CM Chandrababu New House: కొత్త ఇంటి నిర్మాణానికి సీఎం చంద్రబాబు శంకుస్థాపన.. ఎక్కడో తెలుసా?
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్ర రాజధాని అమరావతిలో మరో ఇంటిని నిర్మించబోతున్నారు. అమరావతిలోని వెలగపూడి సచివాలయం వెనక E9 రహదారి పక్కనే ఇంటి నిర్మాణం చేపట్టారు. ఈ సందర్భంగా తన ఇంటి నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. కుటుంబ సమేతంగా కొత్త ఇంటి శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్ర రాజధాని అమరావతిలో కొత్త ఇంటిని నిర్మించబోతున్నారు. అమరావతిలోని వెలగపూడి సచివాలయం వెనక E9 రహదారి పక్కనే ఇంటి నిర్మాణం చేపట్టారు. ఈ సందర్భంగా తన ఇంటి నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. కుటుంబ సమేతంగా కొత్త ఇంటి శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ ఇంటి నిర్మాణం కోసం గత ఏడాది డిసెంబరులో ఇదే గ్రామానికి చెందిన ఓ రైతు నుంచి 5 ఎకరాల స్థలాన్ని సీఎం చంద్రబాబు కొనుగోలు చేశారు. ఇటీవలే ప్లాట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి కావడంతో 1,455 చదరపు గజాల విస్తీర్ణంలో జి ప్లస్ 1 ఇంటి నిర్మాణానికి ఇవాళ శంకుస్థాపన చేశారు. ఏడాదిలోపు ఇంటి నిర్మాణ పూర్తి చేసి గృహప్రవేశం చేయాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, ఆయన సతీమణి నారా భువనేశ్వరి, మంత్రి నారా లోకేశ్, బ్రాహ్మణి, దేవాంశ్ పాల్గొన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు

