Vizag: కోడిపుంజు దొంగిలించాడనే నెపంతో టార్చర్! కట్ చేస్తే.. ముగ్గురు పోలీసులపై సస్పెన్షన్ వేటు

గత నెల 28 నుంచి మూడు రోజులపాటు పోలీసులు పద్మనాభం పోలీస్ స్టేషన్కు ఇద్దరి యువకులను పిలిపించారు. రోజు పిలిపించి మూడు రోజులపాటు తిప్పించారు. చివరకు స్టేషన్ సీఐ సన్యాసి నాయుడు కేసు ఇన్వెస్టిగేషన్ బాధ్యతను క్రైమ్ పోలీసులకు అప్పగించాడు. ఇదే అదనంగా చేసుకున్న క్రైమ్ పోలీసులు ఆ ఇద్దరు యువకులకు లంచం డిమాండ్ చేశారు. ఒక్కొక్కరు ఐదేసి వేలిస్తే కేసు లేకుండా చూస్తామని అన్నారు. అంత డబ్బులు ఇచ్చుకోలేమని చెప్పడంతో క్రైమ్ కానిస్టేబుళ్లు సతీష్, శ్రీనివాస్ ప్రతాపం చూపించారు. యువకులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. తొమ్మిది నెలల క్రితం యాక్సిడెంట్..

Vizag: కోడిపుంజు దొంగిలించాడనే నెపంతో టార్చర్! కట్ చేస్తే.. ముగ్గురు పోలీసులపై సస్పెన్షన్ వేటు
Rooster Stolen Case In Vizag
Follow us
Maqdood Husain Khaja

| Edited By: Srilakshmi C

Updated on: Oct 02, 2023 | 6:32 PM

విశాఖపట్నం, అక్టోబర్ 2: కోడిపుంజు దొంగతనం నెపంతో.. విశాఖ పోలీసులు ఇద్దరు యువకులని చితకబాదారు. థర్డ్ డిగ్రీ ప్రయోగించి టార్చర్ పెట్టారు. మూడు రోజులపాటు స్టేషన్లో కూర్చోబెట్టి.. చివరకు డబ్బులు డిమాండ్ చేశారు. కేసులు లేకుండా ఉండాలంటే చేయితడపాలని హుకుం జారీ చేశారు. కాలితో తన్ని యువకుడి కాలు ఫ్రాక్చర్ అయ్యిందుకు కారణమయ్యారు. ఘటనపై సీపీ సీరియస్ ఆయి ఇద్దరు కానిస్టేబుళ్లు సహా ఎస్ఐ పైన సస్పెన్షన్ వేటు వేశారు. ముగ్గురిని రిమాండ్కు పంపేందుకు రంగం సిద్ధం చేశారు.

అసలు విషయం ఇదే..!

విశాఖ పద్మనాభం పోలీస్ స్టేషన్ పరిధిలో గల బాందేవపురంలో రాజబాబు అనే వ్యక్తి కోళ్లు పెంచుకుంటున్నాడు. అందుకోసం ఇద్దరు యువకులకు పెట్టాడు. ఓ రోజు కోడిపుంజు చోరీకి గురైంది. గ్రామంలో పంచాయతీ పెట్టారు. కాపలాకు పెట్టిన వాళ్లే చోరీ చేశారని అభియోగం నెట్టారు. గ్రామంలో పంచాయతీ సద్దుమణిగింది. కోడిపుంజు మూడో వ్యక్తి దొంగలించినట్టు గుర్తించారు. అంతటితో ఆగకుండా.. రాజబాబు పోలీసులను ఆశ్రయించాడు.

