైనా ఉంటారా? ఎటువంటివారు చేయూతనిస్తారు? ఈ ఏడాది అటువంటి అవకాశం ఏమైనా ఉందా? వివిధ రాశులను బట్టి మీకు అటువంటి అవకాశం ఉందో, లేదో, ఈ గాడ్ ఫాదర్ ఎవరో పరిశీలిద్దాం.
- మేషం: ఈ రాశివారికి యాంబిషన్ కాస్తంత ఎక్కువ. త్వరగా అందలాలు ఎక్కాలని కోరుకుంటారు. అధికారం లేదా నాయకత్వం మీద దృష్టి ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా ఈ రాశివారికి గాడ్ ఫాదర్ అధికారుల రూపంలోనే ఉంటాడు. అధికారులే ఈ రాశివారిని పైకి తీసుకువస్తారు. ఈ రాశి వారు ఏ రంగంలోనైనా అధికారులకు చేదోడు వాదోడుగా ఉంటుంటారు. ఆ పద్ధతి వీరు వృత్తిలో లేదా ఉద్యోగంలో పైకి రావడానికి దోహదం చేస్తుంది. ఈ ఏడాది గురు గ్రహం గాడ్ ఫాదర్ పాత్ర పోషిస్తుంది.
- వృషభం: ఈ రాశివారు ఎక్కువగా తమ శ్రమను నమ్ముకుంటారు. స్వయం కృషి వల్లే పైకి రావాలని కోరు కుంటారు. అయితే, ఈ రాశివారికి తండ్రి నుంచి సహాయ సహకారాలుంటాయి. వృత్తి, ఉద్యోగా లకు సంబంధించి తండ్రి వారసత్వం వీరికి అందే అవకాశం ఉంటుంది. తండ్రే ఈ రాశివారికి గాడ్ ఫాదర్ అవుతాడు. అడుగడుగునా ఆదుకుంటూ ఉంటాడు. తన కింద పనిచేసే ఉద్యోగుల నుంచి కూడా ఆశించిన చేయూత లభిస్తూ ఉంటుంది. ఈ ఏడాది శనీశ్వరుడు గాడ్ ఫాదర్ పాత్ర పోషిస్తున్నాడు.
- మిథునం: సాధారణంగా ఈ రాశివారు మొదటి నుంచి పలుకుబడి కలిగిన వారితో స్నేహం చేస్తుంటారు. అందువల్ల ఉన్నత స్థాయిలో ఉన్నవారు ఈ రాశివారికి అవసరమైనప్పుడు చేయూతనందిస్తుం టారు. అంటే, స్నేహితులే గాడ్ ఫాదర్ గా వ్యవహరిస్తారన్న మాట. ఈ రాశివారికి తక్కువ సంఖ్య లోనే అయినా ప్రాణ స్నేహితులుంటారు. అందులో కూడా చిన్ననాటి స్నేహితుల వల్ల వీరు ఎంతగానో అభివృద్ధి చెందుతారు. ఈ ఏడాది వీరికి గురు గ్రహం గాడ్ ఫాదర్ రూపంలో సహాయపడతాడు.
- కర్కాటకం: ఈ రాశివారికి చిన్న వయసులో ఉపాధ్యాయులు లేదా అధ్యాపకులు అనేక విధాలుగా చేయూత నందిస్తారు. జీవితానికి కావాల్సిన గట్టి పునాదులు వారి ద్వారానే పడతాయి. వృత్తి, ఉద్యోగాలలో కూడా ఎక్కువగా వారి నుంచి సలహాలు, సూచనలు అందుతుంటాయి. ఉద్యోగ జీవితంలో దేవుడే ఈ రాశివారికి పెద్ద గాడ్ ఫాదర్. అవసర సమయాల్లో ఏదో విధంగా చేయూత అందుతుంటుంది. సరైన ఉన్నతాధికారులు లభ్యమవుతారు. ఈ ఏడాది బుధ గ్రహం ఆ పాత్ర పోషించడం జరుగుతుంది.
