AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mokila Auction: మూడో రోజూ మోకిలలో అదే మురిపెం.. పోటా పోటీగా వేలంలో రేట్ల పెంపు.. ఫ్లాట్లు అన్నీ హాట్ కేకుల్లా..

Hyderabad: రంగారెడ్డి జిల్లా, శంకర్ పల్లి మండలం, మోకిలలో హెచ్ఎండిఏ లేఅవుట్ ప్లాట్ల రేట్లకు విపరీతమైన డిమాండ్ వస్తుంది. గత మూడు రోజులుగా మోకిల లేఅవుట్ లో ప్లాట్ల కొనుగోలు కోసం పోటాపోటీగా వేలంపాటలో పాల్గొని అధిక రేట్లకు ప్లాట్లను సొంతం చేసుకుంటున్నారు. మూడో రోజు (శుక్రవారం) కూడా అదే ట్రెండ్ కొనసాగింది.

Mokila Auction: మూడో రోజూ మోకిలలో అదే మురిపెం.. పోటా పోటీగా వేలంలో రేట్ల పెంపు.. ఫ్లాట్లు అన్నీ హాట్ కేకుల్లా..
Mokila Phase 2 Auction
శివలీల గోపి తుల్వా
|

Updated on: Aug 26, 2023 | 6:57 AM

Share

హైదరాబాద్, ఆగస్టు 26: హైదరాబాద్ సమీపంలోని మోకిల ప్రాంతంలో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్ఎండిఏ) దాదాపు 165 ఎకరాల విస్తీర్ణంలో 300 గజాల చొప్పున 1,321 ఫ్లాట్లతో మోకిలలో రెసిడెన్షియల్ లేఅవుట్‌ను రూపొందించింది. ఈ లేఅవుట్‌లోని ఫ్లాట్ల అమ్మకాలే ఇప్పుడు హెచ్ఎండీఏకి కాసుల వర్షం కురిపిస్తున్నాయి. హెచ్ఎండిఏకు ప్రజల్లో ఉన్న నమ్మకం, విశ్వాసం, ఆదరణ వల్లే ప్రైవేటు రియల్ ఎస్టేట్ సంస్థల కంటే హెచ్ఎండిఏ వెంచర్లలో సాధారణ ప్రజానీకం, ఉద్యోగులు, వ్యాపారస్తులు స్థిరాస్తి పెట్టుబడులు పెట్టేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు.

మోకిల హెచ్ఎండిఏ వెంచర్ లో ప్లాట్ల కొనుగోలు కోసం గత మూడు రోజులుగా ఈ-వేలంలో పాల్గొని పోటీపడి మరి ప్లాట్లను కొనుగోలు చేస్తున్నారు. మూడో రోజు (శుక్రవారం) ఉదయం 30 ప్లాట్లను వేలం నిర్వహించగా, అన్ని ప్లాట్లు అమ్ముడుపోయాయి. ఉదయం జరిగిన వేలంలో గజం ధర అత్యధికంగా రూ.76,000 పలుకగా, కనిష్టంగా గజం ధర రూ.55,000 వరకు వచ్చింది. మధ్యాహ్నం 30 ప్లాట్లకు వేలం జరగగా అన్ని ప్లాట్లు అమ్ముడుపోయాయి. మధ్యాహ్నం నుంచి జరిగిన వేలంలో గజం ధర అత్యధికంగా రూ.74,000 పలుకగా, కనిష్టంగా గజం ధర రూ.56,000 వరకు వచ్చింది.

శుక్రవారం మూడో రోజు మోకిలలో 60 ప్లాట్ల అమ్మకం ద్వారా రూ.132.97 కోట్ల రెవెన్యూ వచ్చింది. వరుసగా ఈ నెల 23, 24, 25వ తేదీలలో రోజుకు 60 ప్లాట్ల చొప్పున 180 ప్లాట్లను ఆన్ లైన్ వేలం (ఈ-ఆక్షన్) ద్వారా అందుబాటులో పెట్టగా వాటిల్లో రెండు ప్లాట్లు ఆబ్ నార్మల్ బిడ్స్ మినహా 178 ప్లాట్లు అమ్ముడు పోయాయి. వరుసగా మూడు రోజుల పాటు 178 ప్లాట్ల అమ్మకాల ద్వారా హెచ్ఎండిఏకి రూ.387.11 కోట్ల రాబడి సాధ్యమైంది. మళ్లీ సోమవారం (28వ తేదీ), మంగళవారం (29వ తేదీ)ల్లో రోజుకు 60 ప్లాట్ల చొప్పున మోకిల ప్లాట్లను వేలంలో ప్రక్రియలో అమ్మకానికి అందుబాటులో ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

కాగా, 23న జరిగిన మోకిలా భూముల వేలంలో తెలంగాణ ప్రభుత్వానికి 58 ఫ్లాట్లను విక్రయించి రూ. 122 కోట్ల 42 లక్షల ఆదాయాన్ని అందుకోగా.. 24న రెండో రోజు వేలం ద్వారా 60 ప్లాట్స్‌ను విక్రయించి రూ.132 కోట్ల 72 లక్షల ఆదాయం లభించింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..