CWC 2023: వన్డే వరల్డ్ కప్ భారత్‌దే..! చెప్పకనే చెప్పేసిన ‘చంద్రయాన్ 3’.. వైరల్ అవుతున్న ట్వీట్..
CWC 2023: 2019 వరల్డ్ కప్ టోర్నీలో భారత్ సెమీఫైనల్ వరకు చేరి ఆపై వెనుదిరిగింది. అలాగే అదే సంవత్సరం భారత్ చేపట్టిన చంద్రయాన్ 2 కూడా లాండింగ్ సమస్యలతో విఫలమైంది. ఇలా 2019లోనే వరల్డ్ కప్‌లో భారత జట్టు, చంద్రునిపై చంద్రయాన్ 2 విఫలమయ్యాయి. అప్పుడు రెండు ఫెయిల్ అయ్యాయి కానీ ఇప్పుడు అలా కాదు అన్నట్లుగా ముంబై ఇండియన్స్ ఓ ఆసక్తికరమైన ట్వీట్ చేసింది. యావత్ భారతదేశం గర్వపడేలా చంద్రయాన్ 3 మిషన్ విజయవంతం అయింది. విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ కూడా చంద్రుడిపై కాలు..
CWC 2023: భారత్ వేదికగా ఆక్టోబర్ 5 నుంచి వన్డే వరల్డ్ కప్ టోర్నమెంట్ జరగనున్న సంగతి తెలిసిందే. ఆ లోపే భారత్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ 3 మిషన్ విజయవంతం అయింది. ఇదే ఇప్పుడు భారత జట్టు అభిమానుల్లో వరల్డ్ కప్ ఆశలను మరింత పెంచింది. అదేలా అంటే.. 2019 వరల్డ్ కప్ టోర్నీలో భారత్ సెమీఫైనల్ వరకు చేరి ఆపై వెనుదిరిగింది. అలాగే అదే సంవత్సరం భారత్ చేపట్టిన చంద్రయాన్ 2 కూడా లాండింగ్ సమస్యలతో విఫలమైంది. ఇలా 2019లోనే వరల్డ్ కప్‌లో భారత జట్టు, చంద్రునిపై చంద్రయాన్ 2 విఫలమయ్యాయి. అప్పుడు రెండు ఫెయిల్ అయ్యాయి కానీ ఇప్పుడు అలా కాదు అన్నట్లుగా ముంబై ఇండియన్స్ ఓ ఆసక్తికరమైన ట్వీట్ చేసింది.
యావత్ భారతదేశం గర్వపడేలా చంద్రయాన్ 3 మిషన్ విజయవంతం అయింది. విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ కూడా చంద్రుడిపై కాలు మోపాయి. ఈ క్రమంలో వన్డే వరల్డ్ కప్‌లో భారత్ కూడా విజయ వంతం అవుతుందని అర్థం వచ్చేలా ముంబై ఇండియన్స్ ఓ మీమ్ షేర్ చేసింది. ముంబై ఇండియన్స్ షేర్ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు కూడా సానుకూలంగా స్పందిస్తున్నారు.
𝗕𝗘𝗟𝗜𝗘𝗩𝗘 🇮🇳#OneFamily #Chandrayaan_3 #Ch3 #Chandrayaan3 #VikramLander pic.twitter.com/kU9InzTlD4
— Mumbai Indians (@mipaltan) August 23, 2023
ఫిక్స్ చేసేయండి..
Fix it 💙 pic.twitter.com/lQMvBE6gHl
— MI Fans Army™ (@MIFansArmy) August 23, 2023
కాగా, జూలై 14న లాంచ్ అయిన చంద్రయాన్ 3.. బుధవారం అంటే ఆగస్టు 23న సాయంత్రం 5:47 గంటలకు చంద్రునిపై ల్యాండింగ్, సాయంత్రం 6:04 గంటలకు చంద్రునిపై చంద్రయాన్-3 సాఫ్ట్ ల్యాండింగ్‌ని విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో ఇస్రోకి బీసీసీఐ, టీమిండియా ఆటగాళ్లు అభినందనలు తెలిపారు.
చరిత్ర సాక్షాత్కారం..
🎥 Witnessing History from Dublin! 🙌
The moment India’s Vikram Lander touched down successfully on the Moon’s South Pole 🚀#Chandrayaan3 | @isro | #TeamIndia https://t.co/uIA29Yls51 pic.twitter.com/OxgR1uK5uN
— BCCI (@BCCI) August 23, 2023
చారిత్రాత్మకం..
A historic moment that will resonate for generations to come! 🇮🇳 Heartfelt congratulations to @isro on the triumphant landing of #Chandrayaan3. A remarkable feat that fills us all with inspiration through their steadfast commitment and exceptional accomplishment. pic.twitter.com/234LXEGuRw
— Jay Shah (@JayShah) August 23, 2023
తొలి దేశం..
🇮🇳 – The 𝐟𝐢𝐫𝐬𝐭 𝐧𝐚𝐭𝐢𝐨𝐧 to reach the lunar south pole. That’s got a nice ring to it 👏
A proud moment for each one of us & a big congratulations to @isro for all their efforts.
— Rohit Sharma (@ImRo45) August 23, 2023
దేశం గర్విస్తోంది..
Many congratulations to the #Chandrayaan3 team. You have made the nation proud 🇮🇳 Jai Hind!
— Virat Kohli (@imVkohli) August 23, 2023
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..