Horoscope Today: వారికి ఆకస్మిక ధనలాభం పట్టే అవకాశం.. 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు..!
Horoscope Today in Telugu (August 25): జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారంనాడు మీ దినఫలాలు ఎలా ఉండనున్నాయి..? మీ ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుంది..? ఉద్యోగపరంగా మీరు ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొంటారు. ఆగస్టు 26, 2023న(శనివారం) 12 రాశుల వారి రాశిఫలాలు ఎలా ఉంటాయో తెలుసుకోండి..
Horoscope Today in Telugu (August 26): జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారంనాడు మీ దినఫలాలు ఎలా ఉండనున్నాయి..? మీ ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుంది..? ఉద్యోగపరంగా మీరు ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొంటారు. ఆగస్టు 26, 2023న(శనివారం) 12 రాశుల వారి రాశిఫలాలు ఎలా ఉంటాయో తెలుసుకోండి..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): ఆదాయానికి, ఆరోగ్యానికి ఏమాత్రం లోటుండదు. ముఖ్యమైన పనుల్ని సునాయాసంగా పూర్తి చేస్తారు. అనవసర ఖర్చులు పెరిగే సూచనలున్నాయి. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు నిర్వర్తించాల్సి వస్తుంది. వ్యాపారాల్లో వేగం, ఉత్సాహం పెరుగుతాయి. వృత్తి జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతుంది. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలలో సానుకూల స్పందన లభిస్తుంది. అనేక వ్యవహారాలను ఒకేసారి చక్కబెట్టే ప్రయత్నాల వల్ల కొద్దిగా ఇబ్బంది పడతారు.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): పెళ్లి ప్రయత్నాలకు సంబంధించి బంధువుల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో కూడా సానుకూల స్పందన లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఇంటా బయటా గౌరవమర్యాదలు పెరుగుతాయి. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. కుటుంబ జీవితంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): కొన్ని ముఖ్యమైన పనులు అనుకున్నవి అనుకున్నట్టుగా పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో మీ సలహాలు, సూచనలకు విలువ పెరుగుతుంది. వ్యాపారాలు కూడా సజావుగా సాగిపోతాయి. ఇంటా బయటా కాస్తంత ఒత్తిడి ఉండవచ్చు. ఆస్తికి సంబంధించిన వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఆదాయం ఆశించిన స్థాయిలో పెరుగు తుంది. కుటుంబ సభ్యుల మీద భారీగా ఖర్చు చేస్తారు. జీవిత భాగస్వామితో అనుకూలత ఏర్పడుతుంది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): వృత్తి, ఉద్యోగాల్లో బరువు బాధ్యతలు పెరుగుతాయి. కొత్త లక్ష్యాల మీద పని చేయాల్సి వస్తుంది. వ్యాపారాల్లో నష్టాలు తగ్గుముఖం పడతాయి. ఇంటా బయటా మీ ఆలోచనలకు, అభిప్రాయాలకు విలువ పెరుగుతుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. జీవిత భాగస్వామి ద్వారా ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. పెండింగ్ పనులను పూర్తి చేయడం మంచిది. ఇతరులకు సంబం ధించిన బాధ్యతలను మీరు నిర్వర్తించడం వల్ల నష్టపోతారు. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాల్లో ఏదో ఒక ఆటంకం ఎదురవుతుంటుంది. అనవసర వ్యయ ప్రయాసలు తప్పకపోవచ్చు. స్నేహితుల సహాయ సహకారాలతో ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు సంతృప్తికరంగా పరిష్కారం అవుతాయి. ఉద్యోగంలో మీ పనితీరుతో అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారాలు మందకొడిగా ముందుకు సాగుతాయి. కుటుంబ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): వృత్తి, ఉద్యోగాల్లో కొన్ని మార్పులు చేర్పులకు అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికారులు ప్రత్యేక బాధ్యతలను అప్పగించడం జరుగుతుంది. వ్యాపారాల మీద శ్రద్ధ పెంచడం మంచిది. స్నేహితు లతో ఇబ్బందులు తలెత్తవచ్చు. ఎవరినీ గుడ్డిగా నమ్మడం మంచిది కాదు. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ పనికిరాదు. కొన్ని పనులను పూర్తిచేయడంలో శ్రమాధిక్యత పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ముందుకు సాగుతాయి. కోపతాపాలను తగ్గించుకోవడం మంచిది.