AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Budha Vakri 2023: వక్రించిన మూడు గ్రహాలు.. ఆ రాశుల వారి జీవితంలో పెను మార్పులకు అవకాశం..!

సెప్టెంబర్ 4 వరకు మూడు గ్రహాలు వక్రించి ఉండే అవకాశం ఉంది. దీనివల్ల జీవితాలు వేగం పుంజుకోవడం, అకస్మాత్తుగా యాక్టివిటి పెరగడం, కొన్ని వ్యవహారాలు తారుమారు కావడం వంటివి జరుగుతాయి. కొత్త ప్రయత్నాలకు, కొత్త ఆలోచనలకు అవకాశం ఉంటుంది. ఈ అనుకోని మార్పులు, చేర్పులు కొన్ని రాశుల వారికి సంభ్రమాశ్చర్యాలకు గురి చేయగా, కొన్ని రాశులవారికి కంగారు పెడతాయి.

Budha Vakri 2023: వక్రించిన మూడు గ్రహాలు.. ఆ రాశుల వారి జీవితంలో పెను మార్పులకు అవకాశం..!
Zodiac Signs
TV9 Telugu Digital Desk
| Edited By: Janardhan Veluru|

Updated on: Aug 21, 2023 | 7:07 PM

Share

ఈ నెల 24న బుధ గ్రహం వక్రించడం ప్రారంభం అవుతుంది. ఇది వరకే శని, శుక్ర గ్రహాలు వక్రించి ఉన్నందువల్ల ఇప్పుడు మొత్తం మూడు గ్రహాలు వక్రించినట్టవుతుంది. శనీశ్వరుడు నవంబర్ 4 వరకు, శుక్రుడు సెప్టెంబర్ 4 వరకు, బుధుడు సెప్టెంబర్ 15 వరకు వక్రంలో కొనసాగుతాయి. మొత్తం మీద సెప్టెంబర్ 4 వరకు మూడు గ్రహాలు వక్రించి ఉండే అవకాశం ఉంది. దీనివల్ల జీవితాలు వేగం పుంజుకోవడం, అకస్మాత్తుగా యాక్టివిటి పెరగడం, కొన్ని వ్యవహారాలు తారుమారు కావడం వంటివి జరుగుతాయి. కొత్త ప్రయత్నాలకు, కొత్త ఆలోచనలకు అవకాశం ఉంటుంది. ఈ అనుకోని మార్పులు, చేర్పులు కొన్ని రాశుల వారికి సంభ్రమాశ్చర్యాలకు గురి చేయగా, కొన్ని రాశులవారికి కంగారు పెడతాయి.

మేషం: ఈ రాశివారికి మూడు ప్రధాన గ్రహాలు వక్రించడం వల్ల ఈ పది పదిహేను రోజుల కాలంలో కొన్ని సంభ్రమాశ్చర్యాలను కలిగించే పరిణామాలు చోటు చేసుకుంటాయి. శని, శుక్రుల వక్రగతి వల్ల తప్పకుండా శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి. ఆర్థిక ప్రయత్నాలు సఫలం కావడం, ప్రము ఖులతో పరిచయాలు ఏర్పడడం వంటివి జరుగుతాయి. బుధుడు వక్రించడం వల్ల వెనుకటి అనా రోగ్యాలు తిరగబెట్టే అవకాశం ఉంటుంది. సహోద్యోగులు కుతంత్రాలకు పాల్పడే సూచనలున్నాయి.

వృషభం: ఈ గ్రహాల వక్రగతి వల్ల ఈ రాశివారికి వ్యక్తిగత జీవితంలోనూ, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లోనూ కొన్ని సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి, ఉద్యోగాల్లో అనుకోకుండా బాధ్యతలు పెరగడం, జీతభత్యాలు వృద్ధి చెందడం వంటివి జరుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు, తీర్థయాత్రలు తప్పకపోవచ్చు. తోబుట్టువులతో సఖ్యత ఏర్పడుతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సాధించే అవకాశం ఉంది. ఆహార విహారాల్లోనూ, ప్రయాణాల్లోనూ జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.

మిథునం: ఈ రాశివారికి శని, శుక్రుల వక్రగతి వల్ల ఆర్థికంగా ప్రయోజనాలు చేకూరుతాయి. విదేశీ కనెక్షన్లు, విదేశీ సంబంధమైన ఆదాయానికి అవకాశం ఉంది. శుభవార్తలు అందుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. తండ్రి వైపు నుంచి ఆస్తి కలిసి వచ్చే అవకాశం కూడా ఉంది. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. అయితే, రాశినాథుడైన బుధుడు వక్రించడం వల్ల అనవసర స్నేహాలు ఏర్పడడం, వ్యసనాలు అలవాటు కావడం వంటివి జరగవచ్చు.

కర్కాటకం: శుక్ర, బుధ గ్రహాల వక్రగతి వల్ల ఈ రాశివారికి ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంటుంది. వ్యక్తిగత సమస్యలు పరిష్కారం కావడం, కుటుంబ వ్యవహారాలు చక్కబడడం, ధనాదాయం పెరగడం, ఆర్థిక సమస్యలు పరిష్కారం కావడం వంటివి జరుగుతాయి. పెండింగ్ పనులన్నీ వేగంగా పూర్తయిపోతాయి. అష్టమంలో ఉన్న శని వక్రించడం వల్ల జీవిత భాగస్వామితో తరచూ కలహాలు, మధ్య మధ్య కుటుంబ సమస‍్యలు తప్పకపోవచ్చు. ఇంటా బయటా ఒత్తిడి ఉంటుంది.

సింహం: ఈ రాశిలో బుధ గ్రహం వక్రించడం వల్ల ఆర్థిక వ్యవహారాలు, ఆర్థిక ప్రయత్నాలు ప్రాధాన్యం సంత రించుకుంటాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా ఆదాయం బాగా పెరుగుతుంది. ఆర్థికంగా ఏ ప్రయత్నం తలపెట్టినా వీలైనంతగా సఫలం అవుతాయి. శుక్రుడు వక్రించడం వల్ల జీవిత భాగ స్వామితో అన్యోన్యత పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాల్లో అనుకూలతలు ఏర్పడతాయి. సప్తమంలో శనీశ్వరుడు వక్రించడం వల్ల ఇతరులు ఎక్కువగా ఉపయోగించుకోవడం జరుగుతుంది.

కన్య: శని, శుక్రులు వక్రించడం వల్ల అనేక శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి, ఉద్యోగాల్లో స్తబ్ధత తొలగిపోతుంది. ఆశించిన పురోగతి ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక సమస్యలు చాలావరకు తొలగిపోతాయి. ప్రత్యర్థులు, పోటీదార్లు బాగా తగ్గి ఉంటారు. బంధువుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. అయితే, రాశినాథుడైన బుధుడు వ్యయ స్థానంలో వక్రించడం వల్ల దూర ప్రాంతాలలో ఉద్యోగాలు లభించడం జరుగుతుంది. అనారోగ్యం ఇబ్బంది పెడుతుంది.

తుల: ఈ విధంగా మూడు గ్రహాలు వక్రించడం వల్ల ఈ రాశివారికి మహాయోగం పట్టే అవకాశం ఉంది. ఏ ప్రయత్నం తలపెట్టినా కలిసి వస్తుంది. మనసులోని ముఖ్యమైన కోరికలు నెరవేరుతాయి. వ్యక్తిగత సమస్యలేవైనా ఉంటే పరిష్కారం అవుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలలో రాబడి అంచనాలకు మించి పెరుగుతుంది. ఆశ్చర్యం కలిగించే విధంగా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. కొద్ది ప్రయత్నంతో సంపన్నులు అయ్యే అవకాశం ఉంది.

