ఆ కెరటాలే సమాధానం చెప్పాలి.. పదిరోజులు గడిచినా.. కొడుకు చివరి చూపు కోసం ఓ తల్లి గుండె ఘోష ఇది

Visakhapatnam News: విశాఖలోని ఓ తల్లి కన్నీటి గాథ ఇది. కన్న పేగుకోసం తాళ్లడిల్లుతున్న గుండె ఘోష ఇది..! ఒక్కగానొక్క కొడుగు స్నేహితులతో కలిసి పండుగ పూట సముద్రానికి వెళ్లి.. ఇంటికి తిరిగి రాలేదు. గల్లంతైనట్టు స్నేహితులు చెప్పారు. వారం గడిచిన కొడుకు ఆచూకీ లభించలేదు. కొడుకు కోసం తలడిల్లుతున్న సమయంలో బీచ్ వడ్డుకు సగం కుళ్ళిన స్థితిలో డెడ్ బాడీ కనిపించింది. అది నీ కొడుకు దేమో గుర్తించాలని పోలీసులు సూచించారు.

ఆ కెరటాలే సమాధానం చెప్పాలి.. పదిరోజులు గడిచినా.. కొడుకు చివరి చూపు కోసం ఓ తల్లి గుండె ఘోష ఇది
Boy Missing
Follow us
Maqdood Husain Khaja

| Edited By: Sanjay Kasula

Updated on: Oct 02, 2023 | 5:04 PM

విశాఖపట్నం, ఆక్టోబర్ 02: గుర్తుపట్టలేనంతగా ఉండడంతో తాను ఎలా నిర్ణయం తీసుకునేది అని పోలీసులకు కన్నీటి వ్యధతో బదులిచ్చింది ఆ తల్లి. దీంతో ఇక చేసేది లేక డిఎన్ఏ పరీక్ష కోసం సిద్ధమయ్యారు విశాఖ పోలీసులు. అయితే తన కొడుకు నిజంగా గల్లంతయ్యాడా అని కన్నీటితో.. అమాయకంగా అభ్యర్థిస్తున్న ఆ తల్లి ఆవేదన అందరినీ కంటతడి పెట్టిస్తోంది విశాఖలోని ఓ తల్లి కన్నీటి గాథ ఇది..

అయిదుగురు స్నేహితులు యారాడ బీచ్ కు వెళ్లారు. వారిలో ఇద్దరు సముద్రంలో దిగారు. అందులో ఒకడు కెరటాల్లో కొట్టుకుపోయాడు. వినాయక చవితి రోజు ఆ కుటుంబంలో విషాదం నింపింది. గంటలు గాడిచాయి.. రోజులు గాడిచాయి.. కానీ కొడుకు ఆచూకీ లేక ఆ తల్లి తల్లడిల్లిపోతోంది. ఇంతలో గుర్తుపటిల్లె్నంత గా ఓ మార్తదేహ్మలోని భాగం ఒడ్డుకొచ్చింది. అది మీ కొడుకుండేమోనని గుర్తుపట్టాలని సూచించారు పోలీసులు. తీరని విషాదంలో ఉన్న ఆ తల్లి.. ఇంకా తల్లడిల్లిపోయింది.

విహారానికి వెళ్లి.. కెరటాల్లో..

– గాజువాక పెదగంట్యాడ దయాల్ నగర్ లో … సంతోష్ కుమారి అనే మహిళా తన పదహారేళ్ల కొడుకు కళ్యాణ్ కుమార్ కూతురుతో కలిసి నివాసం ఉంటుంది. భర్త లేకపోవడంతో.. పిల్లలను పోషించుకుంటూ గడుపుతుంది. అయితే.. గతంలో ఉండే సింహగిరి కాలనీలో.. వినాయక ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. అక్కడికి వెళ్తానని చెప్పిన కళ్యాణ్ కుమార్.. కాసేపు అక్కడ తన స్నేహితులతో గడిపాడు. ఆ తరువాత.. కడ మంచి శ్రీను, చెన్నూరి శివకుమార్ సుశాంత్, మధుతో కలిసి వినాయక చవితి రోజునే యారాడ బీచ్కు రెండు బైకులపై వెళ్లారు.