- సింహం: ఈ రాశివారికి తండ్రి నుంచి సహకారముంటుంది. తండ్రి వారసత్వంగా వృత్తి, ఉద్యోగాలు లభిస్తాయి. జీవితాంతం తండ్రి ప్రభావం ఉంటుంది. అందువల్ల తండ్రి ఈ రాశివారికి గాడ్ ఫాదర్ మాది రిగా చేయూత నందిస్తూ ఉంటాడు. విచిత్రంగా ఈ రాశివారి జీవితంలో భార్య లేదా భర్త కూడా కీలక పాత్ర పోషిస్తుంటారు. జీవిత భాగస్వామి వల్ల జీవితంలో బాగా పైకి రావడం జరుగుతుంది. ఈ రాశివారికి ఈ ఏడాది కుజ గ్రహం తండ్రి లేదా జీవిత భాగస్వామి రూపంలో చేయూతనందిస్తారు.
- కన్య: సాధారణంగా ఈ రాశివారు స్వయం కృషిని నమ్ముకుంటారు. వీరిలో ఆత్మవిశ్వాసం కాస్తంత ఎక్కువగా ఉంటుంది. చిన్నప్పటి నుంచే జీవిత ప్రణాళిక ప్లాన్ మనసులో సిద్ధంగా ఉంటుంది. ఈ రాశివారికి ఎక్కువగా సహచరులు, సన్నిహితులు జీవితంలో పైకి రావడానికి సహాయం చేస్తూ ఉంటారు. వృత్తి, ఉద్యోగాలలో అడుగుపెట్టిన దగ్గర నుంచి వీరి జీవితం మలుపు తిరగడం ప్రారంభం అవుతుంది. ఈ రాశివారికి స్త్రీల వల్ల, ముఖ్యంగా అధికారిణుల వల్ల కూడా పురోగతి సాధ్యమవుతుంది.
- తుల: ఈ రాశివారికి చిన్నప్పుడు తల్లి, పెళ్లయిన తర్వాత జీవిత భాగస్వామి గాడ్ ఫాదర్ పాత్ర పోషిస్తారు. ఏదో ఒక దశలో ఈ రాశివారికి ‘స్త్రీ మూలక అదృష్టం’ పడుతుంది. తల్లి, భార్య మాత్రమే కాకుండా వృత్తి, ఉద్యోగాల్లో మహిళా అధికారుల వల్ల,మహిళా భాగస్వాముల వల్ల కూడా పురో గతి సాధించే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఈ రాశివారికి పెళ్లి తర్వాత నుంచి కలిసి రావడం ప్రారంభం అవుతుంది. ఈ ఏడాది శుక్ర గ్రహం వల్ల పురోగతికి సహాయం చేయడం జరుగుతుంది.
- వృశ్చికం: తోబుట్టువులు, కొందరు స్నేహితులు, బాగా దగ్గర బంధువుల కారణంగా వీరు జీవితంలో పైకి రావడం జరుగుతుంది. ఎక్కువగా జ్యేష్ట సోదరులు ఈ రాశివారికి గాడ్ ఫాదర్ల పాత్ర పోషించే అవ కాశం ఉంది. ఈ రాశివారి జ్యేష్ట సోదరులు ఉన్నత స్థానాల్లో ఉండడం జరుగుతుంది. అది ఈ రాశి వారికి బాగా కలిసి వస్తుంది. స్నేహితులు, బంధువుల నుంచి కూడా వీరికి అవసరమైన సహకారాలు లభిస్తుంటాయి. ఈ ఏడాది కుజ గ్రహం వీరి జీవితంలో గాడ్ ఫాదర్ పాత్ర పోషించే అవకాశం ఉంది.
