CM Revanth Reddy: సబర్మతీ ఆశ్రమాన్ని సందర్శించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
ఇటీవల గుజరాత్ పర్యటనకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి అహ్మదాబాద్‌లోని సబర్మతీ ఆశ్రమాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా జాతిపిత మహాత్మ గాంధీకి నివాళులర్పించారు. సబర్మతీ ఆశ్రమంలో సాగిన మహాత్మా గాంధీ జీవన విధానం, ఆశ్రమ విశిష్టతలను అక్కడి నిర్వహకులను సీఎం రేవంత్ రెడ్డికి వివరించారు
AICC ప్రత్యేక కార్యక్రమాలు, CWC సమావేశాల కోసం ఇటీవల గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం అహ్మదాబాద్‌లోని సబర్మతీ ఆశ్రమాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా జాతిపిత మహాత్మ గాంధీకి నివాళులర్పించారు. సబర్మతీ ఆశ్రమంలో సాగిన మహాత్మా గాంధీ జీవన విధానం, ఆశ్రమ విశిష్టతలను అక్కడి నిర్వహకులను సీఎం రేవంత్ రెడ్డికి వివరించారు.అప్పట్లో మహాత్మ గాంధీ వాడిన చరఖాన్ని సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. అక్కడ కూర్చొన్ని చరఖాన్ని తిప్పి చూశారు. తర్వాత ఆశ్రమంలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలో ఆయన పాల్గొన్నారు.
వైరల్ వీడియోలు
కొబ్బరిచెట్టుపై కాయలు కోస్తున్న కోతి.. నెట్టింట వీడియో వైరల్
కొవిడ్ తరహా స్క్రీనింగ్.. ఆ ఎయిర్‌పోర్టుల్లో మళ్ళీ మొదలు
పనిచేస్తున్న ఇంట్లోనే చోరీ.. రూ.18 కోట్ల బంగారం దోచుకెళ్లారు
పోలీసులమంటూ బంగారం దోపిడి.. పాలమూరులో నయా ముఠా
ఏనుగు పిల్లకు పుట్టినరోజు వేడుక.. అదరగొట్టారుగా
రైల్వే స్టేషన్లో గుండె పగిలే ఘటన..
ఓర్నీ.. మటన్ బొక్క ఎంతపని చేసిందీ