అక్కడ సరదాగా గడిపారు. ఒకవైపు వినాయక నిమజ్జనం మహోత్సవాలు జరుగుతుండగా.. అక్కడకు కొంత దూరంలో బీచ్ స్నానానికి వెళ్లారు ఐదుగురు స్నేహితులు. శ్రీను, కళ్యాణ్ కుమార్ ఇద్దరూ సముద్రంలో దిగారు. ఇంతలో పెద్ద కెరటం వచ్చి ఇద్దరిని లోపలికి లాక్కెళ్ళిపోయింది. అక్కడే ఉన్న గజ ఈతగాళ్ళు శ్రీనును కాపాడారు. కానీ కళ్యాణ్ కుమార్ సముద్రంలోకి వెళ్లిపోయాడు.

కుళ్ళిన స్థితిలో ఆ సగం మృతదేహం కోసం..

తల్లితో పాటు పోలీసులకు సమాచారం అందించారు మిగతా స్నేహితులు. హుటాహుటిన తల్లి సంతోష్ కుమారి అక్కడకు చేరుకుంది.. విషయాన్ని అక్కడ గజ ఈతగాళ్ళు చెప్పారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సముద్రంలో గాలింపు చర్యలు చేపట్టారు. గంటలు గడిచాయి.. రోజులు గడిచాయి. కానీ కళ్యాణ్ కుమార్ ఆచూకీ మాత్రం లభించలేదు. ఏడ్చి ఏడ్చి కొడుకు ఆచూకీ కోసం చూసి తల్లి కళ్ళల్లో కన్నీరు ఇంకిపోయింది. కానీ కొడుకు ఆచూకీ లభించలేదు.

అయితే.. ఈనెల 28న యారోల తీరానికి ఓ కూళ్ళైన స్థితిలో మృతదేహం కొట్టుకొచ్చింది. అది కూడా నడుము నుంచి మూడు వరకు భాగమే ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు.. కళ్యాణ్ కుమార్ తల్లికి పిలిపించారు. మృతదేహం తన కొడుకుదేమోనని గుర్తుపట్టమన్నని చెప్పమని అన్నారు న్యూ్పోర్ట్ సీఐ రాము.

విషాదంలో మరో ఆవేదన.. తానెలా గుర్తుపట్టేది..ఆ సందేహం..

యారాడ తీరానికి చేరుకున్న కళ్యాణ్ కుమార్ తల్లి సంతోష్ కుమారి.. గుర్తుపట్టలేనంత స్థితిలో ఉన్న మృతదేహాన్ని చూసి ఇంకా తలడిల్లిపోయింది. అప్పటికే తీవ్ర ఆవేదనంగా ఉన్న ఆ తల్లి.. కొడుకు కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్న సమయంలో.. గుర్తుపట్టలేనంతగా ఉన్న ఆ సగం మృతదేహం పోలీసులు చూపించడంతో మరింత ఆవేదనకు గురైంది. తానెలా తన కొడుకును గుర్తుపట్టేదంటూ కన్నీరు మునిరై విలపించింది. పోలీసులే తేల్చాలని కోరింది తల్లి సంతోష్ కుమారి. అయితే తన కొడుకు నిజంగా గల్లంతయ్యాడా అనేది కూడా సందేహంగా ఉందని ఆ తల్లి ఆవేదనంతో అమాయకంగా చెబుతుండడం అందరినీ కలచి వేస్తోంది.

ఇక..డీఎన్ఏ తోనే..

ఒకవైపు గల్లంతయిన కళ్యాణ్ కుమార్ వారం పది రోజులు గడిచిన ఆచూకీ లేకపోవడం.. మరోవైపు ఒడ్డు కోఛ్చిన మృతదేహం భాగం తల్లి గుర్తుపట్టకపోవడంతో.. ఇక డిఎన్ఏ పరీక్ష కోసం సిద్ధమయ్యారు పోలీసులు. ఒడ్డుకు కొట్టుకొచ్చిన గుర్తుపట్టానే మృతదేహం నమూనాలతో పాటు.. తల్లి కుటుంబ సభ్యుల శాంపిల్స్ సేకరించి డిఎన్ఏ కి పంపి తెలుస్తామంటున్నారు పెదగంట్యాడ సీఐ రాము.

