Black Coffee Side Effects: బ్లాక్ కాఫీ ఎక్కువగా తాగితే ఈ సమస్యలు తప్పవా? అధ్యయనాలు ఏం చెబుతున్నాయి?
కాఫీ.. చాలా మందికి ఇదొక ఎమోషన్. తమ రోజుని యాక్టివ్ గా మార్చేసే ఒక ఎనర్జీ డ్రింక్. ఒత్తిడుల నుంచి విముక్తినిచ్చే పానీయం. కొందరు పరగడుపునే (బెడ్ కాఫీ) తాగితే.. మరికొందరు బ్రేక్ ఫాస్ట్ తర్వాత.. ఇంకొందరు ఆఫీస్ లో పనిచేస్తూ.. కాఫీ తాగుతుంటారు. ఇప్పడు వీటిలో చాలా రకాలొచ్చేశాయి. కాఫీని పాలతో కలిపి తాగేందుకు ఇష్టపడనివారు బ్లాక్ కాఫీ తాగుతుంటారు. ఇది మానసిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది. బ్లాక్ కాఫీ తాగడం ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ..
కాఫీ.. చాలా మందికి ఇదొక ఎమోషన్. తమ రోజుని యాక్టివ్ గా మార్చేసే ఒక ఎనర్జీ డ్రింక్. ఒత్తిడుల నుంచి విముక్తినిచ్చే పానీయం. కొందరు పరగడుపునే (బెడ్ కాఫీ) తాగితే.. మరికొందరు బ్రేక్ ఫాస్ట్ తర్వాత.. ఇంకొందరు ఆఫీస్ లో పనిచేస్తూ.. కాఫీ తాగుతుంటారు. ఇప్పడు వీటిలో చాలా రకాలొచ్చేశాయి. కాఫీని పాలతో కలిపి తాగేందుకు ఇష్టపడనివారు బ్లాక్ కాఫీ తాగుతుంటారు. ఇది మానసిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది. బ్లాక్ కాఫీ తాగడం ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ.. అధికంగా తాగితే.. ఆరోగ్య సమస్యలు తప్పవంటున్నారు నిపుణులు. ఇందలో ఉండే కెఫిన్ కారణంగా సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయట.
కార్టిసాల్ స్టాయి పెరుగుతుంది: బ్లాక్ కాఫీ ఎక్కువగా తాగితే శరీరంలో కార్టిసాల్ స్థాయి పెరుగుతుంది. ఒత్తిడి సమస్య ఎక్కువగా ఉంటే కెఫిన్ ను అధికంగా తీసుకోకపోవడమే మంచిది.
డీహైడ్రేషన్ కి గురవుతారు: బ్లాక్ కాఫీలో కెఫిన్ తో పాటు యాసిడ్ కూడా పుష్కలంగా ఉంటుంది. దీనిని ఎక్కువగా తాగితే డీహైడ్రేషన్ కు గురవుతారు. అలాగే ఎసిడిటీ, కాళ్లు-చేతులు తిమ్మిర్లు ఎక్కడం వంటి సమస్యలు కూడా రావొచ్చు.
నిద్రలేమి సమస్య: బ్లాక్ కాఫీ ఎక్కువగా తాగితే.. నిద్రలేమి సమస్య వస్తుంది. మంచినిద్ర కావాలంటే.. పడుకోవడానికి కొన్ని గంటల ముందే కాఫీని తాగడం మానేయాలి.
బీపీని పెరుగుతుంది: హై బీపీ ఉన్నవారు బ్లాక్ కాఫీకి దూరంగా ఉండాలి. కెఫిన్ బీపీని మరింత పెంచుతుంది. అందుకే బ్లాక్ కాఫీ మీ ఆరోగ్యానికి హానికరం.
దంతాల రంగు మారుతుంది: బ్లాక్ కాఫీ ఎక్కువగా తాగితే.. మీ దంతాలపై మరకలు కనిపిస్తాయి. దీనిని రెగ్యులర్ గా తాగితే.. కాఫీలో ఉండే డార్క్ కలర్ కారణంగా దంతాల రంగు మారుతుంది.
కేవలం బ్లాక్ కాఫీనే కాదు.. సాధారణ కాఫీ, ఫిల్టర్ కాఫీ లేదా టీ ఎక్కువగా తాగే అలవాట్లున్నా వాటిని నెమ్మదిగా తగ్గించుకోవాలి. రోజుకు రెండుసార్లు కంటే ఎక్కువగా టీ, కాఫీలు తాగడం ఆరోగ్యానికి మంచిది కాదని వైద్యులు కూడా సూచిస్తున్నారు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి