Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ లాజిక్ వర్కౌట్ అవుతుందా.. ? ఈసారి వరల్డ్ కప్ మనదేనంటున్న క్రికెట్ ఫ్యాన్స్..

భారత్‌తో సహా ప్రపంచం మొత్తం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన చంద్రయాన్-3 చంద్రుడిపై సేఫ్ గా లాండ్ అయి చరిత్ర సృష్టించింది. దీంతో జయహో భారత్ జయహో అంటూ నినాదాలు మారు మోగిపోయాయి. అందరూ విజయోత్సవ సంబరాలు చేసుకున్నారు. ఇదంతా బాగున్నప్పటికీ మరికొద్ది రోజుల్లో జరగబోయే క్రికెట్ వరల్డ్ కప్ తప్పకుండా ఇండియా నెగ్గుతుంది అంటూ మిమ్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ లాజిక్ వర్కౌట్ అవుతుందా.. ? ఈసారి వరల్డ్ కప్ మనదేనంటున్న క్రికెట్ ఫ్యాన్స్..
Meme Pic
Follow us
Yellender Reddy Ramasagram

| Edited By: Ravi Kiran

Updated on: Aug 24, 2023 | 2:22 PM

భారత్‌తో సహా ప్రపంచం మొత్తం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన చంద్రయాన్-3 చంద్రుడిపై సేఫ్ గా లాండ్ అయి చరిత్ర సృష్టించింది. దీంతో జయహో భారత్ జయహో అంటూ నినాదాలు మారు మోగిపోయాయి. అందరూ విజయోత్సవ సంబరాలు చేసుకున్నారు. ఇదంతా బాగున్నప్పటికీ మరికొద్ది రోజుల్లో జరగబోయే క్రికెట్ వరల్డ్ కప్ తప్పకుండా ఇండియా నెగ్గుతుంది అంటూ మిమ్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అసలు చంద్రయాన్ సక్సెస్ కి వరల్డ్ కప్‎లో ఇండియా గెలవడానికి ఎంటి లింక్ అనేది తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

చంద్రుడిపై ఇండియా అడుగుపెట్టడంతో అందరూ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ విజయంతో ఈసారి జరగబోయే క్రికెట్ వరల్డ్ కప్‎లో ఇండియా తప్పకుండా గెలుస్తుంది అంటూ లింకు పెట్టి మరి సంబరాలు చేసుకుంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్. 2019లో చంద్రయాన్-2 విఫలమైన సంగతి తెలిసిందే. అయితే అదే సమయంలో వరల్డ్ కప్‎లో సెమి ఫైనల్లో భారత క్రికెట్ జట్టు ఓటమి పాలైంది. చంద్రయాన్-2 తర్వాత 2023లో చంద్రయాన్-3 ప్రయోగం సక్సెస్ అవడం, చంద్రుడి దక్షిణ ధృవంపై అడుగుపెట్టిన మొట్టమొదటి దేశం ఇండియాగా నిలవడంతో క్రికెట్ ఫ్యాన్స్ మరో సంతోషకరమైనటువంటి వార్తను షేర్ చేస్తున్నారు. 2019లో చంద్రయాన్ 2 ఫెయిల్ అయింది క్రికెట్లో ఇండియా ఓడిపోయింది. కానీ 2023లో చంద్రయాన్ 3 సక్సెస్ అయ్యింది కాబట్టి తప్పకుండా మరికొద్ది రోజుల్లో జరగబోయే మెగా టోర్నీలో భారత జట్టు వరల్డ్ కప్ నెగ్గుతుంది అంటూ క్రికెట్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

2023లో చంద్రయాన్-3 చంద్రునిపై సేఫ్ గా ల్యాండ్ అవడంతో ఇండియా విజయం సాధించిందని..ఇక వరల్డ్ కప్ సాధించడంలో కూడా టీమిండియా విజయం సాధిస్తుందని ఫాన్స్ చాలా కాన్ఫిడెంట్‎గా చెప్తున్నారు. ఈ సెంటిమెంట్ తప్పకుండా వర్క్ అవుట్ అవుతుందని ఈసారి ట్రోఫీ ఇండియా నెగ్గుతుంది అని లెక్కలు వేసుకుంటున్నారు.ఈసారి జరిగే వన్డే వరల్డ్ కప్ విన్నర్ ఎవరో చంద్రయాన్-3 తేల్చి చెప్పిందని ఫ్యాన్స్ చాలా గట్టిగా చెబుతున్నారు. అయితే ఈ లాజిక్ మరి నిజమవుతుందా లేదా అనేది తెలియాలంటే వరల్డ్ కప్ ఫైనల్ వరకు వేచి చూడాల్సిందే.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!