Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Depression Relief Foods: మనసు బాగోలేదా.. వీటిని తినడం వెంటనే చేంజ్ అయిపోతుంది!!

ప్రస్తుతం ఇప్పుడున్న కాలంలో ప్రతీ ఒక్కరూ ఒత్తిడి, డిప్రెషన్, ఆందోళనలకు గురవుతూ ఉన్నారు. దీనికి ఒక కారణం అంటూ ఉండదు. ఉద్యోగంలో టెన్షన్స్, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు ఇలా రకరకాల కారణాలు ఉంటాయి. ఉక్కిరి బిక్కిరై సతమతమవుతూ ఉంటారు. అన్నీ ఒక్కటే సారి ఎదురైతే.. ఆ మనిషి ఒక్కటే ఆలోచిస్తాడు.. సూసైడ్. ఇలా ఒక్కసారిగా ఒత్తిడికి గురై చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అకారణంగా తమ తనువును చాలిస్తున్నారు. మనిషి జీవితమే ఆలోచనల మయం. ఎప్పుడూ ఏదో ఒక దాని గురించి ఆలోచిస్తూనే ఉంటాడు. ఈ కారణంగానే డిప్రెషన్ లోకి వెళ్లి ఏం చేస్తారో వారికే..

Depression Relief Foods: మనసు బాగోలేదా.. వీటిని తినడం వెంటనే చేంజ్ అయిపోతుంది!!
Depression
Follow us
Chinni Enni

|

Updated on: Aug 21, 2023 | 10:55 PM

ప్రస్తుతం ఇప్పుడున్న కాలంలో ప్రతీ ఒక్కరూ ఒత్తిడి, డిప్రెషన్, ఆందోళనలకు గురవుతూ ఉన్నారు. దీనికి ఒక కారణం అంటూ ఉండదు. ఉద్యోగంలో టెన్షన్స్, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు ఇలా రకరకాల కారణాలు ఉంటాయి. ఉక్కిరి బిక్కిరై సతమతమవుతూ ఉంటారు. అన్నీ ఒక్కటే సారి ఎదురైతే.. ఆ మనిషి ఒక్కటే ఆలోచిస్తాడు.. సూసైడ్. ఇలా ఒక్కసారిగా ఒత్తిడికి గురై చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అకారణంగా తమ తనువును చాలిస్తున్నారు. మనిషి జీవితమే ఆలోచనల మయం. ఎప్పుడూ ఏదో ఒక దాని గురించి ఆలోచిస్తూనే ఉంటాడు. ఈ కారణంగానే డిప్రెషన్ లోకి వెళ్లి ఏం చేస్తారో వారికే తెలీదు. అయితే కొన్ని రకాల ఫుడ్స్ ని తీసుకోవడం వల్ల డిప్రెషన్ సమస్య నుంచి బయటపడొచ్చని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. మరి ఆ ఫుడ్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

కోడి గుడ్డు:

డ్రిపెషన్ కు గురవుతున్న వారు రోజూ ఒక కోడి గుడ్డును తీసుకుంటూ ఉంటే ఆందోళన నుంచి దూరం అవుతారు. రోజూ ఒక గుడ్డు తింటే డాక్టర్ అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. కోడి గుడ్డులో మంచి ప్రోటీన్స్ ఉంటాయి. ఇవి మెదడు ఆరోగ్యానికి సహాయ పడతాయి. వీటిని రెగ్యులర్ గా తింటే మానసిక ఆందోళన తగ్గిపోతుంది.

ఇవి కూడా చదవండి

అరటి పండు:

అరటి పండు అందరికీ అందుబాటులో చౌకగా లభిస్తుంది. బనానాని రోజూ తీసుకుంటే చాలా అనారోగ్య సమస్యల నుంచి బయట పడతాం. అలాగే ఆందోళనలో ఉన్నప్పుడు బనానా తింటే రిలీఫ్ గా ఉంటుందట. బనానా మెదడులో సెరోటోనిన్ ని రిలీజ్ చేస్తుంది. దీని వల్ల రిలాక్స్ గా ఉంటుంది.

డార్క్ చాక్లెట్:

ఒత్తిడిలో ఉన్నప్పుడు డార్క్ చాక్లెట్ తిన్నా దాని నుంచి ఉపశమనం లభిస్తుంది. డార్క్ చాక్లెట్ మెదడులోని కార్యకలాపాలను ప్రేరేపించడం, నాడీ వ్యవస్థకు రక్షణ కల్పించడం ద్వారా ఆందోళన దూరమవుతుంది.

సీ ఫుడ్స్:

సీ ఫుడ్స్ ని కూడా తింటూ ఉంటే డిప్రెషన్ కు గురయ్యే ఛాన్స్ లు తక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే సీ ఫుడ్ కూడా ఆరోగ్యానికి చాలా మందచింది. ఇందులో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వల్ల మానసిక ఆందోళనను కంట్రోల్ చేస్తుంది. దీంతో ఒత్తిడి నుంచి బయట పడవచ్చు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి