Chandrayan 3: చంద్రుడిపై దిగిన ల్యాండర్, రోవర్‌ల లక్ష్యం ఏమిటి..? ఏలా పని చేస్తాయి..? తెలుసుకుందాం రండి..
Chandrayan 3: చంటిగాడు చందమామపై సేఫ్ ల్యాండ్ అయ్యాడు.. దేశం మొత్తానికి సంబరాలు పంచాడు. చంటిగాడి కడుపులో ఉన్న బుజ్జిగాడు కూడా రాత్రి 11 గంటల సమయంలో మెల్లగా చంద్రుడిపై దిగాడు.. బుడిబుడి అడుగులు వేసుకుంటూ.. చందమామయ్యా నేనొచ్చేశా అంటూ ముందుకు కదిలాడు.. ఇంతకీ వీళ్లెవరో తెలుసా.. ల్యాండర్, రోవర్. ఈ ఇద్దరూ ఇప్పుడు జాబిల్లిపై ఏం చేయబోతున్నారు..? చందమామపై వాళ్లు చేయాల్సిన పనేంటి..?
Chandrayan 3: చంటిగాడు చందమామపై కాలు పెట్టాడు.. దునియా మొత్తాన్ని సర్‌ప్రైజ్ చేశాడు.. మహామహుల్లాంటి శాస్త్రవేత్తలతోనే ఇస్రో అంటే ఔరా అనిపించాడు.. ఎంత టెన్షన్ పెట్టాడో.. పోనీలెండి.. చివరకు కథ సుఖాంతం చేశాడు.. జర్నీ సాఫీగా చేశాడు.. సేఫ్ ల్యాండ్ అయ్యాడు.. దేశం మొత్తానికి సంబరాలు పంచాడు. చంటిగాడి కడుపులో ఉన్న బుజ్జిగాడు కూడా రాత్రి 11 గంటల సమయంలో మెల్లగా చంద్రుడిపై దిగాడు.. బుడిబుడి అడుగులు వేసుకుంటూ.. చందమామయ్యా నేనొచ్చేశా అంటూ ముందుకు కదిలాడు.. ఇంతకీ వీళ్లెవరో తెలుసా.. ల్యాండర్, రోవర్. ఈ ఇద్దరూ ఇప్పుడు జాబిల్లిపై ఏం చేయబోతున్నారు..? చందమామపై వాళ్లు చేయాల్సిన పనేంటి..? అసలు వాటి పాత్ర ఏంటి..? తెలుసుకుందాం..
‘చందమామ రావే..జాబిల్లి రావే అని ఎన్నిసార్లు పిలిచామో.. ఒక్కసారైనా వచ్చావా.. రానే రాలేదు. అందుకే మేమే వచ్చాం అంటోంది’ ల్యాండర్ విక్రమ్.. సాఫ్ట్ ల్యాండింగ్ ప్రక్రియ సక్సెస్ అవడంతో.. ల్యాండర్ లోపలి నుంచి ప్రగ్యాన్ రోవర్ మెల్లగా బయటకొచ్చింది. సైడ్ ప్యానళ్లను, ర్యాంప్‌గా ఉపయోగించుకుంటూ.. జాబిల్లిపై జర్నీ స్టార్ట్ చేసింది. రోవర్ ప్రయాణం మొదలైంది.. ఇది 14 రోజుల వరకు అంటే.. చంద్రుడిపై ఒక్కపగలు అక్కడే తిరుగుతూ ఫోటోలు తీస్తూ ఉంటుంది. ల్యాండర్, రోవర్‌లలో ఉన్న పేలోడ్‌లు చంద్రుడిపై తమ పని తాము చేసుకుపోతాయి.. ల్యాండర్ చేసే పరిశోధనలు నేరుగా ఇస్రోతో కమ్యూనికేట్ అవుతాయి. రోవర్ మాత్రం ల్యాండర్‌కు మాత్రమే కమ్యూనికేట్ చేస్తుంది.. సో..ల్యాండర్ ఇస్రోకు.. రోవర్‌కు మధ్య జాబిల్లిపై జంక్షన్ బాక్స్ అన్నమాట.
#WATCH | Indian Space Research Organisation’s (ISRO) third lunar mission Chandrayaan-3 makes soft-landing on the moon pic.twitter.com/vf4CUPYrsE
— ANI (@ANI) August 23, 2023
ల్యాండర్, రోవర్‌లో మొత్తం ఐదు సైంటిఫిక్ పేలోడ్‌లు ఉన్నాయి. జాబిల్లిపై వాతావరణ పరిస్థితులు, ఉపరితల నిర్మాణం వంటి అంశాలను అవి నిశితంగా శోధిస్తాయి. అంతేకాదు. చంద్రుడిపై నుంచి భూమిని స్కానింగ్ చేస్తుంది.. రోవర్‌తో కలిపి విక్రమ్ బరువు 1749.8 కిలోలు.. లైఫ్ టైమ్ జస్ట్ 14 రోజులు.. అంటే చంద్రుడిపై ఒక్క పగలు మాత్రమే.. రెండు మీటర్ల పొడవు..రెండు మీటర్ల వెడల్పు ఉండే ల్యాండర్ అసామాన్య పనులు చేయగలదు.
Chandrayaan-3 Mission: ‘India🇮🇳, I reached my destination and you too!’ : Chandrayaan-3
Chandrayaan-3 has successfully soft-landed on the moon 🌖!.
Congratulations, India🇮🇳!#Chandrayaan_3#Ch3
— ISRO (@isro) August 23, 2023
ఇక ల్యాండర్‌లో పంపించిన రోవర్ పేరు ప్రగ్యాన్. దీని బరువు 26 కిలోలు. ఆరు చక్రాల సహాయంతో చంద్రుడి ఉపరితలంపై తిరుగుతూ 14 రోజులు పనిచేస్తుంది. ఇందులో రెండు పేలోడ్‌లు ఉన్నాయి. ఈ పరికరంలో ఉన్న లేజర్ మట్టిపై పడుతుంది. అలా దాన్ని కరిగించడం ద్వారా అందులో ఉన్న రసాయన మూలకాలు, ఖనిజ సంపదను గుర్తించడంలో దోహదపడుతుంది. ల్యాండింగ్ అయిన ప్రదేశంలోని మట్టి, రాళ్లలో ఉన్న రసాయనాలను గుర్తిస్తుంది. ముఖ్యంగా మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్, పొటాషియం, కాల్షియం, టైటానియం వంటి మూలకాలను గుర్తించే పనిలో నిమగ్నమవుతుంది.
సోలార్ ప్యానెల్‌ల ద్వారా శక్తిని పొందే విక్రమ్, ప్రగ్యాన్‌లు మరీ అల్పాయుష్షలు.. వీటి జీవితకాలం 14 రోజులే. అందుకే చంద్రుడిపై సూర్యరశ్మి ఉన్నంతసేపే ఈ వ్యవస్థలన్నీ సక్రమంగా పనిచేస్తాయి. సూర్యాస్తమయం అయ్యాక- మొత్తం అంధకారంగా మారుతుంది. ఆ సమయంలో ఉష్ణోగ్రతలు మైనస్ 180 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోతాయి. అలాంటి పరిస్థితుల్లో ల్యాండర్, రోవర్ వ్యవస్థలు మనుగడ సాగించలేవు.. 14 రోజుల తర్వాత మళ్లీ అక్కడ సూర్యోదయం అయ్యాక.. ల్యాండర్, రోవర్‌లపై సూర్యరశ్మి పడి, ఒకవేళ మళ్లీ అవి పనిచేస్తే మరింత ప్రయోజనమేనని ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే 14 రోజుల తర్వాత మళ్లీ అవి పని చేస్తాయని కచ్చితంగా చెప్పలేమంటున్నారు ఇస్రో ఇంజనీర్లు.. ఎనీవే ఇప్పడు ల్యాండర్, రోవర్ చేసే పనులు. భావితరాల వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..