AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vizag: అల్లారుముద్దుగా పెంచిన బిడ్డనే చంపేసిన తండ్రి.. సెల్ఫీ వీడియోలో సంచలన విషయాలు

విశాఖ వన్‌టౌన్‌లోని రెల్లివీధిలో 16ఏళ్ల లిఖితశ్రీని కన్నతండ్రే హత్య చేయడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రేమ వ్యవహారమే ఈ హత్యకు కారణంగా చెప్తున్నారు. నిందితుడు వరప్రసాద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Vizag: అల్లారుముద్దుగా పెంచిన బిడ్డనే చంపేసిన తండ్రి.. సెల్ఫీ వీడియోలో సంచలన విషయాలు
Accused Varaprasad
Ram Naramaneni
|

Updated on: Nov 05, 2022 | 9:10 AM

Share

అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు చెడు తిరుగుళ్లకు అలవాటు పడిందని మనస్తాపం చెందిన తండ్రి.. దారుణానికి ఒడిగట్టారు. అన్నం పెట్టి పెంచిన ఆ చేతులతోనే హత్య చేసి హంతకుడిగా మారి పోయాడు. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ వన్ టౌన్ రెల్లి వీధిలో నివాసముంటాడు వరప్రసాద్. తన తండ్రి, రెండో కూతురు లిఖితశ్రీతో కలసి ఈ ఇంట్లో ఉంటున్నాడు. భార్యతో విబేధాలు రావడంతో పన్నెండేళ్ల క్రితమే విడిపోయి దూరంగా ఉంటున్నాడు వరప్రసాద్. ఆమె మరొక వివాహం చేసుకోగా.. కేజీహెచ్ మహా ప్రస్తానం అంబులెన్స్ డ్రైవర్ గా పని చేసుకుంటూనే వారినింత వాళ్లను చేశాడు. పెద్ద కూతురు యమున కూడా మూడేళ్ల క్రితం తండ్రిని విడిచి వెళ్లిపోయి.. ప్రేమ పెళ్లి చేసుకుంది.. వరప్రసాద్ కు చిన్న కూతురు లిఖిత అంటే ప్రాణం. ప్రస్తుతం తనతో ఉన్నదల్లా చిన్న కూతురు లిఖితశ్రీ మాత్రమే. కాబట్టి అమ్మాయే అయినా అబ్బాయిలా పెంచాడు. ఆమెకు కరాటే కూడా నేర్పించాడు. పదహారేళ్ల ఈ మైనర్ బాలిక పదో తరగతి చదువుతోంది. ఆ రోజు వరప్రసాద్ తల్లి సంవత్సరీకం. ఆ కార్యక్రమాల్లో ఉన్నాడు వరప్రసాద్. సాయంత్రం తన తండ్రి బయటకు వెళ్లడంతో ఇంట్లో వరప్రసాద్ తన కూతురు లిఖితశ్రీమాత్రమే ఉన్నారు. నాలుగు గంటల సమయంలో వరప్రసాద్ ఇంటి నుంచి వెళ్తూ తన తండ్రికి దారిలో కనిపించాడు. కానీ ఏం మాట్లాడకుండానే వెళ్తున్నాడు. ఇంటికి వచ్చిన వర ప్రసాద్ తండ్రి.. అక్కడ మనవరాలు విగతజీవిగా పడి ఉండటం గమనించాడు. అయినా ఏదో చిన్న ఆశ. ఇరుగు పొరుగు సహకారంతో ఆస్పత్రికి తరలించగా.. ఆసరికే లిఖితశ్రీ ప్రాణం పోయినట్టు చెప్పారు వైద్యులు.