అందరిలో ఈ వినాయక చవితి పండుగ ఉత్సాహాన్ని, ఆనందాన్ని, సంబరాలను తెచ్చిపెడితే.. కళ్యాణ్ కుమార్ ఇంట్లో తీవ్ర విషాదం నింపింది. ఆ కన్నతల్లికి కడుపుకోటను మిగిల్చింది. తన కొడుకు కడసారి చూపు కల్పించాలని ఆ తల్లి ఆవేదన అందరిని కంటతడి పెట్టిస్తోంది. డిఎన్ఏకు పంపినా.. ఒడ్డుకు కొట్టుకోసిన మృతదేహం, కళ్యాణ్ కుమార్ తల్లి డిఎన్ఏ తో సరిపోతే పర్వాలేదు.. లేకపోతే మళ్లీ ఆ తల్లి కన్నీటి కష్టం మొదటి వచ్చినట్లే. మరి పోలీసులే కళ్యాణ్ కుమార్ ఆచూకి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం

సింగర్ శివశ్రీని పెళ్లాడబోతున్న బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య..
సింగర్ శివశ్రీని పెళ్లాడబోతున్న బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య..
స్కంద షష్ఠి రోజున ఇలా కార్తికేయుడిని పూజించండి కోరిక నెరవేరుతుంది
స్కంద షష్ఠి రోజున ఇలా కార్తికేయుడిని పూజించండి కోరిక నెరవేరుతుంది
ఇదేం భక్తిరా బాబూ.! అందరూ గుడికి మొక్కేందుకు వెళ్తే..
ఇదేం భక్తిరా బాబూ.! అందరూ గుడికి మొక్కేందుకు వెళ్తే..
2025లో మొదటి వైకుంఠ ఏకాదశి తేదీ, పూజ సమయం, ప్రాముఖ్యత ఏమిటంటే
2025లో మొదటి వైకుంఠ ఏకాదశి తేదీ, పూజ సమయం, ప్రాముఖ్యత ఏమిటంటే
అందరూ వేరు.. నేను వేరు.. ఫూల్లుగా తాగి ఏం చేశాడంటే..
అందరూ వేరు.. నేను వేరు.. ఫూల్లుగా తాగి ఏం చేశాడంటే..
JEE పరీక్షపై జోసా కీలక నిర్ణయం..కౌన్సెలింగ్ షెడ్యూల్ మరింత ఆలస్యం
JEE పరీక్షపై జోసా కీలక నిర్ణయం..కౌన్సెలింగ్ షెడ్యూల్ మరింత ఆలస్యం
పాముకు పాలు పోస్తే ఇంతే మరి పాక్ పై విరుచుకుపడుతోన్న తాలిబన్లు
పాముకు పాలు పోస్తే ఇంతే మరి పాక్ పై విరుచుకుపడుతోన్న తాలిబన్లు
ఇంతమంది తాగుబోతులు దొరికారా.? ఎన్ని కేసులు నమోదయ్యాయంటే
ఇంతమంది తాగుబోతులు దొరికారా.? ఎన్ని కేసులు నమోదయ్యాయంటే
కొత్త ఏడాదిలో రాహు, కేతుల రాశి మార్పు.. ఈ 3 రాశులకు అన్నీ కష్టాలే
కొత్త ఏడాదిలో రాహు, కేతుల రాశి మార్పు.. ఈ 3 రాశులకు అన్నీ కష్టాలే
సీన్ చూసి యాక్సిడెంట్ జరిగిందనుకునేరు.. అసలు మ్యాటర్ తెలిస్తే
సీన్ చూసి యాక్సిడెంట్ జరిగిందనుకునేరు.. అసలు మ్యాటర్ తెలిస్తే
ఇదేం భక్తిరా బాబూ.! అందరూ గుడికి మొక్కేందుకు వెళ్తే..
ఇదేం భక్తిరా బాబూ.! అందరూ గుడికి మొక్కేందుకు వెళ్తే..
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..