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): చిన్ననాటి మిత్రులను కలుసుకుని విందులో పాల్గొంటారు. సమాజంలో పలుకుబడి బాగా పెరుగుతుంది. తలపెట్టిన పనులు సంతృప్తికరంగా పూర్తవుతాయి. కుటుంబ సభ్యులతో ఒక శుభ కార్యంలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాల్లో మీ మాటకు, చేతకు విలువ ఏర్పడుతుంది. ఆర్థిక పరిస్థితికి ఢోకా ఉండదు. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. బంధుమిత్రుల్లో కొందరికి ధన సహాయం చేయడం జరుగుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. స్పెక్యులేషన్ లాభిస్తుంది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): ఉద్యోగ జీవితం సంతృప్తికరంగానే సాగిపోతుంది కానీ, వృత్తి, వ్యాపారాల్లో శ్రమ ఎక్కువ ఫలితం తక్కువ అన్నట్టుగా ఉంటుంది. ఇంటా బయటా శ్రమాధిక్యత ఉంటుంది. అవసరానికి సరిపడ డబ్బు అందుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు వ్యయ ప్రయాసలతో పూర్తవుతాయి. స్వల్పంగా అనారోగ్య సమస్యలు బాధించే అవకాశం కూడా ఉంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆలయాలు సందర్శిస్తారు. కొందరు మిత్రులకు కొద్దిగా సహాయం చేయాల్సి వస్తుంది. ఎవరినీ గుడ్డిగా నమ్మ వద్దు.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): వృత్తి, ఉద్యోగాలలోనే కాకుండా, బంధుమిత్రుల్లో కూడా మీ మాట చెల్లుబాటు అవుతుంది. కెరీర్ పరంగా ఒకటి రెండు శుభవార్తలు వింటారు. వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. కొన్ని ముఖ్య మైన వ్యవహారాలు పెద్దగా ప్రయత్నం చేయకుండానే పూర్తవుతాయి. వ్యక్తిగత, కుటుంబ వ్యవహా రాలలో కూడా సఫలం అవుతారు. ఉన్నత స్థాయి వ్యక్తుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. దైవ కార్యాల్లో పాల్గొనడం జరుగుతుంది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): చిన్ననాటి స్నేహితులను గానీ, ప్రాణ స్నేహితులను గానీ కలుసుకునే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో కలిసి విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఒక శుభ కార్యంలో దూరపు బంధువులను కలుసుకుంటారు. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ముఖ్యమైన పనులలో అప్రయత్న కార్యసిద్ధి ఉంటుంది. సోదర వర్గంతో వివాదాలు, విభేదాలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగంలో ఆశించిన గుర్తింపు లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగ సాగిపోతాయి.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): రోజంతా కొద్దిగా మిశ్రమంగా సాగిపోతుంది. ఆదాయ పరిస్థితి అనుకూలంగా ఉంటుంది కానీ, అనవసర ఖర్చులతో ఇబ్బంది పడతారు. ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేయడంలో వ్యయ ప్రయాసలు తప్పకపోవచ్చు. వృత్తి, ఉద్యోగాలలో ఆదరణ, ప్రోత్సాహాలు పెరుగుతాయి కానీ, బరువు బాధ్యతలు మీద పడతాయి. వ్యాపారాల్లో కొద్ది లాభాలతో తృప్తిపడాల్సి వస్తుంది. ఆహార, విహారాల్లో, ప్రయాణాల్లో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ జీవితం సానుకూలంగా సాగిపోతుంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): వృత్తి, వ్యాపారాల్లో సొంత ఆలోచనలు కలిసి వస్తాయి. వ్యక్తిగత విషయాలు ప్రాధాన్యం సంతరించు కుంటాయి. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. మీ మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు మీద పడతాయి. కొంత ఆలస్యంగానైనా అత్యవసర వ్యవహారాలను పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు ఆఫర్లు అందివస్తాయి. విదేశాల్లో వృత్తి, ఉద్యోగాలు చేసుకుంటున్న పిల్లల నుంచి ఆశించిన కబుర్లు వింటారు. ఆరోగ్యం చాలావరకు అనుకూలంగా ఉంటుంది.
Note: ఇక్కడ సమకూర్చిన సమాచారం వారివారి నమ్మకం, విశ్వాసాల మీద ఆధారపడి ఉంటుంది. దీన్ని నిర్ధారించేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. పాఠకుల ఆసక్తిని, నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సమాచారాన్ని అందించాము.
మరిన్ని జ్యోతిష్య కథనాలు చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.