AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: టీచర్‌ ఉద్యోగం కోసం మున్సిపల్‌ కౌన్సిలర్‌ పదవికి రాజీనామా.. అదికూడా కాంట్రాక్ట్ బేసిస్ జాబ్ కోసం..

పెద్ద పెద్ద ఉద్యోగాలకు రాజీనామా చేసే చాలా మంది రాజకీయాల్లోకి దిగి అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. ఎమ్మెల్యే, ఎంపీ కాకపోయినా కనీసం వార్డు మెంబరో, సర్పంచో కావాలని కలలుగంటారు. అలాంటిది టీచర్‌ ఉద్యోగం కోసం ఒకావిడ మున్సిపల్‌ కౌన్సిలర్‌ పదవికి రాజీనామా చేసి అందర్ని ఆశ్చర్యపరిచారు. అది కాంట్రాక్ట్‌ బేసిస్‌లో టీచర్‌ ఉద్యోగం కోసం.

Andhra Pradesh: టీచర్‌ ఉద్యోగం కోసం మున్సిపల్‌ కౌన్సిలర్‌ పదవికి రాజీనామా.. అదికూడా కాంట్రాక్ట్ బేసిస్ జాబ్ కోసం..
Municipal Councillar
Shiva Prajapati
|

Updated on: Apr 27, 2023 | 11:39 AM

Share

పెద్ద పెద్ద ఉద్యోగాలకు రాజీనామా చేసే చాలా మంది రాజకీయాల్లోకి దిగి అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. ఎమ్మెల్యే, ఎంపీ కాకపోయినా కనీసం వార్డు మెంబరో, సర్పంచో కావాలని కలలుగంటారు. అలాంటిది టీచర్‌ ఉద్యోగం కోసం ఒకావిడ మున్సిపల్‌ కౌన్సిలర్‌ పదవికి రాజీనామా చేసి అందర్ని ఆశ్చర్యపరిచారు. అది కాంట్రాక్ట్‌ బేసిస్‌లో టీచర్‌ ఉద్యోగం కోసం.

ఈ విచిత్రమైన సంఘటన అన్నమయ్య జిల్లా మదనపల్లిలో చోటుచేసుకుంది. మదనపల్లి మున్సిపాలిటీ 8వ వార్డు నుంచి గీతాశ్రీ టీడీపీ తరపున కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. టీచర్‌ ఉద్యోగం కోసం ఈమె 1998లో డీఎస్సీ పరీక్ష రాశారు. అప్పట్లోనే ఆమె సెలక్ట్‌ అయ్యారు. కాని రకరకాల కారణాలతో ఈమెకు అపాయింట్‌మెంట్‌ రాలేదు. తాజాగా ఈ నెల 13న గీతాశ్రీని టీచర్‌గా నియమిస్తూ చిత్తూరు DEO ఉత్తర్వులు జారీ చేశారు. తనకిష్టమైన టీచర్‌ ఉద్యోగం రావడంతో ఏ మాత్రం ఆలోచించకుండా గీతాశ్రీ తన కౌన్సిలర్‌ పదవికి రాజీనామా చేశారు. ఆమె రాజీనామాను మదనపల్లి మున్సిపల్‌ కమిషనర్‌ వెంటనే ఆమోదించారు.

అలా కౌన్సిలర్‌ పదవికి రాజీనామా చేశారో లేదో వెంటనే గీతాశ్రీ స్కూల్‌లో టీచర్‌గా చేరిపోయి పిల్లలకు పాఠాలు చెప్పడం మొదలుపెట్టారు. తనపై నమ్మకం ఉంచి కౌన్సిలర్‌గా గెలిపించిన తన వార్డు ప్రజలకు పూర్తిగా న్యాయం చేయలేకపోతున్నందుకు తనను మన్నించాలని గీతాశ్రీ తన వార్డు ప్రజలను కోరారు. రాజకీయాల నుంచి వైదొలుగుతున్నప్పటికీ ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు.

ఇవి కూడా చదవండి

అన్నట్టు గీతాశ్రీకి వచ్చింది రెగ్యులర్‌ టీచర్‌ జాబ్‌ కాదు. కాంట్రాక్ట్‌ విధానంలోనే ఈమెను టీచర్‌గా ప్రభుత్వం నియమించింది. నెల జీతం 32,670 రూపాయలు మాత్రమే. హైకోర్టు ఆదేశాలకు లోబడి ఈ నియామకం ఉంటుందని నియామక ఆదేశాల్లో DEO స్పష్టంగా పేర్కొన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

రుచితోపాటు అమోఘమైన పోషకాలు దాగి ఉన్న ఈ పండు గురించి తెలుసా?
రుచితోపాటు అమోఘమైన పోషకాలు దాగి ఉన్న ఈ పండు గురించి తెలుసా?
రాగి బాటిల్ vs గ్లాస్ బాటిల్.. మంచి నీళ్లు తాగడానికి ఏది బెస్ట్?
రాగి బాటిల్ vs గ్లాస్ బాటిల్.. మంచి నీళ్లు తాగడానికి ఏది బెస్ట్?
భుజంపై తాబేలుతో పోజులిచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ.. ఫొటోస్ ఇదిగో
భుజంపై తాబేలుతో పోజులిచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ.. ఫొటోస్ ఇదిగో
పెట్రోల్‌, డీజిల్‌ కారు ఉన్నవారికి ఫ్రీగా రూ.50 వేలు!
పెట్రోల్‌, డీజిల్‌ కారు ఉన్నవారికి ఫ్రీగా రూ.50 వేలు!
తెల్లటి బియ్యాన్ని దానం చేయడం వల్ల కలిగే ఈ 5 అద్భుత ప్రయోజనాలు
తెల్లటి బియ్యాన్ని దానం చేయడం వల్ల కలిగే ఈ 5 అద్భుత ప్రయోజనాలు
చలికాలంలో ఒంటి నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయా?.. ఇదే కారణం..
చలికాలంలో ఒంటి నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయా?.. ఇదే కారణం..
ఈ కంపెనీ అద్భుతాలు చేసింది.. ఇక మొత్తం కంప్యూటర్‌ కీబోర్డ్‌లోనే..
ఈ కంపెనీ అద్భుతాలు చేసింది.. ఇక మొత్తం కంప్యూటర్‌ కీబోర్డ్‌లోనే..
OTTలో ఒళ్లు గగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. ధైర్యముంటేనే చూడండి
OTTలో ఒళ్లు గగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. ధైర్యముంటేనే చూడండి
కోనసీమ.. చమురు బావుల కింద కుంగాల్సిందేనా?
కోనసీమ.. చమురు బావుల కింద కుంగాల్సిందేనా?
నేపాల్‌లో మత ఘర్షణలు.. సోషల్ మీడియా చిచ్చుతో బిర్గుంజ్‌లో కర్ఫ్యూ
నేపాల్‌లో మత ఘర్షణలు.. సోషల్ మీడియా చిచ్చుతో బిర్గుంజ్‌లో కర్ఫ్యూ