Viral: రాత్రివేళ ఇంట్లోకి సడెన్ ఎంట్రీ ఇచ్చి అనుకోని అతిథి.. తెల్లారి లేచి చూడగానే..
జాతీయ రహదారిపై ఉన్న చిన్న గ్రామం అది.. మంగళగిరి సమీపంలోని చినకాకాని గ్రామంలోకి ఎక్కడ నుండి వచ్చిందో గానీ ఒక జింక వచ్చింది. చెంగు చెంగు మంటూ వచ్చిన జింకను చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు. రామాంజినేయుల ఇంటిలో తెల్లవారి లేచి చూసేసరికి అటు ఇటు పరిగెడుతూ కనిపించింది.

జాతీయ రహదారిపై ఉన్న చిన్న గ్రామం అది.. మంగళగిరి సమీపంలోని చినకాకాని గ్రామంలోకి ఎక్కడ నుండి వచ్చిందో గానీ ఒక జింక వచ్చింది. చెంగు చెంగు మంటూ వచ్చిన జింకను చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు. రామాంజినేయుల ఇంటిలో తెల్లవారి లేచి చూసేసరికి అటు ఇటు పరిగెడుతూ కనిపించింది. అయితే గేదెల కోసం తీసుకొచ్చిన మేత ఉండటంతో దాన్ని తినటానికి వచ్చినట్లు కుటుంబ సభ్యలు భావించారు. వెంటనే మంగళగిరిలోని అటవీ శాఖాధికారులకు సమాచారం అందించారు. వెంటనే రామాంజినేయులు ఇంటికి వచ్చిన అటవీ శాఖాధికారులు జింకను తీసుకొని వెళ్లిపోయారు.
అయితే చినకాకాని చుట్టు పక్కల ఎక్కడా కూడా అటవీ ప్రాంతం లేదు. జింకలు ఉండే అవకాశం లేదు. మరి ఎక్కడ నుండి ఈ జింక వచ్చిందోనన్న అనుమానం స్థానికులు ఉండిపోయింది. ఇదే అంశాన్ని స్థానికులు అటవీ శాఖాధికారులకు అడిగారు. అయితే గుంటూరు అమరావతి మార్గంలోని నిడుముక్కల కొండల్లో జింకలున్నాయని అటవీ శాఖాధికారులు తెలిపారు. అక్కడ నుండే జింక పిల్ల తప్పిపోయిన మేత కోసం వచ్చినట్లు భావిస్తున్నట్లు చెప్పారు.
వీడియో చూడండి..
రాజధాని ప్రాంతంలో జంగిల్ క్లియరెన్స్ చేయడంతో దారి తప్పిపోయిన జింక పిల్ల గ్రామంలోకి వచ్చి ఉంటుందన్నారు. ఆరోగ్యంగానే ఉన్న జింక పిల్లకు వెటర్నరీ వైద్యాధికారుల చేత పరీక్షలు చేయించి అనంతరం అడవిలో వదిలిపెడతామని చెప్పారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
