మొటిమలు: పుదీనా ఆకులలో ఉండే సాలిసిలిక్ యాసిడ్, విటమిన్ ఎ చర్మంలో ఆయిల్ ఉత్పత్తిని తగ్గించి జిడ్డు చర్మం నివారణలో ఉపయోగపడతాయి. జిడ్డు చర్మం కారణంగానే మొటిమలు వస్తాయి. తద్వారా పుదీనా ఆకులు మిమ్మల్ని వేధిస్తున్న మొటిమలకు చెక్ పెట్టగలవు. ఇందుకోసం మీరు పుదీనా ఆకుల పేస్ట్‌ని ముఖంపై అప్లై చేసి 15 నిముషాల పాటు ఉంచి తర్వాత కడిగేయండి. ఇలా వారంలో రెండు సార్లు చేస్తే చాలు.