ప్రేమానంద్ జీ మహారాజ్ :ఎవరూ మీకు సపోర్ట్ చేయనప్పుడు చేయాల్సింది ఇదే!
Samatha
11 February 2026
ప్రేమానంద్ జీ మహారాజ్ సందేశాలు ప్రతి ఒక్క రికీ ఎంతగానో ఉపయోగపడతాయి. ఆయన బంధాలు, బంధుత్వాలు, జీవితం, జీవితంలో ఎదురయ్యే సవాల్‌ల గురించి గొప్పగా తెలియజేశాడు.
ప్రేమానంద్ జీ మహారాజ్
ముఖ్యంగా ఆయన ఒక వ్యక్తి జీవితం అనేది అత్యంత సవాల్‌తో కూడుకున్నది, కొన్ని సార్లు మీరు ఒంటరిగా మిగలొచ్చు, ఆ సమయంలో కూడా మీ పోరాటం ఆపకూడదు అని తెలిపారు.
జీవితం ఒక సవాల్
కాగా, ఇప్పుడు ప్రేమానంద్ జీ మహారాజ్ విలువైన ఆలోచనలు ఏవి? జీవితంలో ఎవరూ మీకు సపోర్ట్ చేయనప్పుడు ఆయన ఇచ్చిన సందేశాలు ఏవో చూద్దాం.
ప్రేమానంద్ జీ సందేశాలు
తనతో తాను కూర్చోవడం నేర్చుకున్న వ్యక్తికి మరెవరూ అవసరం లేదు..శాంతి సహనం గొప్ప బలం, బలహీనత కాదు.
తనకోసం తానే..
మీతో మీరు ఉండటం, మీతో మీరు కొన్నిసార్లు మాట్లాడటం నేర్చుకోవాలి. తనకు తానే అనే విషయాన్ని తెలుసుకున్న వ్యక్తికి మరెవరితో అవసరం లేదు.
మీతో మీరు ఉండటం
మీతో అవసరం ఉన్న వరకు ప్రతి ఒక్కరూ మీతో ఉండటానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు, వారికి మీతో పని పూర్తి అయ్యిందంటే, వారికి ఇక మీతో అవసరం లేనట్లే.
అవసరం వరకే బంధాలు
మీ ఆనందం కోసం ఇతరులపై ఆధారపడటం మానేసినప్పుడే నిజమైన స్వేచ్ఛ లభిస్తుంది. చాలా సంతోషంగా గడుపుతారు.
స్వేచ్ఛగా జీవించడం
ఒంటరిగా సమయం గడపడం అలవాటు చేసుకోండి ఎందుకంటే ఇది ఒక వ్యక్తి యొక్క ధైర్యాన్ని , ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.
ఆత్మ విశ్వాసం పెంచుకోవడం
ఒంటరిగా నడిచే ధైర్యం ఒక వ్యక్తిని నిజంగా నిర్వచిస్తుంది. తమంతట తాముగా నిలబడే వారు మాత్రమే జీవితంలో నిజమైన స్వేచ్ఛ , గౌరవాన్ని పొందుతారు.