- Telugu News Photo Gallery Spiritual photos Astro Tips in Telugu: These zodiac signs are first in taking independent decisions
Zodiac Signs: సొంత నిర్ణయాలు తీసుకోవడంలో ఈ అయిదు రాశులు వారు ఫస్ట్.. అందులో మీరున్నారా?
జాతక చక్రంలో పన్నెండు రాశులు ఉన్నప్పటికీ, ఇందులో అయిదు రాశులవారిలో పట్టుదల, మొండితనం ఏ పాలు ఎక్కువగా వ్యక్తం అవుతుంటాయి. వీరు ఎవరి మీదా ఆధారపడకుండా సొంత నిర్ణయాలు, సొంత ఆలోచనలు చేస్తుంటారు. ఒకసారి నిర్ణయం తీసుకుంటే దానిని వీరు మార్చుకోవడం జరగదు. ఈ లక్షణాలు చిన్నప్పటి నుంచే వీరిలో కనిపిస్తుంటాయి.
Updated on: Aug 22, 2023 | 7:27 PM

జాతక చక్రంలో పన్నెండు రాశులు ఉన్నప్పటికీ, ఇందులో అయిదు రాశులవారిలో పట్టుదల, మొండితనం ఏ పాలు ఎక్కువగా వ్యక్తం అవుతుంటాయి. వీరు ఎవరి మీదా ఆధారపడకుండా సొంత నిర్ణయాలు, సొంత ఆలోచనలు చేస్తుంటారు. ఒకసారి నిర్ణయం తీసుకుంటే దానిని వీరు మార్చుకోవడం జరగదు. ఈ లక్షణాలు చిన్నప్పటి నుంచే వీరిలో కనిపిస్తుంటాయి. ఇది చివరి క్షణం వరకూ కొనసాగుతుంది. చివరి వరకూ ఈ రాశుల వారు సాధారణంగా ఎవరి మీదా ఆధార పడరు. ఆధారపడాల్సిన పరిస్థితి తెచ్చుకోరు. ఈ రాశులవారికి విలక్షణమైన వ్యక్తిత్వాలు. ఈ రాశులు మేషం, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం. ఈ రాశులకు చెందిన వ్యక్తుల గురించి విపులంగా తెలుసుకుందాం.

మేషం: అతి త్వరగా నిర్ణయాలు తీసుకోవడం ఈ రాశివారి సహజ లక్షణం. బహుశా ఆ కారణంగానే వీరిలో నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఒకసారి ఓ నిర్ణయం తీసుకుంటే దానికి పూర్తిగా కట్టుబడి ఉంటారు. ఎటువంటి పరిస్థితుల్లోనే దాన్ని మార్చుకునే అవకాశం ఉండదు. ఇక జీవిత కాలంలో ఎవరి మీదా ఆధారపడే అవకాశమే ఉండదు. చివరికి పిల్లల మీద కూడా ఆధార పడడం జరగదు. వృద్ధాప్యంలో కూడా ఈ రాశివారు స్వతంత్రంగా జీవించడానికే ప్రాధాన్యమిస్తారు.

వృశ్చికం: సాధారణంగా ఈ రాశివారు సొంత ఆలోచనలతో నిర్ణయాలు తీసుకుంటారు. వీరిలో పట్టుదల, మొండితనం, గోప్యత కాస్తంత ఎక్కువగా ఉంటాయి. నిర్ణయం తీసుకున్న విషయాన్ని ఎవరికీ తెలియ నివ్వరు. నిర్ణయం తీసుకున్న తర్వాత ఇతరుల అభిప్రాయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. అయితే, నిర్ణయాలు మార్చుకకునే అవకాశం మాత్రం ఉండదు. ఇతరుల మీద ఆధారపడడం కూడా చాలా తక్కువ. వృద్ధాప్యంలో కూడా ఎవరిపైనా ఆధారపడడం జరగదు.

ధనుస్సు: అతి వేగంగా నిర్ణయాలు తీసుకోవడంలో, సునిశిత పరిశీలనలో, సొంత ఆలోచనల్లో దిట్టలైన ఈ రాశివారిలో నాయకత్వ లక్షణాలు ఓ పాలు ఎక్కువనే చెప్పాలి. చిన్నప్పటి నుంచి వీరివన్నీ స్వతంత్ర భావాలు. సొంత నిర్ణయాలు, అభిప్రాయాల విషయంలో రాజీపడే ప్రసక్తే ఉండదు. నిర్ణయాలు తీసుకునే ముందు లోతుగా ఆలోచించడం వీరి సహజ లక్షణం. సాధారణంగా వీరు ఏ వయసులోనూ ఎవరి మీదా భౌతికంగా గానీ, మానసికంగా గానీ ఆధారపడే అవకాశం ఉండదు.

మకరం: ఈ రాశివారికి తమ మీద తమకు నమ్మకం ఎక్కువ. చిన్నప్పటి నుంచి తమ బాధ్యతలను ఎవరికీ అప్పగించరు. నిర్ణయాలు తీసుకునే విషయంలో సాధారణంగా ఎవరినీ సంప్రదించరు. స్వతంత్ర భావాలు ఎక్కువ. స్వయం కృషికి, ఆత్మవిశ్వాసానికి ప్రాధాన్యమిస్తారు. వీరిలో మొండి పట్టుదల, మొండి ధైర్యం కాస్తంత ఎక్కువే. సాధారణంగా ఎవరి మీదా ఆధారపడే అవకాశం ఉండదు. వృద్ధాప్యంలో కూడా ఎవరి మీదా ఆధారపడడం జరగదు. అన్నిటికీ ముందే ప్లాన్ చేసుకుంటారు.

కుంభం: ఈ రాశివారిలో గోప్యత ఎక్కువగా ఉంటుంది. మూడో కంటికి తెలియకుండా నిర్ణయాలు తీసు కోవడం, వాటిని వెంటనే అమలు చేయడం వీరి ప్రత్యేకత. ఈ రాశివారికి సొంత తెలివితేటల మీద నమ్మకం ఎక్కువ. ఏ విషయంలోనూ ఒక పట్టాన రాజీపడరు. తన బాధ్యతలను తాను క్రమ శిక్షణతో పూర్తి చేస్తారు. ఆత్మ విశ్వాసంతో, ఆత్మస్థయిర్యంతో వ్యవహరిస్తారు. వృద్ధాప్యంలో కూడా తన పనులు తాను చేసుకోవడానికే ప్రాధాన్యం ఇస్తారు. సాధారణంగా ఎవరి మీదా ఆధారపడరు.



