Ardhasana Yoga Benefits: కాళ్లను ఇలా రోజూ 20 నిమిషాలు ఉంచగలిగితే.. ఈ సమస్యలన్నింటికీ చెక్ పెట్టొచ్చు!!

యోగాలో ఏయే ఆసనాలు ఏయే రోగాలను తగ్గిస్తాయో.. ప్రతిరోజూ తెలుసుకుంటూ వస్తున్నాం. అందులో భాగంగా ఈ రోజు అర్థహలాసనం గురించి తెలుసుకుందాం. ఈ ఆసనం వేయడం మొదట్లే కష్టంగానే ఉన్నా.. వేసేకొద్దీ అలవాటు అవుతుంది. రోజుకి కనీసం 10 నిమిషాలైనా అర్థహలాసనం వేస్తే.. అనేక రకాల సమస్యలు తగ్గుతాయని యోగా నిపుణులు చెబుతున్నారు. అర్థహలాసనంతో చాలా అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ఆరంభంలో ఈ ఆసనాన్ని వేసేందుకు ఒక గోడ సపోర్ట్ తీసుకోవచ్చు. నేలపై వెల్లకిలా పడుకుని కాళ్లను ఒకదానితర్వాత ఒకటి పైకి లేపి 90 డిగ్రీల కోణంలో పెట్టాలి. ఇలా రెండుకాళ్లను ఉంచిన తర్వాత ఈ భంగిమలో కనీసం 10 నిమిషాలైనా..

Ardhasana Yoga Benefits: కాళ్లను ఇలా రోజూ 20 నిమిషాలు ఉంచగలిగితే.. ఈ సమస్యలన్నింటికీ చెక్ పెట్టొచ్చు!!
Yoga
Follow us
Chinni Enni

|

Updated on: Aug 21, 2023 | 10:50 PM

యోగాలో ఏయే ఆసనాలు ఏయే రోగాలను తగ్గిస్తాయో.. ప్రతిరోజూ తెలుసుకుంటూ వస్తున్నాం. అందులో భాగంగా ఈ రోజు అర్థహలాసనం గురించి తెలుసుకుందాం. ఈ ఆసనం వేయడం మొదట్లే కష్టంగానే ఉన్నా.. వేసేకొద్దీ అలవాటు అవుతుంది. రోజుకి కనీసం 10 నిమిషాలైనా అర్థహలాసనం వేస్తే.. అనేక రకాల సమస్యలు తగ్గుతాయని యోగా నిపుణులు చెబుతున్నారు. అర్థహలాసనంతో చాలా అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు.

ఆరంభంలో ఈ ఆసనాన్ని వేసేందుకు ఒక గోడ సపోర్ట్ తీసుకోవచ్చు. నేలపై వెల్లకిలా పడుకుని కాళ్లను ఒకదానితర్వాత ఒకటి పైకి లేపి 90 డిగ్రీల కోణంలో పెట్టాలి. ఇలా రెండుకాళ్లను ఉంచిన తర్వాత ఈ భంగిమలో కనీసం 10 నిమిషాలైనా ఉండాలి. ఆరంభంలో ఇలా 10 నిమిషాల పాటు ఉండాలి. కాస్త కష్టమే అయినా ప్రాక్టీస్ చేసేకొద్దీ అలవాటవుతుంది. నిదానంగా రోజుకి 20 నిమిషాలపాటు అర్థహలాసనం వేయాలి.

అర్థహలాసనం వల్ల కలిగే లాభాలు:

ఇవి కూడా చదవండి

మెదడు యాక్టీవ్: అర్థహలాసనం వేయడం వల్ల మెదడుకు ఆక్సిజన్ సరఫరా బాగా అందుతుంది. దీంతో మెదడు యాక్టివ్ గా మారుతుంది. దీంతో చురుగ్గా ఉండగలుగుతాం

ఆందోళన దూరం: ఒత్తిడితో బాధపడుతున్న వారికి ఈ ఆసనం చక్కగా ఉపయోగపడుతుంది. డిప్రెషన్, ఒత్తిడి, ఆందోళన వంటి మానసిక సమస్యలు తగ్గుతాయి.

జ్ఞాపకశక్తి పెరుగుతుంది: ఈ ఆసనాన్ని తరుచూ వేయడం వల్ల ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతాయి. ఒత్తిడి తగ్గి.. నిద్ర బాగా పడుతుంది.

బీపీ కంట్రోల్: శరీరంలో రక్తసరఫరా మెరుగుపడి బీపీ కంట్రోల్ లో ఉంటుంది. గుండె జబ్బులు, హార్ట్ ఎటాక్ లు వచ్చే ఛాన్స్ తక్కువగా ఉంటుంది.

కాళ్ల నొప్పులు తగ్గుతాయి: పొట్టదగ్గర, తొడల్లో ఉండే కండరాలు దృఢంగా మారి కాళ్లనొప్పులు తగ్గుతాయి. పొట్ట, నడుము, తొడల వద్ద ఉండే కొవ్వు కరిగి.. శరీరం చక్కటి ఆకృతిలో ఉంటుంది.

జీర్ణవ్యవస్థ మెరుగ్గా ఉంటుంది: ఈ అర్థహలాసనం వేయడం ద్వారా జీర్ణ వ్యవస్థ పనితీరు కూడా మెరుగవుతుంది. అలాగే తిన్న ఆహారం కూడా త్వరగా జీర్ణం అయ్యే శక్తిని తయారు చేస్తుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి