Horoscope Today: వారికి వృత్తి, వ్యాపారాలు అనుకూలం.. 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

Daily Horoscope in Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహనక్షత్రాలు సోమవారం మీ జాతకచక్రానికి అనుకూలంగా ఉన్నాయా..? ఆరోగ్యం, ఆర్థికపరంగా మీ జాతకం ఎలా ఉండబోతుంది..? ఉద్యోగపరంగా మీ రాశికి దిన ఫలాలు సానుకూలంగానే ఉన్నాయా..? ఆగస్టు 19, 2023న(శనివారం) 12 రాశుల వారి రాశిఫలాలు ఎలా ఉంటాయో తెలుసుకోండి..

Horoscope Today: వారికి వృత్తి, వ్యాపారాలు అనుకూలం.. 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
Horoscope 21st August 2023
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: శివలీల గోపి తుల్వా

Updated on: Aug 21, 2023 | 6:12 AM

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): కుటుంబ సభ్యులతో ఉత్సాహంగా కాల.క్షేపం చేస్తారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలను విస్తరించుకునే ప్రయత్నాలు ప్రారంభిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగంలో మరింత అనుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది. కొందరు మిత్రులకు సహాయ సహకారాలు అందజేస్తారు. ఆరోగ్యం విష యంలో జాగ్రత్తగా ఉండాలి. వివాహ ప్రయత్నాల్లో తప్పకుండా సానుకూల స్పందన లభిస్తుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): వృత్తి, వ్యాపారాలను ఎక్కువగా సొంత ఆలోచనలతో నిర్వహించుకోవడం మంచిది. ఇంటా బయటా బాధ్యతలు పెరుగుతాయి. ఉద్యోగులకు అధికారుల నుంచి ఆశించిన ఆదరణ, ప్రోత్సాహం లభి స్తాయి. ముఖ్యమైన పనులు, వ్యవహారాలు సకాలంలో సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఆర్థిక పరి స్థితి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది. వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. ప్రస్తుతానికి ప్రయాణాలు పెట్టుకోవద్దు.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): వృత్తి, వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. కుటుంబంలో ఆనందోత్సాహాలు పెరుగుతాయి. ఉద్యోగంలో అదనపు బాధ్యతల వల్ల విశ్రాంతి కరవవుతుంది. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి పెడ తారు. తలపెట్టిన పనులు కొద్దిగా ఆలస్యంగా పూర్తవుతాయి. పిల్లలు చదువుల్లో పురోగతి సాధి స్తారు. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. మంచి కంపెనీల నుంచి ఉద్యోగావకాశాలు కలిసి వస్తాయి. ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రయాణాలు లాభిస్తాయి.

ఇవి కూడా చదవండి

కర్కాటకం (పునర్వసు 4, పు‌ష్యమి, ఆశ్లేష): బంధువుల రాకపోకలు ఉంటాయి. కొత్తగా వ్యాపారాలు ప్రారంభించాలనే ఆలోచన చేస్తారు. వృత్తి, ఉద్యోగాలలో సానుకూల వాతావరణం ఉంటుంది. మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. నిరుద్యోగులకు దూర ప్రాంతం నుంచి ఆశించిన సమాచారం అందవచ్చు. పెళ్లి ప్రయత్నాలు సానుకూలపడతాయి. తలపెట్టిన పనులలో శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. కుటుంబ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ప్రయాణాలు లాభిస్తాయి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): అధికారులతో ఆచితూచి వ్యవహరించడం శ్రేయస్కరం. వృత్తి, ఉద్యోగాల్లో అపార్థాలు తలెత్తే అవ కాశం ఉంది. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, ఖర్చులు తగ్గించుకోవడం, పొదుపు పాటిం చడం మంచిది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్ర చేసే సూచనలున్నాయి. వ్యాపారం ఆశాజనకంగా ఉంటుంది. ప్రయాణాలు వాయిదా వేయ డం మంచిది. బంధుమిత్రులకు ఆర్థికంగా అండగా నిలబడతారు. ఎవరికీ హామీలు ఉండవద్దు.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): అనుకోకుండా పెండింగ్ పనులు పూర్తయి ఊరట లభిస్తుంది. ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా కాలక్షేపం చేస్తారు. వృత్తి, వ్యాపారాలలో అంచనాలకు మించి లాభాలు అందుతాయి. దీర్ఘకాలిక ఆర్థిక సమస్యల నుంచి కొంత వరకూ బయటపడతారు. ఉద్యోగంలో ప్రోత్సాహకర వాతా వరణం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. పెళ్లి ప్రయత్నాలలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారమవుతుంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): కొన్ని ప్రయత్నాలు, వ్యవహారాలలో తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితాలు పొందుతారు. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ బాగా పెరిగి, క్షణం కూడా తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. కొత్త ఉద్యోగావకాశాలు అందివస్తాయి. ఆదాయానికి లోటు ఉండదు. విలాసాల మీద ఎక్కువగా ఖర్చు చేయడం జరుగుతుంది. కుటుంబ వ్యవహారాల్లో సామరస్యం పెరుగుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరిగి, దైవ కార్యాల్లో పాల్గొంటారు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): కుటుంబ సభ్యుల తోడ్పాటుతో దీర్ఘకాలిక ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. అనుకోకుండా ఒక శుభ పరిణామం చోటు చేసుకుంటుంది. భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా ప్రముఖులతో పరిచయాలు ఏర్పడుతాయి. తలపెట్టిన వ్యవహారాల్లో పురోగతి ఉంటుంది. నిరుద్యోగులకు శుభ వార్తలు అందుతాయి. వృత్తి, వ్యాపారాల్లో ఒక మోస్తరు లాభాలుంటాయి. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఆహార, విహారాల్లోనూ, ప్రయాణాల్లోనూ వీలైనంత జాగ్రత్తగా ఉండాలి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): రియల్ ఎస్టేట్ రంగానికి చెందినవారికి, స్థలాలు లేదా ఇళ్లు అమ్ముకుంటున్నవారికి అంచనాలకు మించి లాభాలు అందే అవకాశం ఉంది. చేపట్టిన పనులు, వ్యవహారాల్లో కార్యసిద్ధి ఉంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసు కుంటారు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగావకాశాలు  లభిస్తాయి. ఉద్యోగంలో అధికారుల ఆదరణ లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు అనుకూల ఫలితాలను ఇస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): వృత్తి, ఉద్యోగాల్లో పనిభారం పెరిగినప్పటికీ, ఆశించిన స్థాయిలో ప్రతిఫలం ఉంటుంది. ఉద్యోగ పరంగా శుభవార్తలు అందే అవకాశం కూడా ఉంది. వృత్తి జీవితం వేగం పుంజుకుంటుంది. వ్యాపా రాల్లో ఆశించిన ఫలితాలు ఉంటాయి. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు ఫలించవచ్చు. కొందరు బంధువుల వల్ల ఇబ్బందులు ఏర్పడవచ్చు. ఆర్థిక విష యాల్లో మోసపోయే సూచనలున్నాయి. మిత్రుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): అదనపు ఆదాయం కోసం కొత్త మార్గాలను వెతుకుతారు. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిగా స్తబ్ధత ఏర్పడుతుంది. ఉద్యోగం సాధారణంగా సాగిపోతుంది. ముఖ్యమైన పనులు ఆలస్యం అవుతాయి. మీ నుంచి సహాయం  పొందినవారు ముఖం చాటేస్తారు. ప్రస్తుతానికి హామీలు ఉండడం, వాగ్దానాలు చేయడం చేయవద్దు. ఇంటా బయటా ఒత్తిడి ఉంటుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. కుటుంబ బాధ్యతలను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): ఆర్థిక వ్యవహారాలు విజయవంతం అవుతాయి. ఆర్థిక పరిస్థితి చక్కబడుతుంది. కొత్త ప్రయ త్నాలు, కొత్త ఆలోచనలు కలిసి వస్తాయి. ఇప్పుడు తీసుకునే నిర్ణయాల వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యానికి, ఆదాయానికి ఢోకా ఉండదు. బంధువులకు ఇతోధికంగా సహాయం చేస్తారు. కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైన కార్యకలాపాలు పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలలో లాభాలు పెరుగుతాయి. ప్రయాణాలు లాభిస్తాయి.

Note: ఇక్కడ సమకూర్చిన సమాచారం వారివారి నమ్మకం, విశ్వాసాల మీద ఆధారపడి ఉంటుంది.  దీన్ని నిర్ధారించేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. పాఠకుల ఆసక్తిని, నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సమాచారాన్ని అందించాము.

మరిన్ని జ్యోతిష్య కథనాలు చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

హై కొలెస్ట్రాల్‌కు ఛూమంత్రం.. కొవ్వు ఐస్‌లా కరగాల్సిందే..
హై కొలెస్ట్రాల్‌కు ఛూమంత్రం.. కొవ్వు ఐస్‌లా కరగాల్సిందే..
కొత్త అవతారం ఎత్తిన మాజీ కెప్టెన్! శాంటాక్లాజ్‌ కాదు తలా క్లాజ్
కొత్త అవతారం ఎత్తిన మాజీ కెప్టెన్! శాంటాక్లాజ్‌ కాదు తలా క్లాజ్
ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్
ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన