Viveka Murder Case: వివేకా హత్య కేసులో కీలక మలుపు.. ప్రధాన నిందితుడు ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దయింది. ఈ మేరకు గురువారం తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దయింది. ఈ మేరకు గురువారం తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం.. తీర్పు వెలువరించింది. ఈ సందర్భంగా ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు చేసిన హైకోర్టు మే 5లోపు సీబీఐకి లొంగిపోవాలని ఆదేశించింది. ఒకవేళ మే 5 వరకు లోంగిపోకుంటే గంగిరెడ్డిని అరెస్ట్ చేయాలని సీబీఐను ఆదేశించింది రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం. వివేకా హత్య కేసు దర్యాప్తు కీలక దశలో ఉందని కోర్టు అభిప్రాయపడింది. నిందితుడు ఎర్ర గంగిరెడ్డి సాక్షులను బెదిరించారని.. ఆయన బయట ఉంటే సాక్షులు భయపడుతున్నారని సీబీఐ వాదనలతో కోర్టు ఏకీభవించింది. ఈ క్రమంలోనే గంగిరెడ్డి బెయిల్‌ను రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది.
కాగా వివేకా హత్య కేసులో ప్రధాన నిందితుడు ఏ 1 గా ఉన్నారు గంగి రెడ్డి. అప్పటి సిట్ ఛార్జ్ షీట్ ను 90 రోజుల్లో దాఖలు చేయకపోవడం తో డీఫాల్ట్‌గా ఆయనకు బెయిల్ లభించింంది. గంగి రెడ్డిని రిలీజ్ చేయాలని సీబీఐ కోర్టును ఆదేశించింది హై కోర్టు. ఈ క్రమంలో లక్షన్నర శ్యూరిటీతో గంగిరెడ్డికి బెయిల్ మంజూరైంది. 2019లో వివేకా హత్య జరగ్గా.. అప్పుడు ఆ కేసులో గంగిరెడ్డి అరెస్టయ్యారు. కాగా 90 రోజుల్లోపు సిట్ ఛార్జ్ షీట్ దాఖలు చేయకపోవడంతో అదే ఏడాది జూన్ 27 న గంగి రెడ్డి కు బెయిల్ మంజూరు చేసింది పులివెందుల కోర్ట్.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..