Telangana Congress: చేవెళ్ల సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందా..? కాంగ్రెస్ ప్రజాగర్జనకు సర్వం సిద్ధం..
Congress Chevella Meeting: సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందా.. కర్ణాటక ఫార్ములా కనికట్టు చేస్తుందా.. దివంగత వైఎస్ సెట్ చేసిన ట్రెండ్‌ను కాంగ్రెస్ పార్టీ ఇంకా కొనసాగిస్తోందా.. అంటే అవుననే పేర్కొంటున్నాయి.. పొలిటికల్ వర్గాలు.. చేవెళ్లతో కాంగ్రెస్‌కు ఉన్న బలమైన బంధాన్ని.. ప్రజాగర్జన పేరుతో ప్రజలకు మరింత చేరువయ్యే ప్రయత్నం చేస్తోంది.

Congress Chevella Meeting: సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందా.. కర్ణాటక ఫార్ములా కనికట్టు చేస్తుందా.. దివంగత వైఎస్ సెట్ చేసిన ట్రెండ్‌ను కాంగ్రెస్ పార్టీ ఇంకా కొనసాగిస్తోందా.. అంటే అవుననే పేర్కొంటున్నాయి.. పొలిటికల్ వర్గాలు.. చేవెళ్లతో కాంగ్రెస్‌కు ఉన్న బలమైన బంధాన్ని.. ప్రజాగర్జన పేరుతో ప్రజలకు మరింత చేరువయ్యే ప్రయత్నం చేస్తోంది. దీనిలో భాగంగా ఇవాళ చేవెళ్ల నుంచి కాంగ్రెస్ ఎన్నికల శంఖారావాన్ని పూరించనుంది.. తెలంగాణలో ఈ సారి ఎలాగైనా అధికారంలోకి రావాలని భావిస్తున్న కాంగ్రెస్ గతానికి భిన్నంగా అడుగులు వేస్తోంది. కనీవినీ ఎరగని తీరులో భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు ముమ్మర ఏర్పాట్లు చేసింది. చేవెళ్లలోని కేవీఆర్ గ్రౌండ్‌లో నిర్వహిస్తున్న ఈ సభపైనే కాంగ్రెస్ ఆశలు పెట్టుకుంది. సభా ఏర్పాట్లపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పార్టీ నేతలకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఇవాళ సాయంత్రం 4.50 గంటలకు ఏఐసీసీ అధ్యక్షుడు మలికార్జున ఖర్గే ఈ సభకు ముఖ్య అతిథిగా రానున్నారు. సభలో మల్లికార్జున ఖర్గే ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ప్రకటించనున్నారు. మరోవైపు, పేదల నుంచి తక్కువ ధరకు భూములు తీసుకుని ఎక్కువ ధరకు ప్రభుత్వం కపెనీలకు కేటాయించడం దుర్మార్గమని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. షాబాద్ మండలం చందనవెల్లిలో 1800ఎకరాలు, ఇబ్రహీంపట్నంలో 8వేల ఎకరాలను ప్రభుత్వం పేదల నుంచి బలవంతంగా గుంజుకుందని ఆరోపించారు.
చేవెళ్లలో నిర్వహిస్తున్న ప్రజాగర్జన సభను విజయవంతం చేయాలని మాజీ ఎంపీ వి.హన్మంతరావు తెలిపారు. చేవెళ్ల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బహిరంగ సభ ఏర్పాట్లను స్థానిక నాయకులతో కలిసి వీహెచ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు పార్టీ శ్రేణులు కష్టపడి పని చేయాలన్నారు. కాంగ్రెస్ పాలనలోనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగిందన్నారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పేదలకు ఇచ్చిన అసైన్డ్ భూములను సీఎం కేసీఆర్ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు అప్పనంగా కట్టబెడుతుందన్నారు.
ధరణి పోర్టల్ పేదలకు కాకుండా ధనికులకు ఉపయోగపడేలా ఉందన్నారు. ధరణి మూలంగా పేదలు చాలా ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. సీఎం కేసీఆర్ ధరణి గొప్పగా ఉందని చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రంలో డబుల్ బెడ్‌రూం ఇళ్లకు, బీసీ బంధు, దళితబంధు పథకాల వర్తింపునకు బీఆర్‌ఎస్ నాయకులు కమీషన్లు తీసుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ పాలన సాగిస్తున్నారని వీహెచ్ విమర్శించారు. మొత్తానికి కాంగ్రెస్‌లో ఎక్కడలేని జోష్ వచ్చినట్లుంది.




మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..