- Telugu News Photo Gallery These 5 Cooking hacks to Fix Food recipe if It's Too Salty Telugu Lifestyle News
Cooking Hacks: అయ్యో, కూరలో ఉప్పు ఎక్కువయిందా..? అయితే ఈ సింపుల్ చిట్కాలను పాటించండి, రుచి అదిరిపోద్ది..!
Cooking Hacks: తినే ఆహారం ఏదైనా దాని రుచిని పెంచడంలో ఉప్పుదే ప్రధాన పాత్ర. అందుకే వంట చేసే సమయంలోనే చాలా మంది ఉప్పు సరిపోయిందా లేదా టెస్ట్ చేస్తుంటారు. ఇలాంటి సందర్భాల్లో ఉప్పు తక్కువగా ఉంటే మరి కొంత ఉప్పు వేయవచ్చు. కానీ ఉప్పు ఎక్కువ అయితే పరిస్థితి ఏంటి..? ఏం చేయాలో తెలియక కూరకు ఎక్కువగా నీళ్లను కలిపి, వంటకం రుచిని మార్చేస్తుంటారు. అలా చేయడం వల్ల కూర రుచి మారిపోవడమే కాక దాన్ని తిన్న అనుభూతి కలగదు. అలాంటి సమస్య లేకుండా ఉప్పు ఎక్కువ అయినా తగ్గించుకునే చిట్కాలు కొన్ని ఉన్నాయి. వాటిని ఓ సారి ట్రై చేయండి..
Updated on: Aug 26, 2023 | 8:21 AM

మీగడ: కూరలో ఎక్కువగా ఉన్న ఉప్పును తగ్గించడానికి తాజా మీగడను ఉపయోగించవచ్చు. ఇలా చేస్తే ఉప్పు తగ్గి, కూర రుచిగా మారుతుంది.

పెరుగు: కూర ఉప్పగా ఉంటే దానిలో ఓ టేబుల్ స్పూన్ పెరుగును కలపండి. ఆ తర్వాత కూరను 5 నిముషాల పాటు ఉడికించి రుచి చూడండి. అప్పటికీ ఉప్పు ఎక్కువగా ఉంటే మరో స్పూన్ పెరుగు లేదా.. ఉప్పు తగ్గితే మరి కొంత ఉప్పు కలపండి.

బ్రెడ్: బ్రెడ్‌తో కూడా కూరలోని ఉప్పును తగ్గించవచ్చు. ఇందుకోసం రెండు బ్రెడ్ స్లైస్ తీసుకొని కూరలో వేయండి. 2, 3 నిముషాలు ఉడికించిన తర్వాత ఆ స్లైస్‌ని తీసేయండి. రుచి సరిపోతుంది.

బంగాళదుంపలు: కూరలో ఉప్పు ఎక్కువగా ఉంటే బంగాళదుంపలను కూడా ఉఫయోగించవచ్చు. ఇందుకోసం మీరు 2, 3 ఉడికించిన బంగాళదుంపలను కలిపితే, కూరలోని ఉప్పును అవి లాగేస్తాయి.

నిమ్మకాయ రసం: చాలా రెస్టారెంట్లు తమ వంటకాల్లో ఉప్పు ఎక్కువగా ఉంటే నిమ్మరసాన్ని కలుపుతారు. ఈ క్రమంలో మీరు కూడా మీ వంటకానికి నిమ్మరసం కలపవచ్చు. ఇలా చేయడం వల్ల కూరలోని ఉప్పు తగ్గుతుంది.





























