ఓర్నీ దుంప తెగ.. లారీలో ఈ సెటప్ ఏందిరా? బిత్తరపోయిన పోలీసులు..
చూసేందుకు పైకి అది మామూలు ట్రక్కులారీ గానే ఉంది. కానీ పోలీసులు తమ తెలివి తేటలకు పని చెప్పడంతో కనిపించేదంతా నిజం కాదని తెలిసింది. లారీ అడుగున రహస్యంగా దాచిన ఆరలో ఏకంగా రూ.2 కోట్ల విలువైన మత్తుపదార్ధాల స్మగ్లింగ్ సరుకు దాగి ఉంది మరి...

చెన్నై, అక్టోబర్ 20: రోడ్డుపై ఇతర వాహనాలతో సైలెంట్‌గా వెళ్తున్న ఓ లారీపై పోలీసుల కన్నుపడింది. చూసేందుకు పైకి అది మామూలు ట్రక్కులారీ గానే ఉంది. కానీ పోలీసులు తమ తెలివి తేటలకు పని చెప్పడంతో కనిపించేదంతా నిజం కాదని తెలిసింది. లారీ అడుగున రహస్యంగా దాచిన ఆరలో ఏకంగా రూ.2 కోట్ల విలువైన మత్తుపదార్ధాల స్మగ్లింగ్ సరుకు దాగి ఉంది మరి. ఈ షాకింగ్ ఘటన తమిళనాడులోని చెన్నైలో ఆదివారం (అక్టోబర్ 19) వెలుగు చూసింది. NCB చెన్నై జోనల్ యూనిట్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..
తమిళనాడు రాజధాని చెన్నైలోని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు పక్కా సమాచారంతో రోడ్డుపై వెళ్తున్న ఓ లారీని అడ్డుకున్నారు. తనిఖీ చేయడంతో రెండు కోట్ల విలువైన గంజాయి బయటపడింది. మినీ లారీలో ప్రత్యేకంగా రూపొందించిన అరలో గంజాయిని రవాణా చేస్తున్నట్లు ఎన్సీబీ అధికారులకు రహస్య సమాచారం అందింది. ఆదివారం చెన్నైలోని కరణోడై టోల్ ప్లాజా సమీపంలో ఆ మినీ లారీని అధికారులు అడ్డగించడంతో వాహనం కింది భాగంలో దాచిన 150 ప్యాకెట్ల గంజాయిని వ్యవహారం బయటపడింది. దాదాపు రూ.2 కోట్ల విలువైన 320 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

ఈ గంజాయిని ఆంధ్రప్రదేశ్ నుంచి చెన్నైకి తరలించినట్లు ఎన్సీబీ అధికారులు నిర్ధారించారు. సరుకు రవాణా చేసిన లారీ డ్రైవర్‌తో నకిలీ నంబర్ ప్లేట్లు, నకిలీ ఫాస్ట్ ట్యాగ్ ఏర్పాటు చేసిన మరో వ్యక్తిని అరెస్టు చేశారు. గంజాయి స్మగ్లింగ్ నెట్‌వర్క్‌లో ఈ ఇద్దరు భాగమని, ఇందులో ఇతర వ్యక్తుల ప్రమేయాన్ని కనిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఎన్సీబీ అధికారులు వెల్లడించారు. కాగా తమిళనాడు యువతలో మాదకద్రవ్యాల వినియోగం పెరగడంపై అక్కడి ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. చేస్తున్నాయి. రాష్ట్రం ఇతర దేశాలకు మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు కేంద్రంగా మారుతోందని ఆరోపణలు చేస్తున్నారు. అయితే అధికార డిఎంకె తమిళనాడులో ఎటువంటి మాదకద్రవ్యాలు తయారు చేయబడటం లేదని, బదులుగా ఇతర రాష్ట్రాల నుండి అక్రమంగా రవాణా అవుతున్నాయని, మాదకద్రవ్యాల అక్రమ రవాణాదారులపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.