సమాచారం అందుకున్న వన్ టౌన్ పోలీసులు రంగంలోకి దిగారు. మొదట ఉరి వేసుకుని చనిపోయినట్టు భావించారు. కానీ డెడ్ బాడీ పరిశీలించగా.. అనుమానమేసింది.. తీరా ఆరా తీయగా తెలిసిందేంటంటే.. తండ్రే కూతుర్ని హతమార్చినట్టు ఒక అంచనాకు వచ్చారు. అతడి సెల్ఫీ వీడియో ద్వారా తామీ నిర్దారణకు వచ్చినట్టు చెబుతున్నారు పోలీసులు. ఈ సెల్ఫీ వీడియోలో తన కూతుర్ని ఎందుకు హత్య చేసానన్నది చెప్పుకొచ్చాడా కసాయి తండ్రి. నా కూతుర్ని ఎంతో ప్రేమగా పెంచాననీ.. ఏ స్కూల్లో చదువుతానన్నా చేర్పించాననీ.. వేరొకడితో ప్రేమలో పడిందనీ.. వద్దని వారించినా నాపైనే ఎదురుతిరిగేలా మాట్లాడిందనీ.. అందుకే చంపేశాననీ అన్నాడు.. తన తల్లి చనిపోయిన రోజే కూతుర్ని కూడా చంపేశానన్నాడు. కాబట్టి పోలీసులు తన పరిస్థితి అర్ధం చేసుకోవల్సిందిగా విజ్ఞప్తి చేశాడీ కర్కోటక తండ్రి. వరప్రసాద్ రిలీజ్ చేసిన సెల్ఫీ వీడియోతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో కలకలం చెలరేగింది.

గతంలో ఇదే అంశంపై తండ్రీ కూతుళ్లకు కౌన్సెలింగ్ ఇచ్చారు పోలీసులు. అయినా సరే ఈ సమస్య పరిష్కారం కాలేదు. ప్రస్తుతం వరప్రసాద్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడ్ని విచారించగా.. ఈ హత్యకు కారణం ప్రేమ వ్యవహారమేనని తేలింది. ఎందుకంటే లిఖిత ప్రేమించిన కుర్రాడిది నేర చరిత్ర అని. పోలీసు కేసులు కూడా ఉన్న అతడితో ప్రేమ వద్దని ఎంత వారించినా ఆమె వినలేదనీ.. అందుకే చంపి ఉంటాడనీ ఒక నిర్దారణకు వచ్చినట్టు చెబుతున్నారు పోలీసులు. నిందితుడి ఫ్యామిలీ హిస్టరీ ఆరా తీయగా తమకు తెలిసింది ఇదేనని అంటున్నారు అధికారులు.

మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..

రుచితోపాటు అమోఘమైన పోషకాలు దాగి ఉన్న ఈ పండు గురించి తెలుసా?
రుచితోపాటు అమోఘమైన పోషకాలు దాగి ఉన్న ఈ పండు గురించి తెలుసా?
రాగి బాటిల్ vs గ్లాస్ బాటిల్.. మంచి నీళ్లు తాగడానికి ఏది బెస్ట్?
రాగి బాటిల్ vs గ్లాస్ బాటిల్.. మంచి నీళ్లు తాగడానికి ఏది బెస్ట్?
భుజంపై తాబేలుతో పోజులిచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ.. ఫొటోస్ ఇదిగో
భుజంపై తాబేలుతో పోజులిచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ.. ఫొటోస్ ఇదిగో
పెట్రోల్‌, డీజిల్‌ కారు ఉన్నవారికి ఫ్రీగా రూ.50 వేలు!
పెట్రోల్‌, డీజిల్‌ కారు ఉన్నవారికి ఫ్రీగా రూ.50 వేలు!
తెల్లటి బియ్యాన్ని దానం చేయడం వల్ల కలిగే ఈ 5 అద్భుత ప్రయోజనాలు
తెల్లటి బియ్యాన్ని దానం చేయడం వల్ల కలిగే ఈ 5 అద్భుత ప్రయోజనాలు
చలికాలంలో ఒంటి నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయా?.. ఇదే కారణం..
చలికాలంలో ఒంటి నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయా?.. ఇదే కారణం..
ఈ కంపెనీ అద్భుతాలు చేసింది.. ఇక మొత్తం కంప్యూటర్‌ కీబోర్డ్‌లోనే..
ఈ కంపెనీ అద్భుతాలు చేసింది.. ఇక మొత్తం కంప్యూటర్‌ కీబోర్డ్‌లోనే..
OTTలో ఒళ్లు గగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. ధైర్యముంటేనే చూడండి
OTTలో ఒళ్లు గగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. ధైర్యముంటేనే చూడండి
కోనసీమ.. చమురు బావుల కింద కుంగాల్సిందేనా?
కోనసీమ.. చమురు బావుల కింద కుంగాల్సిందేనా?
నేపాల్‌లో మత ఘర్షణలు.. సోషల్ మీడియా చిచ్చుతో బిర్గుంజ్‌లో కర్ఫ్యూ
నేపాల్‌లో మత ఘర్షణలు.. సోషల్ మీడియా చిచ్చుతో బిర్గుంజ్‌లో కర్ఫ్యూ