India Post GDS Results 2022: తెలుగు రాష్ట్రాల్లో గ్రామీణ డాక్‌ సేవక్‌ 2022 ఫలితాలు విడుదల.. రిజల్ట్స్‌ ఇలా చెక్‌ చేసుకోండి..

భారత తపాలా శాఖలో గ్రామీణ డాక్‌ సేవక్‌ (జీడీఎస్) రిక్రూట్‌మెంట్‌ 2022కు సంబంధించిన ఫలితలు బుధవారం (అక్టోబర్‌ 18) విడుదలయ్యాయి. తాజాగా విడుదల చేసిన ఆరో లిస్టులో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ సర్కిళ్లకు..

India Post GDS Results 2022: తెలుగు రాష్ట్రాల్లో గ్రామీణ డాక్‌ సేవక్‌ 2022 ఫలితాలు విడుదల.. రిజల్ట్స్‌ ఇలా చెక్‌ చేసుకోండి..
India Post Recruitment 2022
Follow us
Srilakshmi C

|

Updated on: Oct 19, 2022 | 8:47 AM

భారత తపాలా శాఖలో గ్రామీణ డాక్‌ సేవక్‌ (జీడీఎస్) రిక్రూట్‌మెంట్‌ 2022కు సంబంధించిన ఫలితలు బుధవారం (అక్టోబర్‌ 18) విడుదలయ్యాయి. తాజాగా విడుదల చేసిన ఆరో లిస్టులో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ సర్కిళ్లకు సెలెక్ట్‌ అయిన అభ్యర్ధుల జాబితాను పోస్టల్ శాఖ విడుదల చేసింది. కాగా గ్రామీణ డాక్‌ సేవక్‌ పోస్టుల నియామకాలకు ఎటువంటి రాత పరీక్ష నిర్వహించకుండానే పదో తరగతి మార్కుల ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేశారు. ఎంపికైనవారు బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌ (బీపీఎం), అసిస్టెంట్‌ బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌ (ఏబీపీఎం), డాక్‌ సేవక్‌ పోస్టుల్లో విధులకు హాజరుకావల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో గ్రామీణ తపాలా కార్యాలయాల్లో గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల భర్తీకి సంబంధించి ఇండియా పోస్టు విభాగం దరఖాస్తుల్ని స్వీకరించింది. బుధవారం విడుదలైన ఫలితాల్లో అర్హులుగా ఎంపికైన వారికి తొలుత సర్టిఫికేషన్‌ వెరిఫికేషన్‌ ఉంటుంది. పూర్తి వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.