TTD: ఆ రెండు రోజుల్లో తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత.. అన్ని సేవలు రద్దు..

ఈ ఏడాది అక్టోబరు 25న సూర్యగ్రహణం, నవంబరు 8న చంద్రగ్రహణం ఏర్పడుతున్నాయి. ఈ రెండు గ్రహణ రోజులో తిరుమల తిరుపతిలోని శ్రీవారి ఆలయాన్ని మూసివేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు..

TTD: ఆ రెండు రోజుల్లో తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత.. అన్ని సేవలు రద్దు..
Tirumala Srivari Temple
Follow us

|

Updated on: Oct 19, 2022 | 11:57 AM

ఈ ఏడాది అక్టోబరు 25న సూర్యగ్రహణం, నవంబరు 8న చంద్రగ్రహణం ఏర్పడుతున్నాయి. ఈ రెండు గ్రహణ రోజులో తిరుమల తిరుపతిలోని శ్రీవారి ఆలయాన్ని మూసివేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. ఈ నెల (అక్టోబర్) 25న సూర్య గ్రహణం కారణంగా ఉదయం 8 నుంచి సాయంత్రం 7 గంటల 30 నిముషాల వరకు ఆలయం మూసివేస్తున్నట్లు ఆలయ నిర్వహకులు తెలిపారు. అలాగే నవంబర్ 8న ఏర్పడనున్న చంద్ర గ్రహణం కారణంగా మరోమారు శ్రీవారి ఆలయం మూసివేయనున్నారు. నవంబర్ 8న ఉదయం 8 గంటల 30 నిముషాల నుంచి సాయంత్రం 7 గంటల 30 నిముషాల వరకు ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం తెల్పింది.

ఆయా గ్రహణాలు వీడగానే ఆలయ శుద్ధి అనంతరం తిరిగి ఆలయం తెరుచుకోనుంది. గ్రహణం రోజుల్లో వీఐపీ బ్రేక్, శ్రీవాణి, రూ.300 దర్శనాలు, ఆర్జిత సేవలు, అన్నప్రసాద పంపిణీ, అన్నీ రకాల ప్రివిలేజ్ దర్శనాలు రద్దు చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు. ఇక అక్టోబర్ 24న ఆలయంలో దీపావళీ ఆస్థానం కారణంగా వీఐపీ బ్రేక్ దర్శనాలు కూడా రద్దు చేస్తున్నారు. సర్వదర్శనం భక్తులకు మాత్రమే స్వామివారి దర్శనం కల్పించనున్నట్లు తితిదే వెల్లడించింది.

కాగా ఈసారి ఏర్పడే అరుదైన పాక్షిక సూర్యగ్రహణం భారత్‌లోనూ కనువిందు చేయనుంది. ఇలాంటి పాక్షిక సూర్యగ్రహణాన్ని మళ్లీ చూడాలంటే మరో పదేళ్లు ఆగాల్సిందేనని పరిశోధకులు అంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.