Ganesh Immersion: 10 లోకేషన్స్.. 40 మంది గజ ఈతగాళ్లు.. వైజాగ్‌లో వినాయక నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు
విశాఖలో వినాయక చవితి ఉత్సవాలు అట్టహాసంగా జరుగుతున్నాయి. ఇదే సమయంలో నిమజ్జనానికి సంబందించిన ఏర్పాట్లపై అధికారులు దృష్టి సారించారు. ప్రధానంగా పోలీస్, జీవిఎంసి, రెవెన్యూ, ట్రాన్స్ కో, అర్ అండ్ బి లాంటి ఏజెన్సీల సహకారంతో నిమజ్జనానికి పక్కా ఏర్పాట్లను ప్రారంభించింది అధికార యంత్రాంగం. ముందుగా ఏ ఏ ప్రాంతాల్లో ఎక్కువ విగ్రహాలు ఉన్నాయ్.. వాటిని సమీపంలో ఎక్కడ నిమజ్జనం చేయాలన్న దిశగా అధికారులు రూట్..
విశాఖ, సెప్టెంబర్ 20: విశాఖలో వినాయక చవితి ఉత్సవాలు అట్టహాసంగా జరుగుతున్నాయి. ఇదే సమయంలో నిమజ్జనానికి సంబందించిన ఏర్పాట్లపై అధికారులు దృష్టి సారించారు. ప్రధానంగా పోలీస్, జీవిఎంసి, రెవెన్యూ, ట్రాన్స్ కో, అర్ అండ్ బి లాంటి ఏజెన్సీల సహకారంతో నిమజ్జనానికి పక్కా ఏర్పాట్లను ప్రారంభించింది అధికార యంత్రాంగం. ముందుగా ఏ ఏ ప్రాంతాల్లో ఎక్కువ విగ్రహాలు ఉన్నాయ్.. వాటిని సమీపంలో ఎక్కడ నిమజ్జనం చేయాలన్న దిశగా అధికారులు రూట్ మాప్ తయారు చేస్తున్నారు. అదే విధంగా అనుమతి తీసుకున్న విగ్రహాల కమిటీ లకు కూడా నిమజ్జనానికి వాళ్ళు ఎంపిక చేసుకున్న రూట్ మ్యాప్‌ను ఇవ్వాలని కోరుతున్నారు పోలీసులు. తద్వారా ఆయా ప్రాంతాలలో చెట్లు లాంటివి అడ్డం ఉన్నా వాటిని తొలగించడం, విద్యుత్ లైన్లను సరి చేయడం, రూట్ క్లియర్ చేయడం లాంటి పనులకు సిద్దం అవుతున్నాయి ప్రభుత్వ ఏజెన్సీ లు . ఇప్పటికే ప్రారంభం ఆయిన నిమజ్జనం 28 న పూర్తి కానుంది.
10 లోకేషన్స్, 40 మంది గజ ఈతగాళ్లు
హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్ మాదిని విశాఖలో ఎక్కువ భాగం బంగాళాఖాత సముద్ర తీరంలో ఈ నిమజ్జనం జరుగుతుంటుంది. తీరం చుట్టూ నగరం ఉండడంతో ఎక్కడికక్కడ సమీప విగ్రహాలను నిమజ్జనం చేయాలని నిర్ణయించారు. ప్రధానంగా నిమజ్జనానికి సంబంధించి 10 బీచ్ లను గుర్తించారు. ఆ 10 బీచ్ లలో కూడా ఎక్కువగా అర్ కే బీచ్ లోనే ఎక్కువ విగ్రహాలు నిమజ్జనం చేస్తారు. అలాగే ఆర్ కే బీచ్ నుంచి రిషికొండ, భీమిలి బీచ్ వరకూ ఐదు స్పాట్ లు, జన సమ్మర్డం ఎక్కువగా ఉండే సింధియా, గాజువాక, ఏరాడ, అచ్యుతాపురం ప్రాంతాల్లో మరి కొన్ని స్పాట్స్ ను గుర్తించారు అధికారులు. వీటితో పాటు కొన్ని స్థానిక చెరువులను కూడా గుర్తించిన పోలీసులు అక్కడ కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు .
గుర్తించిన ప్రాంతాలలో క్రేన్లు, సీ సీ కెమెరాలతో పాటు 40 మంది గజ ఈతగాల్లను కూడా సిద్దం చేశారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా అన్ని సీసీ కెమెరాలను కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి దానికి అనుసంధానం చేసి అక్కడ పర్యవేక్షణ కోసం ఒక డిఎస్పీ స్థాయి అధికారిని నియమించారు. దీంతో నిరంతరం పర్యవేక్షణలో ఉంటూ అవసరమైన సూచనలను కంట్రోల్ రూం నుంచే ఇచ్చే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
గణనీయంగా తగ్గిన విగ్రహాలు
వాస్తవానికి 2019 లో విశాఖలో దాదాపుగా 2500 విగ్రహాలు ఉండేవి. ఆ తర్వాత కోవిడ్ ప్రభావంతో అవి గణనీయంగా తగ్గాయి. ఈ ఏడాది వాటి సంఖ్య 1000 లోపే అంటే ఏ స్థాయిలో తగ్గాయో అర్థం చేసుకోవచ్చు. దానికి ప్రధానమైన కారణం కోవిడ్ భయం తో పాటు గతం కంటే పోలీస్ ఆంక్షలు కూడా పెద్ద ఎత్తున పెరిగాయి. దాంతో పాటు ఈసారి ఆర్థిక మాంద్యం కూడా తోడైంది. దీంతో మండపాల ఏర్పాటుకి పెద్దగా ఆసక్తి చూపలేదన్న వివరణలు వినిపిస్తున్నాయి. దీంతో సంఖ్య మొత్తం వెయ్యిలోపే ఉండడంతో వాటిని వీలైనంత త్వరగా నిమజ్జనం పూర్తి చేయాలన్న ఆలోచనలో పోలీసు అధికారులు ఉన్నారు. రాత్రి 11 గంటల లోపే నిమజ్జనం పూర్తి చేయాలని నిర్వాహకులకు ఇప్పటికే పోలీసు అధికారులు సూచించారు.
100 అడుగుల విగ్రహాలను ఎక్కడికక్కడే నిమజ్జనం
ఈసారి రెండు తెలుగు రాష్ట్రాలతో పోలిస్తే విశాఖలో భారీ విగ్రహాల ఏర్పాటు ఎక్కువగా జరిగింది. ముఖ్యంగా వంద అడుగులకు పైబడిన విగ్రహాలు నగరంలో మూడు ప్రాంతాల్లో నెలకొల్పారు. వాటిల్లో గాజువాక లంక గ్రౌండ్స్ లో 117 అడుగుల భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయగా, బీహెచ్ఈఎల్ దగ్గర 112 అడుగులు, అలాగే దొండపర్తిలో 108 అడుగుల భారీ విగ్రహాలు ఏర్పాటు చేశారు వాటిని అక్కడి నుంచి సముద్ర తీరానికి నిమజ్జనానికి తరలించడంలో అనేక ఇబ్బందులు జరిగే అవకాశం ఉండడంతో స్థానికంగానే ఫైర్ ఇంజన్ల సహాయంతో, లేదంటే ఉన్న ప్రాంతాల్లోనే నిమజ్జనం చేయాలని అధికారులు సూచించారు. గతంలో కూడా ఇలానే చేశారు. దీంతో 100 అడుగుల పైబడి విగ్రహాల నిమజ్జన కార్యక్రమం ఎక్కడికికక్కడే జరగనుంది. మొత్తానికి నిమజ్జన యాత్ర కూడా అత్యంత శోభాయమానంగా చేయడానికి నిర్వాహకులు సిద్ధమవుతున్న పరిస్థితి విశాఖలో కనిపిస్తుంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.