విచారణ పేరుతో మూడు రోజులపాటు.. కాలు విరిగేలా…

దీంతో గత నెల 28 నుంచి మూడు రోజులపాటు పోలీసులు పద్మనాభం పోలీస్ స్టేషన్కు ఇద్దరి యువకులను పిలిపించారు. రోజు పిలిపించి మూడు రోజులపాటు తిప్పించారు. చివరకు స్టేషన్ సీఐ సన్యాసి నాయుడు కేసు ఇన్వెస్టిగేషన్ బాధ్యతను క్రైమ్ పోలీసులకు అప్పగించాడు. ఇదే అదనంగా చేసుకున్న క్రైమ్ పోలీసులు ఆ ఇద్దరు యువకులకు లంచం డిమాండ్ చేశారు. ఒక్కొక్కరు ఐదేసి వేలిస్తే కేసు లేకుండా చూస్తామని అన్నారు. అంత డబ్బులు ఇచ్చుకోలేమని చెప్పడంతో క్రైమ్ కానిస్టేబుళ్లు సతీష్, శ్రీనివాస్ ప్రతాపం చూపించారు. యువకులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. తొమ్మిది నెలల క్రితం యాక్సిడెంట్ అయి కాలు విరిగిపోవడంతో అదే కాలిపై పోలీసులు తనడంతో పాపు అనే దళిత యువకుడి కాలు ఫ్రాక్చర్ అయింది. లోపల నుంచి కేకలు వినిపించడంతో అప్పటికే అక్కడున్న కుటుంబ సభ్యులు హుటాహుటిన లోపలికి వెళ్లి పోలీస్ స్టేషన్లో పడి ఉన్న పాపును ఆసుపత్రికి తరలించారు. దీంతో కాలు ఫ్రాక్చర్ అయినట్టు తెలింది. ఘటన జరిగాక ఇద్దరు కానిస్టేబుళ్లు పారిపోయారు. పోలీసుల తీరం నశిస్తూ బాధిత బంధువులు కుటుంబ సభ్యులు గ్రామస్తులు ఆందోళనకు దిగారు.

ఇవి కూడా చదవండి

సీపీ సీరియస్! పోలీసుల పై కేసు.. ఆ ముగ్గురి సస్పెన్షన్..

ఈ విషయం కాస్త నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్ అయ్యనార్ దృష్టికి వెళ్లడంతో డిసిపి నాగన్న ఎంక్వయిరీ చేయాల్సిందిగా ఘటన స్థలానికి పంపించారు. ఈ విషయంపై సమగ్రంగా దర్యాప్తు చేయగా ఈ సంఘటన వాస్తవమని తేలింది. దీంతో కానిస్టేబుల్లు కట్టా శ్రీనివాసరావు, కే. సతీష్ లు ఈ అరాచకానికి పాల్పడినట్లు దర్యాప్తు నివేదిక సమర్పించారు. పర్యవేక్షించాల్సిన ఎస్ఐ మల్లేష్ కూడా.. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించినట్టు తెలింది. దీంతో క్రైమ్ కానిస్టేబుళ్లు సతీష్ శ్రీనివాస్ పై కేసు నమోదు చేయాలని ఆదేశించారు. 325 రెడీ విత్ 34 ఐపిసి తోపాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు పద్మనాభం పోలీసులు. ఘటనపై సిపి సీరియస్ అయ్యారు.. ఇద్దరు కానిస్టేబుల్ లతో సహా ఎస్సై పైన సస్పెన్షన్ వేటు వేశారు. ఈ విషయాన్ని టీవీ 9 తో చెప్పారు డిసిపి శ్రీనివాసరావు.

సీపీ ఆదేశాలతో..ఘటనకు బాధ్యులుగా ఉన్న క్రైమ్ ఎస్ఐ మల్లేష్ కానిస్టేబుల్ సతీష్ శ్రీనివాస్ లను అరెస్టు చేసి రిమాండ్కు పంపే రంగం సిద్ధం చేస్తున్నారు. స్టేషన్ హౌస్ ఆఫీసర్ సన్యాసి నాయుడు పరిరక్షణ లోపం కూడా ఉన్నట్టు ఘటనపై విచారించిన డిసిపి సిపి దృష్టికి తీసుకెళ్లారు. మరోవైపు బాధితుడు విజయనగరం మహారాజ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.

షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?