AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP News: అక్వా రంగంపై ట్రంప్‌ ఎఫెక్ట్.. భారీగా పడిపోయిన రొయ్యల ధర!

అగ్రరాజ్య అధ్యక్షుడు ట్రంప్ అనాలోచిత నిర్ణయాలతో ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలం అవుతున్నాయి. భారత్‌పై అమెరికా విధించిన పరస్పర సుంకాలు 26 శాతం నేటి నుంచే అమల్లోకి వచ్చాయి. ఈ ప్రభావంతో దేశీయ స్టాక్‌ మార్కెట్లతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని ఆక్వా రంగంపై కూడా కనిపిస్తోంది. భారత్ నుంచి చేసుకునే దిగుమతులపై అమెరికా 26 శాతం సుంకాలు విధించడంతో ఏపీలోని ఆక్వారంగం ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొంటోంది.

AP News: అక్వా రంగంపై ట్రంప్‌ ఎఫెక్ట్.. భారీగా పడిపోయిన రొయ్యల ధర!
Trump Effect
Anand T
|

Updated on: Apr 09, 2025 | 2:53 PM

Share

భారత్‌లో జరిగే రొయ్యల ఉత్పత్తిలో ఏపీనే అగ్రస్థానంలో ఉంది. దేశంలో ఏడాదికి 9 లక్షల టన్నుల రొయ్యలు ఉత్పత్తి జరుగుతుంటే అందులో 70 శాతానికి పైగా ఏపీ నుంచే వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ నుంచి అమెరికాకు చేపలు, రొయ్యలు ఎక్కువగా ఎగుమతి అవుతుంటాయి. అయితే ప్రధానంగా ఏపీలో ఉత్పత్తి అయ్యే రొయ్యల్లో 29శాతం అమెరికాకు ఎగుమతి అవుతున్నాయి, మిగిలినవి చైనా, జపాన్, ఇతర గల్ఫ్‌ దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ట్రంప్ విధించిన పరస్పర సుంకాలు ప్రభావంతో ఏపీలో రొయ్యల రేట్లు భారీగా తగ్గిపోయాయి.

ముఖ్యంగా రొయ్యల సాగు అధికంగా జరిగే భీమవరం, తూర్పు గోదావరి వంటి ప్రాంతాల్లో కిలో రొయ్యల ధర 40 రూపాయలు పడిపోయింది. దీంతో ఆక్వారైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజా సుంకాలను ప్రకారం చూసుకుంటే ఓ అక్వా రైతు లక్ష రూపాయల విలువ చేసే రొయ్యలను ఎగుమతి చేయాలంటే రూ.26,000 సుంకాన్ని చెల్లించాల్సి ఉంటుంది. దీంతో పాటు యాంటీ డంపింగ్‌ డ్యూటీ, కౌంటర్‌ వయోలిన్‌ డ్యూటీని కలుపుకుంటే మొత్తం రూ.35 వేలకు పైగా కట్టాల్సి ఉంటుంది. ఇవే కాకుండా ట్రాన్స్‌పోర్ట్‌, ప్యాకింగ్‌ ఖర్చులు అని ఇంకో 20వేల దాకా పెట్టాల్సి ఉంటుంది. ఇక మొత్తంగా లక్ష రూపాయల్లో 50 శాతం వరకు ఈ పన్నులు, రవాణా ఖర్చులకే పోతోందని..తమకు మిగిలేదేమిలేదని రైతులు అంటున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

రుచితోపాటు అమోఘమైన పోషకాలు దాగి ఉన్న ఈ పండు గురించి తెలుసా?
రుచితోపాటు అమోఘమైన పోషకాలు దాగి ఉన్న ఈ పండు గురించి తెలుసా?
రాగి బాటిల్ vs గ్లాస్ బాటిల్.. మంచి నీళ్లు తాగడానికి ఏది బెస్ట్?
రాగి బాటిల్ vs గ్లాస్ బాటిల్.. మంచి నీళ్లు తాగడానికి ఏది బెస్ట్?
భుజంపై తాబేలుతో పోజులిచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ.. ఫొటోస్ ఇదిగో
భుజంపై తాబేలుతో పోజులిచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ.. ఫొటోస్ ఇదిగో
పెట్రోల్‌, డీజిల్‌ కారు ఉన్నవారికి ఫ్రీగా రూ.50 వేలు!
పెట్రోల్‌, డీజిల్‌ కారు ఉన్నవారికి ఫ్రీగా రూ.50 వేలు!
తెల్లటి బియ్యాన్ని దానం చేయడం వల్ల కలిగే ఈ 5 అద్భుత ప్రయోజనాలు
తెల్లటి బియ్యాన్ని దానం చేయడం వల్ల కలిగే ఈ 5 అద్భుత ప్రయోజనాలు
చలికాలంలో ఒంటి నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయా?.. ఇదే కారణం..
చలికాలంలో ఒంటి నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయా?.. ఇదే కారణం..
ఈ కంపెనీ అద్భుతాలు చేసింది.. ఇక మొత్తం కంప్యూటర్‌ కీబోర్డ్‌లోనే..
ఈ కంపెనీ అద్భుతాలు చేసింది.. ఇక మొత్తం కంప్యూటర్‌ కీబోర్డ్‌లోనే..
OTTలో ఒళ్లు గగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. ధైర్యముంటేనే చూడండి
OTTలో ఒళ్లు గగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. ధైర్యముంటేనే చూడండి
కోనసీమ.. చమురు బావుల కింద కుంగాల్సిందేనా?
కోనసీమ.. చమురు బావుల కింద కుంగాల్సిందేనా?
నేపాల్‌లో మత ఘర్షణలు.. సోషల్ మీడియా చిచ్చుతో బిర్గుంజ్‌లో కర్ఫ్యూ
నేపాల్‌లో మత ఘర్షణలు.. సోషల్ మీడియా చిచ్చుతో బిర్గుంజ్‌లో కర్ఫ్యూ