Watch Video: వాష్‌రూమ్‌లోంచి వింత శబ్ధాలు.. లోపల కనిపించింది చూసి పరుగోపరుగు
విశాఖ జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. శ్రీహరిపురం ప్రాంతంలోని రాంనగర్ కాలనీలోని ఓ ఇంట్లో వాష్‌రూమ్‌కు వెళ్లిన యువకుడికి వింత అనుభవం ఎదురైంది. ఇంట్లో వాష్‌మ్‌కు వెళ్లిన యువకుడు వింత శబ్ధాలను వెన్నాడు. ఎంటా అని లోపలికి వెళ్లి చూశాడు. వెంటనే భయంతో అక్కడి నుంచి పరుగులు పెట్టాడు.ఇంతకు ఆ యువకుడు అక్కడ ఏం చేశాడు. ఎందుకు అంతగా భయపడ్డాడో తెలుసుకుందాం పదండి

విశాఖ జిల్లా శ్రీహరిపురం ప్రాంతంలో రాంనగర్ అనే కాలని ఉంది. ఆ కాలనీలోని ఓ ఇంట్లో కుటుంబం నివాసం ఉంటోంది. అయితే ఇంట్లో ఉన్న ఒక యువకుడు ఇటీవల వాష్ రూమ్ కొసమని వెళ్లేసరికి అక్కడ నుంచి వింత శబ్దాలు వినిపించాయి.దీంతో వాష్‌రూమ్‌లో ఏముంది అని చూస్తే ప్రయత్నం చేశాడు. అక్కడ బాత్‌రూమ్ సమీపంలో ఆ యువకుడికి భారీ నాగుపాము బుసలు కొడుతూ కనిపించింది. ఆ సీన్ చూసిన యువకుడికి గుండె ఆగినంతపనైంది. వెంటనే అక్కడి నుంచి పరుగులు తీశాడు ఆ యువకుడు.
ఆ యువకుడు అంతలా భయపడడానికి కారణం ఆ పాము పొడవు. ఆ పాము ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 8 అడుగుల కోబ్రా. అది శబ్దాలు చేస్తుంటే.. దెబ్బకు హడలెత్తిపోయిన ఆ యువకుడు.. పరుగెత్తుకొచ్చాడు. వెంటనే విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పాడు. దీంతో వారు ఇరుగుపొరుగువారి సహకారంతో వెంటనే స్నేక్ క్యాచర్ నాగరాజుకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన నాగరాజు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నాడు.
వాష్‌రూమ్ బయట ఇనుప జాలీ వద్ద తిష్ట వేసుకుని కూర్చున్న భారీ నాగుపామును చాకచక్యంగా పట్టుకున్నాడు. బంధించే క్రమంలో ఎదురు తిరిగేందుకు ప్రయత్నించింది ఆ పాము. చివరకు ఆ పామును బంధించాడు నాగరాజు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ నాగుపాము అత్యంత విషపూరితమని, చాలా ప్రమాదకరమని స్నేక్ క్యాటర్ తెలిపాడు.
వీడియో చూడండి..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




