- Telugu News Photo Gallery Spiritual photos Chanakya Niti: Never Share These things with other, or else you may face difficulties in life
Chanakya Niti: పొరపాటున కూడ ఇతరులతో చెప్పకూడని విషయాలు.. చెప్తే మొదటికే మోసమంటున్న చాణక్య..
Chanakya Niti: ఆచార్య చాణక్యుడు ఎన్నో శాస్త్రాల్లో మేధావి. తన విధివిధానాల్లో ప్రతి ఒక్కరూ తమ జీవితంలో కొన్ని నియమ నిబంధనలను పాటించాలని ఆచార్యుడు సూచించాడు. అలాగే మనిషికి జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఎలా ఎదుర్కోవాలో కూడా వివరించాడు. ఈ క్రమంలోనే తన జీవితంలో ఎలా నడుచుకోవాలో కూడా చెప్పాడు. అందులో భాగంగానే మనిషి పొరపాటున కూడా తనకు సంబంధించిన కొన్ని విషయాలను ఏ ఒక్కరితో పంచుకోకూడదని, ఇతరులకు తెలిస్తే మోసం చేసే అవకాశం ఉందని హెచ్చరించాడు. ఇంతకీ ఏయే విషయాలను ఇతరులకు చెప్పకూడదని చెప్పాడో ఇప్పుడు చూద్దాం..
Updated on: Aug 26, 2023 | 6:19 AM

వ్యూహాలు: మన భవిష్యత్ కార్యచరణ కోసం సిద్ధం చేసుకున్న వ్యూహాల గురించి ఎవరికి చెప్పవద్దని ఆచార్య చాణక్యుడు సూచించాడు. విజయ సాధన కోసం అనుకున్న వ్యూహాల గురించి ఇతరులకు తెలిస్తే వారు ప్రతివ్యూహాలను రచించి మన మార్గంలో ప్రతికూల పరిస్థితులను ఏర్పరచడం లేదా పోటీదారులుగా మారే అవకాశం ఉందని చాణక్యుడు తెలిపాడు.

వ్యక్తిగత సంబంధాలు: సంబంధాల గురించి కూడా ఇతరులకు చెప్పవద్దని చాణక్యుడు చెప్పాడు. సంబంధాలు వ్యక్తిగత విషయాలు అయినందున వాటిని ఇతరులకు చెప్పడం వల్ల రానున్న సమయంలో ఆటకంగా మారతాయని చాణక్యుడు హెచ్చరించాడు.

బలహీనతలు: మనలోని బలహీనతల గురించి కూడా ఇతరులకు తెలియకుండా జాగ్రత్త పడాలని చాణక్యుడు చెప్పాడు. ఎందుకంటే మనలోని బలహీనతలే మన ప్రత్యర్థులకు బలాన్ని చేకూరుస్తాయి. ఇంకా కొందరు స్వార్థం కోసం మన బలహీనతలను ఉపయోగించుకునే ప్రమాదం ఉంది.

సమస్యలు: వ్యక్తిగత జీవితంలో ఎన్నో సమస్యలు ఉన్నా, వాటిని ఇతరులతో పంచుకోకూడదని చాణక్యుడు సూచించాడు. సమస్యలు ఉన్నాయని ఇతరులకు చెప్తే వారి ఎదుట మన విలువ తగ్గిపోవడంతో పాటు మనల్నీ లోకువగా చూస్తారని చాణక్యుడు అభిప్రాయపడ్డాడు. ఈ మేరకు వ్యక్తిగత సమస్యలు ఏమైనా ఉంటే వాటి పరిష్కారానికి తల్లిదండ్రులను సంప్రదించడం తప్ప ఇతరులకు చెప్పవద్దని చాణక్యుడు అన్నాడు.

చుట్టూ ఉండేవారిలో కొందరు రెండు నాలకుల ధోరణితో ఉంటారు, ఇంకా వారిని గుర్తించడం చాలా క్లిష్టమైన విషయం. ఈ కారణంగానే మన వ్యక్తిగత విషయాలను ఇతరులకు తెలియకుండా జాగ్రత్త పడాలని, అప్పుడే మన విజయ మార్గంలో ఎలాంటి అవరోధాలు ఎదురవవని చాణక్యుడు చెప్పాడు.