వృశ్చికం: ఈ రాశివారికి తొమ్మిది, పది స్థానాలలో శుక్ర, బుధులు వక్రించడం వల్ల తప్పకుండా ఊహించని అదృష్టాలు పడతాయని చెప్పవచ్చు. వృత్తి, ఉద్యోగాల్లో సానుకూల మార్పులు చోటు చేసుకుం బటాయి. అందలాలు ఎక్కే అవకాశం ఉంది. జీతభత్యాలు అంచనాలకు మించి పెరుగుతాయి. నాలుగవ స్థానంలో శనీశ్వరుడు వక్రించడం వల్ల కుటుంబంలో అనుకకోకుండా చికాకులు ఏర్పడ వచ్చు. గృహ, వాహన వ్యవహారాల్లో ఇబ్బందులు తలెత్తవచ్చు. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి.

ధనుస్సు: శని, బుధ గ్రహాలు వక్రించడం వల్ల రాజయోగం పట్టే అవకాశం ఉంది. ఏమాత్రం ఊహించని విధంగా అధికార యోగం పట్టే సూచనలున్నాయి. విదేశాల నుంచి ఆహ్వానాలు అందుతాయి. జీవితం ఉన్నత స్థాయి చేరుకుంటుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. మీ మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో స్థిరత్వం ఏర్పడుతుంది. అష్టమ స్థానంలో శుక్రుడు వక్రించడం వల్ల అనవసర పరిచయాలు ఏర్పడతాయి. డబ్బు నష్టం అవు తుంది.

మకరం: శని, శుక్ర, బుధుల వక్రగతి వల్ల అనేక విధాలుగా లాభపడడం జరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలు పెరగడం, ఒత్తిడి నుంచి ఉపశమనం లభించడం, ఆదాయం, ఆరోగ్యం మెరుగు పడడం వంటివి జరుగుతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆస్తి వివా దాలు పరిష్కారం అవుతాయి. కుటుంబానికి, పిల్లలకు సంబంధించి అనుకోకుండా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.

కుంభం: బుధ గ్రహం వక్రించడం వల్ల ఈ రాశివారికి ఆదాయం పెరగడం, ఆరోగ్యం మెరుగుపడడం వంటివి జరుగుతాయి. పిల్లలకు సంబంధించి శుభవార్తలు వినడం, శుభకార్యాలు జరగడం వంటి వాటికి అవకాశం ఉంది. మీ ఆలోచనలు, ప్రయత్నాలు సఫలం అవుతాయి. అయితే, శని, శుక్రుల వక్ర గతి వల్ల వృత్తి, ఉద్యోగాల్లో ‘అనుకున్నదొకటి, అయిందొకటి’ అన్నట్టుగా ఉంటుంది. వ్యాపారాల్లో కూడా అంచనాలు తారుమారయ్యే సూచనలున్నాయి. ఓర్పు సహనాలతో వ్యవహరించడం మంచిది.

మీనం: శుక్ర, బుధులు వక్రించడం వల్ల కొన్ని ఆశ్చర్యకర పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఏ మాత్రం ఊహించని సంస్థల నుంచి ఆఫర్లు అందుతాయి. రాదనుకుని చాలాకాలం క్రితమే వదిలేసుకున్న డబ్బు అప్రయత్నంగా చేతికి అందుతుంది. ఆస్తి విలువ ఆశించిన దానికంటే ఎక్కువగా పెరుగు తుంది. వ్యయ స్థానంలో ఉన్న శనీశ్వరుడి వక్రగతి వల్ల వైద్య ఖర్చులు తగ్గడం, శుభ కార్యాల మీద ఖర్చు పెరగడం జరుగుతుంది. అనుకోకుండా విదేశీ ప్రయాణాలకు అవకాశం ఉంటుంది.

Note: ఇక్కడ సమకూర్చిన సమాచారం వారివారి నమ్మకం, విశ్వాసాల మీద ఆధారపడి ఉంటుంది.  దీన్ని నిర్ధారించేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. పాఠకుల ఆసక్తిని, నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సమాచారాన్ని అందించాము.

మరిన్ని జ్యోతిష్య కథనాలు చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.