Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: నా చావుకు.. నా భార్యే కారణం.. గుండెను పిండేస్తున్న సూసైడ్ లేటర్..

Vijayawada: వివాహేతర సంబంధం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. కుటుంబ వివాదాలు, ఆస్తి తగాదాల వలన భార్యకు దూరమైన ఓ వ్యక్తి ఒంటరిగా బతకలేక, తీవ్రం మనస్థాపం చెంది బలవన్మరణానికి పాల్పడ్డాడు. తాను చనిపోవడానికి ముందు సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన చావుకు భార్య, ఆమెకు సహకరించిన మరి కొంతమంది అని సూసైడ్ నోట్‌ లో రాసి ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన విజయవాడ కృష్ణలంకలో తీవ్ర కలకలం రేపింది..

Andhra Pradesh: నా చావుకు.. నా భార్యే కారణం.. గుండెను పిండేస్తున్న సూసైడ్ లేటర్..
Vijayawada Man Suicide
Follow us
M Sivakumar

| Edited By: Shiva Prajapati

Updated on: Oct 11, 2023 | 12:23 PM

Vijayawada, October 11: వివాహేతర సంబంధం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. కుటుంబ వివాదాలు, ఆస్తి తగాదాల వలన భార్యకు దూరమైన ఓ వ్యక్తి ఒంటరిగా బతకలేక, తీవ్రం మనస్థాపం చెంది బలవన్మరణానికి పాల్పడ్డాడు. తాను చనిపోవడానికి ముందు సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన చావుకు భార్య, ఆమెకు సహకరించిన మరి కొంతమంది అని సూసైడ్ నోట్‌ లో రాసి ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన విజయవాడ కృష్ణలంకలో తీవ్ర కలకలం రేపింది..

విజయవాడ కృష్ణలంకకు చెందిన బిల్డర్ అనిల్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. అతనికి భార్యతో పాటు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కొడుకు , కూతురు ఇద్దరూ విదేశాల్లో స్థిరపడ్డారు. అయితే గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య విభేదాలు జరుగుతూ ఉన్నాయి. ఈ క్రమంలోనే అనిల్ కృష్ణలంకలో శంకర్ మఠం సమీపంలో కూతురు ఇంట్లోని నాలుగవ అంతస్తులో ఒంటరిగా ఉంటున్నాడు.

బిల్డర్ అనిల్ భార్య రాధా లక్ష్మి కృష్ణలంక ఆర్చి రోడ్ లోని సొంతింటిలో నివాసం ఉంటుంది. అనిల్ ఒంటరిగా ఉండటం జీర్ణించుకోలేకపోయాడు. తీవ్ర మనస్థాపానికి గురైన అనిల్ ఒంటరిగా బతకలేక ఆత్మహత్య చేసుకొని మృతి చెందాడు. అయితే సోమవారం ఉదయం ఏడు గంటల సమయంలో కూతురు తండ్రి ఫోన్ కు ఫోన్ చేసింది. ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో అనుమానం వచ్చి వాచ్‌మెన్‌కి ఫోన్ చేసి తన తండ్రి వద్దకు వెళ్లాలని చెప్పింది. వెంటనే వాచ్‌మెన్ ఇంట్లోకి వెళ్లి చూడగా బిల్డర్ అనిల్ ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించాడు. దీంతో పోలీసులకు సమాచారాన్ని అందించాడు.

ఇవి కూడా చదవండి

విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తును ప్రారంభించారు. ఆత్మహత్యకు ముందు బిల్డర్ అనిల్ రాసిన సూసైడ్ నోటును స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించి దర్యాప్తు వేగవంతం చేశారు. తను, తన భార్య కొంతకాలంగా ఒంటరిగా ఉంటున్నామని.. తమ వద్ద పనిచేసిన డ్రైవర్‌తో భార్య వివాహేతర సంబంధం పెట్టుకోవడమే కాకుండా, తనను మానసికంగా వేధింపులకు గురిచేసి ఆస్తి మొత్తాన్ని తన పేరున రాయించుకుందని లేఖలో పేర్కొన్నాడు. తన చావుకు భార్య, ఆమెకు సహకరించిన భువనగిరి రాము, అరుణ అనేవారు కారణమని సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు. దీంతో సూసైడ్ నోట్ ఆధారంగా కృష్ణలంక పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..