Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: నిరుద్యోగులు ఆశించిన శుభవార్త అందుకుంటారు.. 12 రాశుల వారికి శుక్రవారం రాశిఫలాలు..

Horoscope Today in Telugu (August 25): జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహనక్షత్రాలు మీ జాతకచక్రానికి అనుకూలంగా ఉన్నాయా..? ఆరోగ్యం, ఆర్థికపరంగా మీ జాతకం ఎలా ఉండబోతుంది..? ఉద్యోగపరంగా మీ రాశికి దిన ఫలాలు సానుకూలంగానే ఉన్నాయా..? ఆగస్టు 25, 2023న(శుక్రవారం) 12 రాశుల వారి రాశిఫలాలు ఎలా ఉంటాయో తెలుసుకోండి..

Horoscope Today: నిరుద్యోగులు ఆశించిన శుభవార్త అందుకుంటారు.. 12 రాశుల వారికి శుక్రవారం రాశిఫలాలు..
Horoscope 25th August 2023
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Aug 25, 2023 | 5:05 AM

Horoscope Today in Telugu (August 25): జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహనక్షత్రాలు మీ జాతకచక్రానికి అనుకూలంగా ఉన్నాయా..? ఆరోగ్యం, ఆర్థికపరంగా మీ జాతకం ఎలా ఉండబోతుంది..? ఉద్యోగపరంగా మీ రాశికి దిన ఫలాలు సానుకూలంగానే ఉన్నాయా..? ఆగస్టు 25, 2023న(శుక్రవారం) 12 రాశుల వారి రాశిఫలాలు ఎలా ఉంటాయో తెలుసుకోండి..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): ఈ రాశిలో సంచరిస్తున్న గురువు ఈ రాశివారికి కొన్ని శుభాలు కలగజేస్తాడు. ఉద్యోగ భద్రతకు, ఆర్థిక స్థిరత్వానికి సమస్య ఉండదు. అయితే, గురువుతో ఉన్న రాహువు వల్ల స్వల్ప అనారోగ్య సమస్యలు, వృత్తి, ఉద్యోగాల్లో మధ్య మధ్య చిరాకులు తప్పకపోవచ్చు. శనీశ్వరుడి అనుగ్రహం పూర్తిగా ఉన్నందువల్ల ఆదాయపరంగా, ఉద్యోగపరంగా పురోగతి ఉంటుంది. ఉద్యోగావకాశాలు కలిసి వస్తాయి. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది. వ్యాపారాలు లాభిస్తాయి.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): వృత్తి, ఉద్యోగాల్లో శ్రమకు తగ్గ ప్రతిఫలం ఉంటుంది. ఉద్యోగంలో పైకి రావడానికి మీ శక్తిసామర్థ్యా లన్నిటినీ దారబోస్తారు. వ్యాపారాలు పరవాలేదనిపిస్తాయి. అనుకోకుండా కొన్ని మంచి కంపెనీల నుంచి ఉద్యోగావకాశాలు అంది వస్తాయి. నాలుగవ స్థానంలో బుధాదిత్యయోగం పట్టినందువల్ల, ఏ ప్రయత్నం చేసినా కలిసి వస్తుంది. ఆర్థిక వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు. పిల్లల చదువుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): లాభ స్థానంలో ఉన్న గురువు కొండంత అండగా ఉంటాడు. ధన ధాన్యాలకు లోటు ఉండదు. వృత్తి, ఉద్యోగంలో త్వరితగతిన పురోగతి ఉంటుంది. వ్యాపారాలు కూడా లాభాల బాటలో ముందుకు వెడతాయి. భాగ్య స్థానంలో ఉన్న శనీశ్వరుడి కారణంగా విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. విదేశీ సంబంధమైన ప్రయత్నాలు ఫలిస్తాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. బంధువుల నుంచి ఒకటి రెండు శుభవార్తలు వింటారు.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): కొన్ని వ్యక్తిగత సమస్యల పరిష్కారం మీద దృష్టి పెట్టడం మంచిది. ఆరోగ్యం విషయంలో కూడా అశ్రద్ధ చేయవద్దు. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. శుక్ర, బుధ గ్రహాల వల్ల కుటుంబ సమస్యలు పరిష్కారం కావడం, గృహ జీవితం ప్రశాంతంగా సాగిపోవడం జరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన ఏ ప్రయత్నమైనా సఫలం అవుతుంది. ఇతరులకు సహాయం చేయడం, దైవ కార్యాల్లో పాల్గొనడం వంటివి జరుగుతాయి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): ఏ విషయంలోనూ తొందరపాటు వైఖరి పనికి రాదు. సహాయం చేసేవారిని దూరం చేసుకోవద్దు. వృత్తి, ఉద్యోగాలలో ప్రాభవం పెరుగుతుంది. వ్యాపారాల్లో కొత్త ఆలోచనలు ఆర్థిక ప్రయోజనం కలిగిస్తాయి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగావకాశాలు అందివస్తాయి. వివాహ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. మిత్రుల సహాయంతో ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి చేస్తారు. బంధువులకు సహాయంగా నిలబడతారు.