Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dengue Vaccine: డెంగ్యూ జ్వరంపై యుద్ధం.. భారత్ నుంచి తొలి వ్యాక్సిన్.. హైదరాబాద్‌కి చెందిన ఆ కంపెనీ..

Dengue Vaccine:

Dengue Vaccine: డెంగ్యూ జ్వరంపై యుద్ధం.. భారత్ నుంచి తొలి వ్యాక్సిన్.. హైదరాబాద్‌కి చెందిన ఆ కంపెనీ..
Dengue Vaccine
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Aug 25, 2023 | 7:00 AM

Dengue Vaccine: డెంగ్యూపై వార్‌ ప్రకటించిన భారత్ వ్యాక్సిన్‌ తయారీకి సిద్ధమవుతోంది. హైదరాబాద్‌కు చెందిన ఇండియన్‌ ఇమ్యూనాలాజికల్స్‌ లిమిటెడ్‌ టీకా తయారు చేసేందుకు ముందుకొచ్చింది. ఈ మేరకు వర్షాకాలంలో ప్రాణాంతక వ్యాధిగా ప్రజలను వేధిస్తున్న డెంగ్యూ ఫీవర్‌కి విరుగుడు వ్యాక్సిన్‌ని 2026 నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇక దీనికి సంబంధించిన ప్రాథమిక దశ ప్రయోగాలు ఇప్పటికే ముగిశాయని, వాటిల్లో ఎలాంటి ప్రతికూల ఫలితాలు రాలేదని హైదరాబాద్‌ కంపెనీ తెలిపింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. దోమకాటుతో భారత్‌లో చాలా మందిని పీడిస్తున్న డెంగ్యూని అరికట్టడానికి టీకా రాబోతోంది. హైదరాబాద్‌కు చెందిన ఇండియన్‌ ఇమ్యూనాలాజికల్స్‌ లిమిటెడ్‌ .. IIL కంపెనీ డెంగ్యూ ఫీవర్ వ్యాక్సిన్‌ను తయారు చేస్తోంది. టీకా అందుబాటులోకి వస్తే డెంగ్యూను నివారించడానికి చాలా ఉపయోగపడుతుందని వైద్య నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో 2026 నాటికి భారత్‌లో డెంగ్యూ వ్యాక్సిన్‌ వచ్చే అవకాశాలున్నాయి.

డెంగ్యూ వ్యాధి లెక్కలను ఓ సారి పరిశీలిస్తే.. ఈ ఏడాది ఇప్పటి వరకు 31 వేల 464 డెంగ్యూ కేసులు నమోదు అయ్యాయి. అలాగే 36 మంది మంది దీని బారిన పడి చనిపోయారు. వ్యాక్సిన్‌ తయారీ ప్రాధమిక దశలో ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ బయటపడలేదని వ్యాక్సిన్ తయారు చేస్తున్న సైంటిస్టులు చెబుతున్నారు. దోమల కారణంగా ప్రబలుతున్న ఈ వ్యాధితో దేశంలో చాలా ప్రాంతాల ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. కరోనా సమయంలో డెంగ్యూ కేసులు తగ్గినప్పటికి 2020-21 మధ 333 శాతం కేసుల పెరగ్గా , 2021-22లో 21 శాతం పెరిగాయి.

ఇవి కూడా చదవండి

 డెంగ్యూపై బ్రహ్మాస్త్రం..

దీంతో డెంగ్యూకి చెక్ పెట్టాలనుకున్న సైంటిస్టులు 90 మందిపై క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించారు. 18-50 ఏళ్ల మధ్య ఉన్న వాళ్లపై ట్రయల్స్‌ నిర్వహించగా.. వీరిలో ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ కనబడలేదని సైంటిస్టులు తెలిపారు. అలాగే రెండు మూడేళ్లలో రెండో దశ ట్రయల్స్‌ జరుగుతాయి. జనవరి 2026 నాటికి దేశ ప్రజలకు డెంగ్యూ వ్యాక్సిన్‌ అందుబాటు లోకి వచ్చే అవకాశం ఉంది. భారత్‌లో హైదరాబాద్‌కు చెందిన ఇండియన్‌ ఇమ్యూనాలాజికల్స్‌ లిమిటెడ్‌ .. IIL కంపెనీ డెంగ్యూ వ్యాక్సిన్‌ తయారు చేస్తోంది. అమెరికాకు చెందిన నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ సహకారంతో ఈ టీకా తయారు చేస్తున్నారు. IILతో పాటు సీరం ఇనిస్టిట్యూట్‌ , పనేషియా బయోటిక్‌ కూడా డెంగ్యూ వ్యాక్సిన్‌ను తయారు చేస్తున్నాయి. IIL కంపెనీ 50 దేశాలకు వివిధ రకాల టీకాలను ఎగుమతి చేస్తోంది. రాబీస్‌ వ్యాక్సిన్‌ తయారీలో ఈ సంస్థ అగ్రగామిగా ఉంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..