AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diabetes: డయాబెటిక్ పేషెంట్లు తప్పక తినాల్సిన 3 కూరగాయలు.. తిన్నారంటే షుగర్ లెవెల్స్‌పై పైచేయి మీదే..

Diabetes Diet: డయాబెటీస్‌కి చికిత్స లేనందుకు దీని బారిన పడినవారు జీవితాంతం ఆహారంపై జాగ్రత్తలు పాటించాల్సిందే. లేదంటూ షుగర్ లెవెల్స్ అమాంతం పెరిగిపోయి ప్రాణాంతక పరిస్థితికి దారితీయగలవు. ఈ క్రమంలోనే ప్రతి రోజూ కనీసం 10 నిముషాల పాటు నడవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇంకా తినే ఆహారంలో కొన్ని కూరగాయలను తప్పనిసరిగా భాగం చేసుకోవాలని అంటున్నారు. వాటిల్లోని పోషకాలు శరీరంలోని షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్ చేస్తాయంటున్నారు. ఇంతకీ నిపుణులు

Diabetes: డయాబెటిక్ పేషెంట్లు తప్పక తినాల్సిన 3 కూరగాయలు.. తిన్నారంటే షుగర్ లెవెల్స్‌పై పైచేయి మీదే..
Diabetes Diet
శివలీల గోపి తుల్వా
|

Updated on: Aug 22, 2023 | 6:38 AM

Share

Diabetes Diet: డయాబెటిస్ వ్యాధి ప్రపంచ వ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోన్న ఆరోగ్య సమస్యల్లో ఒక్కటి. ఒకప్పుడు వయసు పై బడినవారిలో మాత్రమే కనిపించే ఈ వ్యాధి ఇప్పుడు చిన్నాపెద్దా తెలియకుండా వ్యాపిస్తోంది. ఆరోగ్య నిపుణుల ప్రకారం సరైన జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్లు, మానసిక ఒత్తిడి వంటివి మధుమేహం వేగంగా వ్యాపించడానికి గల కారణం. ఇక డయాబెటీస్‌కి చికిత్స లేనందుకు దీని బారిన పడినవారు జీవితాంతం ఆహారంపై జాగ్రత్తలు పాటించాల్సిందే. లేదంటూ షుగర్ లెవెల్స్ అమాంతం పెరిగిపోయి ప్రాణాంతక పరిస్థితికి దారితీయగలవు. ఈ క్రమంలోనే ప్రతి రోజూ కనీసం 10 నిముషాల పాటు నడవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇంకా తినే ఆహారంలో కొన్ని కూరగాయలను తప్పనిసరిగా భాగం చేసుకోవాలని అంటున్నారు. వాటిల్లోని పోషకాలు శరీరంలోని షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్ చేస్తాయంటున్నారు. ఇంతకీ నిపుణులు సూచిస్తున్న ఆ కూరగాయలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఆకు కూరలు: తోట కూర, బచ్చలి కూర వంటి ఆకు కూరల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇంకా శరీరానికి కావలసిన ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. అంతేకాక ఈ ఆకు కూరల్లో ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచగలిగే శక్తి కూడా ఉంది. దీంతో మధుమేహంతో బాధ పడే రోగులు ఆయా ఆకు కూరలను జ్యూస్ రూపంలో లేదా కూరలుగా తీసుకోవచ్చు.

బెండ కాయ: బెండకాయలో పీచు పదార్థం ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇప్పటివరకు జరిగిన అనేక అధ్యయనాల ప్రకారం బెండకాయ తినడం వల్ల రక్తంలోని చక్కెర స్థాయి తగ్గుతుంది. బెండకాయలో ఉండే ఫైబర్ పేగులో చక్కెర శోషణను నెమ్మదింప జేస్తుంది. ఇదే కాకుండా, అనేక ఇతర వ్యాధుల వారికి కూడా బెండకాయ చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

టమాటా: పప్పు నుంచి కూరగాయల వరకు, కూరతో సంబంధం లేకుండా టమోటాలు ప్రతి వంటకంలోనూ ఉపయోగిస్తారు. మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా టమాటా చాలా ఉపయోగకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. టమాటాల్లో ఉండే లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ రక్తంలోని చక్కెర స్థాయులను అదుపులో ఉంచుతుంది. ఇంకా టమాటాల్లోని విటమిన్ సి వల్ల రోగనిరోధక శక్తి బలపడుతుంది. ఫలితంగా సీజన్ కారణంగా వచ్చే దగ్గు, జలుబు, తుమ్ములు, జ్వరాల నుంచి శరీరానికి రక్షణ కలుగుతుంది. ఇక టమాటాను మీరు జ్యూస్, కూరలుగా తీసుకోవచ్చు.

మరిన్నీ హెల్త్ న్యూస్ ఆర్టికల్స్ కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి..