Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Asia Cup 2023: హార్దిక్ పాండ్యాపై మళ్లీ ట్రోల్స్.. ఈ సారి ‘వైస్ కెప్టెన్’ ఏం చేశాడంటే..? వైరల్ మీమ్స్‌లో చూసేద్దా రండి..

Asia Cup 2023: హార్దిక్ ఏం చేయకపోయినా నెటిజన్లు ఎందుకు ట్రోల్ చేస్తున్నారంటే అందుకు అతను కాదు.. టీమిండియా సెలెక్టర్లు, రోహిత్ శర్మ నిర్ణయమే కారణమని చెప్పుకోవాలి. ఇంతకీ అసలేం జరిగిందంటే..? ఆసియా కప్ టోర్నమెంట్ ఆగస్టు 30 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో సోమవారం భారత జట్టును ప్రకటించారు. టీమిండియాను రోహిత్ శర్మనే యధావిధిగా నడిపించనున్నాడు. అలాగే వన్డే టీమ్ వైస్ కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యానే ఉంటాడని రోహిత్ శర్మ సోమవారం జట్టును..

Asia Cup 2023: హార్దిక్ పాండ్యాపై మళ్లీ ట్రోల్స్.. ఈ సారి ‘వైస్ కెప్టెన్’ ఏం చేశాడంటే..? వైరల్ మీమ్స్‌లో చూసేద్దా రండి..
Hardik Pandya
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Aug 22, 2023 | 6:14 AM

Asia Cup 2023: వెస్టిండీస్‌తో ఇటీవల జరిగిన టీ20 సిరీస్ సందర్భంగా హార్దిక్ పాండ్యాను స్వార్థపరుడు అంటూ ట్రోల్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఏ కారణంగా లేకున్నా హార్దిక్‌ని క్రికెట్ అభిమానులు, నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. హార్దిక్ ఏం చేయకపోయినా నెటిజన్లు ఎందుకు ట్రోల్ చేస్తున్నారంటే అందుకు అతను కాదు.. టీమిండియా సెలెక్టర్లు, రోహిత్ శర్మ నిర్ణయమే కారణమని చెప్పుకోవాలి. ఇంతకీ అసలేం జరిగిందంటే..? ఆసియా కప్ టోర్నమెంట్ ఆగస్టు 30 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో సోమవారం భారత జట్టును ప్రకటించారు. టీమిండియాను రోహిత్ శర్మనే యధావిధిగా నడిపించనున్నాడు.

అలాగే వన్డే టీమ్ వైస్ కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యానే ఉంటాడని రోహిత్ శర్మ సోమవారం జట్టును ప్రకటిస్తున్న సందర్భంలోనే స్పష్టం చేశాడు. ఇదే హార్దిక్ పాండ్యా ట్రోల్ కావడానికి దారి తీసింది. జట్టులోకి బూమ్రా, కేఎల్ రాహుల్ వంటి ప్లేయర్లు వచ్చాక కూడా హార్దిక్ అవసరమా అంటూ మీమ్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

భారత జట్టు..

జట్టును ప్రకటిస్తున్న చీఫ్ సెలెక్టర్ అజిత్..

ఏం చూశారో,  ఏమో..

ఎందుకో తెలియట్లే..

బూమ్రా ఉన్నాడుగా..

ఫూలీష్ థింగ్..

బ్యాడ్ న్యూస్..

ఓడిపోయేలా చేస్తాడు..!

బూమ్ బూమ్ బూమ్రా..

కాగా, ఆసియా కప్ ద్వారా కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ పునరాగమనం చేయనున్నారు. అలాగే తిలక్ వర్మ వన్డే క్రికెట్‌లోని అరంగేట్రం చేయనున్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..