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. వృత్తి, వ్యాపారాల్లో కొత్త నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తారు. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. స్థిరాస్తికి సంబంధించిన వ్యవహారాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో మీ విలువ మరింత పెరుగుతుంది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాలు వ్యయ ప్రయాసలతో పూర్తవుతాయి.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): మిత్రుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ధనపరమైన చిక్కులు, సమస్యలు తొలగిపోతాయి. గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. వృత్తి, ఉద్యోగాలు నిదానంగా ముందుకు సాగుతాయి. వ్యాపారాలకు అనుకూల పరిస్థితులు ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. పిల్లలు వృద్ధిలోకి వస్తారు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): నిరుద్యోగుల కల సాకారం అవుతుంది. వృత్తి, ఉద్యోగాలలో బాధ్యతలు, లక్ష్యాలు పెరుగుతాయి. ఉద్యోగంలో అధికారులతో సామరస్యం ఏర్పడుతుంది. వ్యాపారాలు అభివృద్ధి బాటలో పయని స్తాయి. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. శుభ కార్యాలకు సంబంధించిన ఆహ్వానాలు అందుతాయి. స్వల్ప అనారోగ్యాలకు అవకాశం ఉంది. ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. పెళ్లి ప్రయత్నాల్లో సానుకూల స్పందన లభిస్తుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): సర్వత్రా మీ మాట చెల్లుబాటు అవుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో అందరి కంటే ఒక అడుగు ముందుంటారు. వ్యాపారాల్లో లాభాలకు లోటు ఉండదు. ఉద్యోగపరంగా ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. పెళ్లి ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆక మస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. విదేశీ సంబంధమైన వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు బిజీగా సాగిపోతాయి. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. దూరపు బంధువుల నుంచి సానుకూల సమాచారం అందుకుంటారు. నిరుద్యోగులకు ఆశించిన శుభవార్త అందుకుంటారు. పిల్లలు చదువుల్లో పురోగతి సాధిస్తారు. తోబుట్టువులతో ఆస్తి సంబంధమైన వివాదం ఒకటి సానుకూల పడుతుంది. గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): వృత్తి, ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు మీద పడతాయి. కొత్త ప్రాజెక్టులు చేపట్టడానికి అవకాశం ఉంది. వ్యాపారాలు ఆశాజనకంగా ముందుకు సాగుతాయి. చిన్ననాటి మిత్రులతో విందు కార్య క్రమంలో పాల్గొంటారు. ఒక శుభ కార్యంలో బంధువులకు సహాయంగా ఉంటారు. ఇంటా బయటా ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేసుకోవడం మంచిది. ప్రస్తుతానికి ప్రయాణాలు పెట్టుకోవద్దు. పిల్లలు చదువుల్లో బాగా కష్టపడాల్సి ఉంటుంది. ఆరోగ్యం పరవాలేదు.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): వృత్తి, ఉద్యోగాల్లో పని భారం వల్ల విశ్రాంతి కరువవుతుంది. వ్యాపారాల్లో కొద్దిపాటి లాభాలకు అవకాశం ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలపడతాయి కానీ, పెళ్లి ప్రయత్నాలు ముందుకు సాగవు. ఇల్లు మారే ఆలోచన చేస్తారు. కొత్తగా ఇల్లు కొనడం మీద కూడా దృష్టి పెడతారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఆర్థిక లావాదేవీలు, స్పెక్యులేషన్ వల్ల ఆశించిన ఫలితాలు అందుకుంటారు. ఆరోగ్యం సజావుగా సాగిపోతుంది. గృహ వాతావరణం సామరస్యంగా ఉంటుంది.

Note: ఇక్కడ సమకూర్చిన సమాచారం వారివారి నమ్మకం, విశ్వాసాల మీద ఆధారపడి ఉంటుంది.  దీన్ని నిర్ధారించేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. పాఠకుల ఆసక్తిని, నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సమాచారాన్ని అందించాము.

మరిన్ని జ్యోతిష్య కథనాలు చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.