- ధనుస్సు: ఈ రాశివారికి ప్రభుత్వ అధికారులు, ఉన్నత స్థానాలలో ఉన్న వ్యక్తుల ద్వారా పురోగతికి అవకాశాలు కలిసి వస్తాయి. ఒకరిద్దరు స్నేహితుల వల్ల జీవితంలో అభివృద్ధి బాట పడుతుంది. ఈ ఉన్నత స్థానాలలో ఉన్న వ్యక్తుల గైడెన్స్ తో వీరు తమ తమ రంగాల్లో పైకి రావడం జరుగుతుంది. వీరు జీవితంలో పైకి రావడానికి కొంత జీవిత భాగస్వామి వ్యూహం, ప్రణాళిక, దూరదృష్టి కూడా కారణమవుతాయి. ఈ ఏడాది రవి గ్రహం వీరిని విశేషంగా అభివృద్ధిలోకి తీసుకువస్తుంది.
- మకరం: సాధారణంగా స్వయం కృషిని, పరిశ్రమను నమ్ముకునే ఈ రాశివారికి శనీశ్వరుడే జీవితాంతం కొండంత అండగా ఉంటాడు. వృత్తి, ఉద్యోగాలపరంగా, ఆర్థికపరంగా కొద్దిగా శ్రమాధిక్యత ఉన్నప్పటికీ ఆశించిన ప్రతిఫలాన్ని ఇచ్చి, కోరికలు నెరవేర్చి, స్థిరత్వాన్ని ఇచ్చేది శనీశ్వరుడే. వృత్తి, ఉద్యోగాల్లో పేరు సంపాదించడం, ఆర్థికంగా ముందంజ వేయడంలో శనీశ్వరుడే గాడ్ ఫాదర్ పాత్ర పోషిస్తుంటాడు. ముఖ్యంగా కొందరు అధికారుల రూపంలో శని చేయూతనివ్వడం జరుగుతుంది.
- కుంభం: ఈ రాశివారు ఎక్కువగా పలుకుబడి కలిగిన వ్యక్తుల సహాయ సహకారాలతో పైకి రావడం జరుగుతుంది. ఒకరు లేదా ఇద్దరు మాత్రమే సన్నిహిత మిత్రులుంటారు. వారే గాడ్ ఫాదర్లుగా వ్యవహరిస్తారు. వీరి కారణంగా తమకు సంబంధించిన రంగంలో విశేషంగా పైకి వచ్చే అవకాశం ఉంటుంది. కుటుంబంలో తాతలు, మేనమామల వల్ల కూడా జీవితంగా వృద్ధిలోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఏడాది ఈ రాశివారు బుధ గ్రహం కారణంగా అభ్యున్నతి సాధించడం జరుగుతుంది.
- మీనం: ఈ రాశివారికి ఎక్కువగా టీచర్లు, గురువుల వల్ల జీవితం అభివృద్ధి చెందుతుంది. చిన్నతనంలో వీరి వల్ల చదువుల్లో పైకి వచ్చి, జీవితంలో స్థిరపడడానికి అవకాశం ఏర్పడుతుంది. ఆ తర్వాత అధికారుల ఆదరణ, ప్రోత్సాహం లభిస్తాయి. ఈ రాశికి చెందిన ఉద్యోగుల మీద అధికారులకు ప్రత్యేక అభిమానం ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఉన్నతాధికారుల మార్గదర్శనంలో వీరు అనేక విజయాలు సాధించే అవకాశం ఉంది. ఈ ఏడాది గురు గ్రహ సంచారం వీరికి ఎంతో లబ్ధి చేకూరుస్తుంది.
Note: ఇక్కడ సమకూర్చిన సమాచారం వారివారి నమ్మకం, విశ్వాసాల మీద ఆధారపడి ఉంటుంది. దీన్ని నిర్ధారించేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. పాఠకుల ఆసక్తిని, నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సమాచారాన్ని అందించాము.
మరిన్ని జ్యోతిష్య కథనాలు చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.