AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: నగరంలో అద్దెకు సైకిల్లు.. గంట నుంచి నెల వరకు.. రెంట్ ఎంతంటే..?

నగరంలోని మూడు ప్రాంతాల్లో రెంటెడ్ సైకిల్ స్టేషన్లు ఉన్నాయి. ఇక్కడ వందల సైకిళ్ళు ఉంటాయి. సైక్లింగ్ పై ఇంట్రెస్ట్ ఉన్నవారు తమ అవసరాలకు అనుగుణంగా ఒక గంట నుంచి ఒక నెలవరకు వీటిని అద్దెకు తీసుకుని ఉపయోగించుకోవచ్చు. సిటీలోని గచ్చిబౌలి, నెక్లెస్‌రోడ్, సుచిత్రా సర్కిల్‌లో సైకిల్ స్టేషన్లు ఉన్నాయి. వీటిలో ఒక్కోచోట వందకు పైగా సైకిళ్లు అందుబాటులో ఉన్నాయి. సైకిల్ నడపాలని అనుకునేవారు తమ ఐడీ ప్రూఫ్‌ని ఇవ్వాల్సి ఉంటుంది. గంట నుంచి , 24 గంటలు , వారం రోజులు, నెల రోజులు వరకు రెంట్‌కి ఇస్తున్నారు.

Hyderabad: నగరంలో అద్దెకు సైకిల్లు.. గంట నుంచి నెల వరకు.. రెంట్ ఎంతంటే..?
Cycles
Peddaprolu Jyothi
| Edited By: Ram Naramaneni|

Updated on: Aug 26, 2023 | 9:22 AM

Share

హైదరాబాద్, ఆగస్టు 26:  సిటీలో సైకిళ్ల వాడకం మునుపటితో పోలిస్తే క్రమక్రమంగా పెరుగుతుంది. కరోనా సమయంలో ఆరోగ్యంపై పెరిగిన అవగాహన, ఫిట్‌గా ఉండాలనే ఆలోచనతో జనాలు సైక్లింగ్‌పై ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు.కేవలం వీకెండ్‌లో మాత్రమే సైక్లింగ్‌లో పాల్గొనడం కాకుండా ఇప్పుడు రోజువారీ కార్యాకలపాలలో కూడా ఉపయోగిస్తున్నారు. రెంట్ ఏ బైక్ కాన్సెప్ట్ అందరికీ తెలిసిందే. అ దేవిధంగా సిటీలో రెంట్ ఏ బైస్కిల్ కూడా అందుబాటులో ఉంది. ఇవి కొన్నేళ్ల క్రితం ఏర్పాటైనప్పటికి ఈ మధ్యకాలంలో వీటికి ఆదరణ డబులైంది. అసలు ఈ రెంటెడ్ సైకిల్ స్టేషన్లు ఎక్కడెక్కడ ఉన్నాయి. ప్యాకేజీలు ఏ విధంగా ఉన్నాయో స్ఫెషల్ స్టోరిలో తెలుసుకుందాం..

నగరంలోని మూడు ప్రాంతాల్లో రెంటెడ్ సైకిల్ స్టేషన్లు ఉన్నాయి. ఇక్కడ వందల సైకిళ్ళు ఉంటాయి. సైక్లింగ్ పై ఇంట్రెస్ట్ ఉన్నవారు తమ అవసరాలకు అనుగుణంగా ఒక గంట నుంచి ఒక నెలవరకు వీటిని అద్దెకు తీసుకుని ఉపయోగించుకోవచ్చు. సిటీలోని గచ్చిబౌలి, నెక్లెస్‌రోడ్, సుచిత్రా సర్కిల్‌లో సైకిల్ స్టేషన్లు ఉన్నాయి. వీటిలో ఒక్కోచోట వందకు పైగా సైకిళ్లు అందుబాటులో ఉన్నాయి. సైకిల్ నడపాలని అనుకునేవారు తమ ఐడీ ప్రూఫ్‌ని ఇవ్వాల్సి ఉంటుంది. గంట నుంచి , 24 గంటలు , వారం రోజులు, నెల రోజులు వరకు రెంట్‌కి ఇస్తున్నారు.

కోవిడ్ ముందు ఆ తర్వాత జనాల జీవనవిధానంలో చాలా మార్పులొచ్చాయి. ముఖ్యంగా ఆరోగ్యంపై అధికంగా దృష్టి సారిస్తున్నారు. డాక్టర్లు కూడా వాకింగ్, జాగింగ్, జిమ్, సైక్లింగ్‌ చేయాలని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో అనేకమంది సైక్లింగ్ చేసేందుకుమొగ్గుచూపుతున్రు. సిటీలో సైక్లింగ్ క్లబ్స్, గ్రూప్‌లు అనేకం ఉన్నాయి. నగరవ్యాప్తంగా దాదాపు 10వేలమంది సైక్లిస్ట్‌లు ఉన్నారు. వీరిలో మూడు, నుంచి నాలుగువేల మంది వివిధ అవసరాలపై ప్రతిరోజు ఒకచోటు నుంచి మరోచోటుకు సైకిల్ తొక్కుకుంటూ వెళ్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ సంఖ్య గణనీయంగా పెరుగుతుంది..

ముందుగా రెంటెడ్ సైకిళ్లను తీసుకుని వినియోగిస్తున్నారు నగరవాసులు. ఆ తర్వాత సొంతంగా సైకిళ్లను కొనుగోలు చేసుకుంటారు. ఇందులో అన్ని వయసుల వారు ఉంటున్నారని రెంట్ ఏ సైకిల్ స్టేషన్ నిర్వాహకులు చెప్తున్నారు. ఇక వాటి కాస్టు గంటకు 30రూపాయల నుంచి ఛార్జీలు ఉంటాయని తెలిపారు. 24గంటలకు రెండు వందల రూపాయలు, వారానికి మూడువందల రూపాయలు (రెండురోజులు ఎక్స్‌ట్రా బోనస్‌), 15రోజులకి 450రూపాయలు, నెలకి తొమ్మిది వందల రూపాయలతో ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.ఇందులో వీక్ ప్యాకేజీకి ఎక్కువగా రెస్పాన్స్ ఉంటుందని నిర్వాహకులు అంటున్నారు. రోజువారీ అవసరాల కోసం తీసుకునేవారితో పాటు వీకెండ్స్ లో తీసుకునేవారు అధికంగా ఉన్నారని చెప్తున్నారు..

విదేశాల తరహాలో సైక్లింగ్ ట్రాక్‌లు ఏర్పాటు చేస్తామని జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఎలు ప్రకటించినప్పటికీ ప్రస్తుతం కేవలం రెండు చోట్ల మాత్రమే అవి కనిపిస్తున్నాయి. అయితే అవి కూడా సైకిలిస్టులకు ఉపయోగపడటం లేదు. విదేశాల్లో ఉన్నట్లుగా ఏర్పాటు చేస్తామని చెప్పిన అధికారులు ఉన్న ట్రాక్‌లను కూడా సరిగా పట్టించుకోవడంలేదు. ఆ ట్రాక్ లోకి ఇతర వెహికిల్స్ వస్తే భారీ పెనాల్టిలు వేస్తారు. హైదరాబాద్ లో మాత్రం అసలు సైక్లింగ్ ట్రాక్ పై చాలా మందికి అవగాహన కూడా లేదు. వాహనాలు సైక్లింగ్ చేసే మార్గంలో ఇష్టానుసారంగా వెళ్తుండటంతో ప్రస్తుతం సిటీలో సైక్లిస్ట్లు ఫ్రీగా తిరగలేకపోతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..