Joe Biden to visit India: సెప్టెంబర్‌లో భారత్‌‌ పర్యటనకు జో బైడెన్.. అగ్రరాజ్య అధ్యక్షుడి హోదాలో తొలిసారిగా..

Joe Biden to visit India: ఆమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భారత్‌తో 4 రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ మేరకు అమెరికా వైట్‌హౌస్ జాతీయ భద్రతా సలహాదారు జేక్ సల్లివన్ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటన ప్రకారం జీ20 20 దేశాల మధ్య జరిగే శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సెప్టెంబర్ 7 నుంచి 10వ తేదీల్లో భారత్‌లో పర్యటిస్తారు. ఈ సందర్భంగా ఆయన భారత్‌తో ద్వైపాక్షిక సమావేశాలను కూడా జరుపుతారని సల్లివన్ తెలిపారు. అయితే దాని గురించి..

Joe Biden to visit India: సెప్టెంబర్‌లో భారత్‌‌ పర్యటనకు జో బైడెన్.. అగ్రరాజ్య అధ్యక్షుడి హోదాలో తొలిసారిగా..
PM Modi and US President Joe Biden
Follow us

|

Updated on: Aug 23, 2023 | 5:01 AM

Joe Biden to visit India: జీ20 దేశాల అధ్యక్ష బాధ్యతలను భారత్ నిర్వర్తిస్తొన్న సంగతి తెలిసిందే. భారత్ నేతృత్వాన సెప్టెంబర్‌లో మన దేశంలోనే జీ20 దేశాధినేతల సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలోనే ఆమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భారత్‌తో 4 రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ మేరకు అమెరికా వైట్‌హౌస్ జాతీయ భద్రతా సలహాదారు జేక్ సల్లివన్ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటన ప్రకారం జీ20 20 దేశాల మధ్య జరిగే శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సెప్టెంబర్ 7 నుంచి 10వ తేదీల్లో భారత్‌లో పర్యటిస్తారు. ఈ సందర్భంగా ఆయన భారత్‌తో ద్వైపాక్షిక సమావేశాలను కూడా జరుపుతారని సల్లివన్ తెలిపారు. అయితే దాని గురించి ఎలాంటి వివరాలను ఇంకా వెల్లడించలేదు. అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ భారత్‌‌కి రావడం ఇదే తొలి సారి కావడం విశేషం.  మరో వైపు 2026లో జీ20 సమ్మిట్‌కు అమెరికా ఆతిథ్యం ఇవ్వనుంది.

ఇక సెప్టెంబరులో ఇండోనేషియాలో జరిగే ఆసియన్ (ASEAN) సదస్సుకు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ విడిగా హాజరవుతారని కూడా సల్లివన్ తెలిపారు. జీ20 సమ్మిట్‌లో బైడెన్ బ్యాంకుల ఆధునీకరణ డెవలప్‌మెంట్‌పై ప్రధానంగా చర్చిస్తారని సల్లివన్ వెల్లడించారు.

ఇదిలా ఉండగా, జీ20 సమ్మిట్‌ నేపథ్యంలో సెప్టెంబర్ 8-10 తేదీలను ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించే ప్రతిపాదనకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం ఆమోదం తెలిపినట్లు అధికారులు తెలిపారు. సీఎం ఆమోదించిన ప్రతిపాదన ప్రకారం, న్యూఢిల్లీ పోలీసులు జిల్లా పరిధిలోని బ్యాంకులు, ఇతర  ఆర్థిక సంస్థలతో సహా అన్ని రకాల వాణిజ్య, వ్యాపార సంస్థలు సెప్టెంబర్ 8 నుంచి 10 వరకు  మూసివేయబడతాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Weekly Horoscope: ఒత్తిళ్లు, సమస్యల నుంచి వారికి ఉపశమనం..
Weekly Horoscope: ఒత్తిళ్లు, సమస్యల నుంచి వారికి ఉపశమనం..
పారిస్ లో చిరంజీవి ఫ్యామిలీ.. స్పెషల్ అట్రాక్షన్‌గా క్లింకార..
పారిస్ లో చిరంజీవి ఫ్యామిలీ.. స్పెషల్ అట్రాక్షన్‌గా క్లింకార..
రంభ, ఊర్వశి, మేనకలను కలగలిపిన అనుపమ అందం.!
రంభ, ఊర్వశి, మేనకలను కలగలిపిన అనుపమ అందం.!
వరుణుడి ప్రతాపం.. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
వరుణుడి ప్రతాపం.. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
అతనితో కీర్తి సురేశ్ పెళ్లి.. ఫుల్ క్లారిటీ ఇచ్చేసిందిగా..
అతనితో కీర్తి సురేశ్ పెళ్లి.. ఫుల్ క్లారిటీ ఇచ్చేసిందిగా..
కాంటాక్ట్ లెన్స్‌ వల్ల నటి జాస్మిన్ భాసిన్‌కు తీవ్ర అనారోగ్యం..
కాంటాక్ట్ లెన్స్‌ వల్ల నటి జాస్మిన్ భాసిన్‌కు తీవ్ర అనారోగ్యం..
వికసిత్‌ భారత్‌ లక్ష్యం.. నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ
వికసిత్‌ భారత్‌ లక్ష్యం.. నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ
క్యూట్ నెస్ ఓవర్ లోడెడ్.. ఈ క్యూటీపై అందాలకి పడని హృదయం ఉంటుందా.!
క్యూట్ నెస్ ఓవర్ లోడెడ్.. ఈ క్యూటీపై అందాలకి పడని హృదయం ఉంటుందా.!
చిన్న పిల్లాడితో లిప్ కిస్‌లా? ఆ లేడీ యాంకర్ పై చిన్మయి ఆగ్రహం
చిన్న పిల్లాడితో లిప్ కిస్‌లా? ఆ లేడీ యాంకర్ పై చిన్మయి ఆగ్రహం
ఏయే వయసులవారికి ఎంతెంత నిద్ర అవసరమో తెలుసా?
ఏయే వయసులవారికి ఎంతెంత నిద్ర అవసరమో తెలుసా?