బీ కేర్ ఫుల్.. వీరికి జీలకర్ర నీళ్లు విషంతో సమానం!

Samatha

11 February 2026

జీలకర్ర నీళ్లు ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రతి రోజూ ఉదయం జీరా వాటర్ తాగడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

జీలకర్ర నీరు

అయితే జీలకర్ర నీళ్లు ఆరోగ్యానికి చాలా మేలు చేసినప్పటికీ కొన్ని సమస్యలు ఉన్నవారు వీటిని తీసుకోవడం చాలా ప్రమాదకరం. వారు ఎవరంటే?

వీరికి ప్రమాదం

డయాబెటీస్ సమస్యతో బాధపడే వారు వీటికి ఎంత దూరం ఉంటే అంత మంచిది, ఎందుకంటే? ఈ నీరు తాగడం వలన  రక్తంలో షుగర్ లెవల్స్ త్వరగా పడిపోయే ఛాన్స్ ఉంది.

డయాబెటీస్

జీలకర్ర నీళ్లు జీర్ణక్రియ సాఫీగా సాగేలా చేస్తాయి. కానీ కొన్ని సార్లు ఇవి గుండెల్లో మంట, గ్యాస్‌కు కారణం అయ్యే ఛాన్స్ ఉంది.

గ్యాస్

బాలింతలు కూడా జీలకర్ర నీరు అతిగా తీసుకోకూడదు, వీరు వీటిని తాగడం వలన పాల ఉత్పత్తి తగ్గే ఛాన్స్ ఎక్కువ ఉందని చెబుతున్నారు నిపుణులు.

బాలింతలు

గర్భధారణ సమయంలో కూడ జీలకర్ర నీరు తీసుకోకూడదు, ఎందుకంటే వీటి వలన కొన్ని సార్లు గర్భస్రావం అయ్యే ఛాన్స్ ఎక్కువ.

గర్భిణీలు

అదే విధంగా కొన్ని రకాల మందులు వాడే వారు, శస్త్ర చికిత్సలకు ముందు కూడా జీరా వాటర్ తాగడం ఆరోగ్యానికి మంచిది కాదు అంటున్నారు నిపుణులు.

మందులు వాడేవారు

నోట్ : పై సమాచారం కేవలం ఇంటర్నెట్ ఆధారంగా మాత్రమే ఇవ్వడం జరిగింది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

ముఖ్య గమనిక