America: మిల్క్‌షేక్ తాగి ముగ్గురు మృతి.. పరిశోధించగా వెలుగు చూసిన ప్రాణాంతకమైన బ్యాక్టీరియా..
అందుకే వీటికి డిమాండ్ కూడా ఎక్కువగానే ఉంటుంది. అయితే, ఈ మ్యాటర్ తెలిస్తే మిల్క్ షేక్ తాగాలంటేనే భయపడిపోతారు. మిల్క్‌షేక్ తాగి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు ఆస్పత్రిపాలయ్యారు. అయితే, అసలెలా ఎందుకు ఇలా జరిగిందని ఆరా తీయగా.. షాకింగ్ నిజం వెలుగు చూసింది. అమెరికాలోని వాషింగ్టన్‌లో ఉన్న ఓ బర్గర్ రెస్టారెంట్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. కాగా, ఈ ఘటనతో మిల్క్ షేక్ వల్ల ఆరోగ్యానికి హానీకరమా? అనే చర్చ జరుగుతోంది..
సాధారణంగా చాలా మంది ఆరోగ్యకరం అని మిల్క్ షేక్స్ తాగుతుంటారు. ఆరోగ్యం, టేస్ట్ పరంగా ఇవి బెటర్ అని భావిస్తారు. అందుకే వీటికి డిమాండ్ కూడా ఎక్కువగానే ఉంటుంది. అయితే, ఈ మ్యాటర్ తెలిస్తే మిల్క్ షేక్ తాగాలంటేనే భయపడిపోతారు. మిల్క్‌షేక్ తాగి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు ఆస్పత్రిపాలయ్యారు. అయితే, అసలెలా ఎందుకు ఇలా జరిగిందని ఆరా తీయగా.. షాకింగ్ నిజం వెలుగు చూసింది. అమెరికాలోని వాషింగ్టన్‌లో ఉన్న ఓ బర్గర్ రెస్టారెంట్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. కాగా, ఈ ఘటనతో మిల్క్ షేక్ వల్ల ఆరోగ్యానికి హానీకరమా? అనే చర్చ జరుగుతోంది. మరి మిల్క్‌షేక్ తాగడం వల్ల ఆ ముగ్గురు ఎందుకు చనిపోయారో తెలుసుకుందాం..
బాధితులు తిన్న మిల్క్‌షేక్‌లో లిస్టెరియా మోనోసైటోజెన్స్ అనే బ్యాక్టీరియా ఉన్నట్లు పరిశోధకులు కనిపెట్టారు. లిస్టేరియోసిస్.. లిస్టేరియా మోనోసైటోజెన్స్ అని పిలువబడే బ్యాక్టీరియాతో కలిసి ఆహారాన్ని కలుషితం చేస్తుంది. దీన్ని తినడం వలన తీవ్రమైన ఇన్‌ఫెక్షన్ వస్తుంది. వాషింగ్టన్‌లోని టాకోమాలో ఫ్రూగల్స్ రెస్టారెంట్ ఉంది. ఇక్కడ ఐస్ క్రీమ్, మిల్క్ షేక్స్ విక్రయిస్తారు. అయితే, వీటిని యంత్రాల సాయంతో చేస్తారు. ఈ యంత్రాలను శుభ్రం చేయలేదు. దాని ఫలితంగానే లిస్టెరియా ఇన్‌ఫెక్షన్‌ను వ్యాప్తి చేసే బ్యాక్టీరియా వ్యాప్తి చెందడానికి ఇదే కారణంగా పేర్కొంటున్నారు విచారణాధికారులు.
లిస్టెరియా ఇన్ఫెక్షన్ అంటే ఏమిటి?..
లిస్టెరియా అనేది ఆహారం ద్వారా సంక్రమించే బ్యాక్టీరియా వ్యాధిగా పరిగణించబడుతుంది. లిస్టెరియాతో కలుషితమైన ఆహారాన్ని తీసుకోవడం వల్ల చిన్న పిల్లలు, గర్భిణులు, వృద్ధుల ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుంది. ఈ బ్యాక్టీరియా చల్లని ఉష్ణోగ్రతలో కూడా జీవించగలదు. పరిశోధకులు రెస్టారెంట్‌లోని ఐస్‌క్రీమ్ మెషీన్‌లలో లిస్టెరియా బ్యాక్టీరియాను కనుగొన్నారు. యంత్రాలను శుభ్రం చేయడం లేదని, దాని కారణంగా ఈ బ్యాక్టీరియా వ్యాప్తి చెందిందని గుర్తించారు.
లిస్టెరియా లక్షణాలు..
వాషింగ్టన్ హెల్త్ డిపార్ట్‌మెంట్ ప్రకారం.. ఫిబ్రవరి 27, జూలై 22 మధ్య లిస్టెరియా ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్న 6 మంది ఆసుపత్రిలో చేరారు. వారిలో ముగ్గురు మరణించారు. లిస్టెరియా ఇన్ఫెక్షన్ లక్షణాల విషయానికి వస్తే.. జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పి, జీర్ణశయాంతర సమస్యలు తలెత్తుతాయి.
గమనిక: పైన పేర్కొన్న అంశాలను ప్రజల సాధారణ ఆరోగ్య ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు. ఏవైనా సమస్యలుంటే.. వైద్యులను సంప్రదించడం ముఖ్యం.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..