Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Alluri District: అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లర్ల గుట్టురట్టు.. 9 మంది అరెస్ట్‌.. 129 కిలోల గంజాయి సీజ్‌..

Alluri Sitharama Raju District: అల్లూరి జిల్లా సీలేరులో అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లర్ల ముఠా గుట్టురట్టు చేశారు ఏపీ పోలీసులు. ఒడిశా నుంచి చెన్నైకి గంజాయిని తరలిస్తున్న తొమ్మిది మందిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన నిందితుల్లో ఇంజినీరింగ్‌, డిగ్రీ విద్యార్థులు ఉండటం విస్తుపోయేలా చేస్తోంది.

Alluri District: అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లర్ల గుట్టురట్టు.. 9 మంది అరెస్ట్‌.. 129 కిలోల గంజాయి సీజ్‌..
Ganja Seize In Alluri District
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Oct 03, 2023 | 6:38 AM

అల్లూరి జిల్లా, అక్టోబర్ 03: ఏపీలో పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా.. అక్రమ గంజాయి స్మగ్లర్లు రెచ్చిపోతూనే ఉన్నారు. రోజుకో చోట గంజాయి స్మగ్లింగ్‌ చేస్తూ పట్టుబడుతూనే ఉన్నారు. తాజాగా.. అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెంకొత్తవీధి మండలం సీలేరులో భారీగా గంజాయి పట్టుబడింది. సీలేరు జెన్కో కేంద్రం వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఓ నీలి రంగు కారు వచ్చి ఆగింది. అయితే.. ఆ కారు తనిఖీ చేయడానికి ప్రయత్నించేలోగా, వెనుక ఒక కంటైనర్ రావడంతో పోలీసులు వెంటనే అప్రమత్తమై రెండు వాహనాలను చుట్టుముట్టి తనిఖీ చేశారు. కంటైనర్‌లో అయిదు తెల్లటి సంచుల్లో గంజాయి ఉన్నట్టు అనుమానాలు వ్యక్తం కావడంతో పోలీసులు అలెర్ట్‌ అయ్యారు. కారుతో పాటు కంటైనర్లో ఉన్న వారిని అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించగా.. వారిలో ఒకరు పారిపోయారు.

అయితే తొమ్మిది మంది అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లర్ల ముఠాను అదుపులోకి తీసుకున్నారు. వారిలో తమిళనాడుకు చెందిన ఆంటోని, సంగయ్య, కుమార్వేల్, మణికండ ప్రభు, ఆకాష్, ఎస్.నసీర్.. గుంటూరు జిల్లాకు చెందిన బానోత్ భాను ప్రకాష్.. నర్సాపురంకు చెందిన వైరా లోకేష్.. రాజమహేంద్రవరంకు చెందిన అభి ఉండగా.. మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు. ఇక పట్టుబడిన నిందితుల్లో ఇద్దరు ఇంజినీరింగ్‌ పూర్తి చేయగా.. మరో ఇద్దరు డిగ్రీ విద్యార్థులు ఉండటం సంచలనంగా మారింది. భానోత్ భాను ప్రకాష్, అవినాష్‌ బీటెక్ చేయగా.. ఆంటోనీ, ఆకాష్ డిగ్రీ చదివారు.

కాగా, ఈ నలుగురు కేవలం చెడు వ్యవసనాలకు బానిసలై గంజాయి రవాణా చేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఇక వీరంతా.. ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లా చీడిపాకలులో గుర్తు తెలియని వ్యక్తి వద్ద గంజాయి కొనుగోలు చేసి.. సీలేరు, మోతుగూడెం, రాజమండ్రి, విజయవాడ మీదుగా చెన్నై తరలిస్తూ పట్టుపడ్డారు. రెండు వాహనాల్లో తరలిస్తున్న 129 కిలోల గంజాయితో పాటు ఆ వెహికిల్స్‌ను సీజ్ చేశారు. ఈ కేసులో 9 మందిని అరెస్ట్ చేసి.. గంజాయి స్మగ్లింగ్‌పై మరింత కూపీ లాగే పనిలో పడ్డారు అల్లూరి జిల్లా పోలీసులు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..