- Telugu News Photo Gallery These People Should not eat Almonds, or else will face severity of health problems
Health Tips: బాదంతో ఎన్నో ప్రయోజనాలు.. కానీ వీరు తినకూడదు.. తింటే ఇక అంతే సంగతి..!
Health Tips: బాదం పప్పులు ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. బాదం పప్పుల్లో శరీరానికి కావలసిన ఎన్నో ప్రోటీన్లు, కొవ్వులు, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉన్నాయి. ఈ కారణంగానే నిత్యం బాదం పప్పులను తినాలని, అప్పుడే ఆరోగ్య సమస్యలు దూరం కావడంతో పాటు ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే కొందరు మాత్రం బాదం పప్పులను తినకూడదు. తింటే ఆరోగ్య ప్రయోజనాలేమో కానీ సమస్యలు తీవ్రతరం అవుతాయి. ఇంతకీ ఎవరెవరు బాదం పప్పులను తీసుకోకుడదంటే..?
Updated on: Aug 28, 2023 | 6:59 PM

కిడ్నీ స్టోన్స్: బాదం పప్పుల్లోని అక్సలేట్ అనే కెమికల్ కిడ్నీ రోగులకు మంచిది కాదు. కిడ్నీ స్టోన్స్ ఉన్నవారు బాదం పప్పులను తింటే సమస్య తీవ్రతరం అవుతుంది.

జుట్టు సమస్యలు: బాదం పప్పుల్లో విటమిన్ ఇ ఎక్కువగా ఉంటుంది. ఈ కారణంగా జుట్టు సమస్యలు ఉన్నవారు పరిమిత మోతాదులో అంటే రోజుకు 10 బాదం పప్పుల వరకు తినవచ్చు. అంతకమించి తీసుకుంటే విటమిన్ ఇ మోతాదు పెరిగి, అతిసారం, దృష్టి లోపాలతో పాటు జుట్టు, చర్మ సమస్యలు అధికం అవుతాయి.

ఎసిడిటీ: బాదం పప్పుల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఈ కారణంగా గ్యాస్, అజీర్తి వంటి జీర్ణ సమస్యలు నయం అవుతాయి. అయితే ఫైబర్ ఎక్కువగా ఉన్నందున బాదం పప్పులను మరీ అధికంగా తింటే సమస్యలు తగ్గకపోగా తీవ్రతరం అవుతాయి.

అధిక రక్తపోటు: రక్తపోటు సమస్యతో బాధపడేవారు బాదం పప్పులను అసలు తినకూడదు. రక్తపోటును నియంత్రించేందుకు మందులను తీసుకుంటున్నందునే బాదం పప్పులను తీసుకోకూడదు. ఆ మందులు వాడేవారు బాదం తింటే ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి, ఇంకా బీపీ ఎలెవ్స్ పెరుగుతాయి.

బరువు తగ్గాలనుకునేవారు: బాదంపప్పులు అధిక మొత్తంలో క్యాలరీలు, కొవ్వులను కలిగి ఉంటాయి. ఈ కారణంగా బాదం తిన్నవారు బరువు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు బాదంపప్పుకు దూరంగా ఉండాలి.





























