RGCB Recruitment 2022: బీఈ/బీటెక్‌ అర్హతతో కేంద్ర కొలువులు.. ఇలా దరఖాస్తు చేసుకోండి..

కేంద్ర ప్రభుత్వ బయోటెక్నాలజీ డిపార్ట్‌మెంట్‌కు చెందిన కేరళ రాష్ట్రం, తిరువనంతపురంలోనున్న రాజీవ్‌గాంధీ సెంటర్‌ ఫర్‌ బయోటెక్నాలజీ.. 7 పర్చేజ్‌ ఆఫీసర్‌, ఎలక్ట్రికల్‌ సూపర్‌వైజర్‌ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ..

RGCB Recruitment 2022: బీఈ/బీటెక్‌ అర్హతతో కేంద్ర కొలువులు.. ఇలా దరఖాస్తు చేసుకోండి..
RGCB Recruitment 2022
Follow us
Srilakshmi C

|

Updated on: Oct 19, 2022 | 9:09 AM

కేంద్ర ప్రభుత్వ బయోటెక్నాలజీ డిపార్ట్‌మెంట్‌కు చెందిన కేరళ రాష్ట్రం, తిరువనంతపురంలోనున్న రాజీవ్‌గాంధీ సెంటర్‌ ఫర్‌ బయోటెక్నాలజీ.. 7 పర్చేజ్‌ ఆఫీసర్‌, ఎలక్ట్రికల్‌ సూపర్‌వైజర్‌, జూనియర్‌ మేనేజ్‌మెంట్‌ అసిస్టెంట్‌, టెక్నికల్‌ అసిస్టెంట్‌ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకనే అభ్యర్ధులు పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో పదో తరగతి/గ్రాడ్యుయేషన్‌, ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్‌, ఎంఈ/ఎంటెక్ లేదా తత్సమాన కోర్సులో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. దరఖాస్తుదారుల వయసు తప్పనిసరిగా నవంబర్‌ 14, 2022వ తేదీ నాటికి 35 ఏళ్లకు మించకుండా ఉండాలి. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ విధానంలో కింది అడ్రస్‌కు నవంబర్ 14, 2022వ తేదీలోపు పోస్టు ద్వారా దరఖాస్తులు పంపించవల్సి ఉంటుంది. రాత పరీక్ష (టైర్‌-1, టైర్‌-2, టైర్‌-3) ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

ఖాళీల వివరాలు..

  • పర్చేజ్‌ ఆఫీసర్‌ పోస్టులు: 1
  • ఎలక్ట్రికల్ సూపర్‌వైజర్ పోస్టులు:1
  • జూనియర్ మేనేజ్‌మెంట్ అసిస్టెంట్ పోస్టులు: 1
  • టెక్నికల్ అసిస్టెంట్ గ్రూప్ II (రీ-అడ్వర్టైజ్‌మెంట్) పోస్టులు: 1
  • టెక్నికల్ అసిస్టెంట్ గ్రూప్ I పోస్టులు: 2
  • టైపిస్ట్/లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులు: 1

రాత పరీక్ష విధానం..

టైర్‌-1 పరీక్షలో 100 మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలకు 100 మార్కుల చొప్పున 90 నిముషాల్లో పరీక్ష రాయవల్సి ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 0.50 నెగెటివ్‌ మార్కింగ్‌ ఉంటుంది.టైర్‌-2 డిస్క్రిప్టివ్‌ విధానంలో 100 మార్కులకు 90 నిముషాలపాటు ఉంటుంది. టైర్-3 ప్రాక్టికల్ టెస్ట్‌.

అడ్రస్: THE DIRECTOR, RAJIV GANDHI CENTRE FOR BIOTECHNOLOGY, POOJAPPURA, THYCAUD P.O, THIRUVANANTHAPURAM 695014, KERALA.

ఇవి కూడా చదవండి

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

హైదరాబాద్‌లో కారు బీభత్సం.. డ్రైవర్ని చితకబాదిన స్థానికులు.
హైదరాబాద్‌లో కారు బీభత్సం.. డ్రైవర్ని చితకబాదిన స్థానికులు.
దైవ దర్శనానికి వెళ్లి ప్రదక్షిణలు చేస్తున్న యువకుడు. అంతలోనే షాక్
దైవ దర్శనానికి వెళ్లి ప్రదక్షిణలు చేస్తున్న యువకుడు. అంతలోనే షాక్
కూలిన మర్రి చెట్టు కింద శివలింగం ప్రత్యక్షం.. పోటెత్తిన జనం.!
కూలిన మర్రి చెట్టు కింద శివలింగం ప్రత్యక్షం.. పోటెత్తిన జనం.!
గోండ్ కటిరా, పెరుగు కలిపి తింటే ఏమవుతుందో తెలుసా.?
గోండ్ కటిరా, పెరుగు కలిపి తింటే ఏమవుతుందో తెలుసా.?
అమెరికా వెళ్లాలనుకునేవారికి షాకింగ్‌ న్యూస్‌.! ఇండియన్స్ కి మరింత
అమెరికా వెళ్లాలనుకునేవారికి షాకింగ్‌ న్యూస్‌.! ఇండియన్స్ కి మరింత
బ్రష్ పై టూత్ పేస్ట్ ను ఎక్కువుగా పెడుతున్నారా.? అయితే ఇది మీకోసం
బ్రష్ పై టూత్ పేస్ట్ ను ఎక్కువుగా పెడుతున్నారా.? అయితే ఇది మీకోసం
అల్లు అర్జున్ నార్త్‌ ఫ్యాన్స్‌కు ఇక పండగే.! గ్రాండ్‌గా ట్రైలర్..
అల్లు అర్జున్ నార్త్‌ ఫ్యాన్స్‌కు ఇక పండగే.! గ్రాండ్‌గా ట్రైలర్..
కూలి పని చేసుకుంటున్న స్టార్ హీరో కొడుకు.! వీడియో వైరల్..
కూలి పని చేసుకుంటున్న స్టార్ హీరో కొడుకు.! వీడియో వైరల్..
రాంగోపాల్ వర్మకు బిగుస్తున్న ఉచ్చు.. పోలీసుల చేతిలో వర్మ.!
రాంగోపాల్ వర్మకు బిగుస్తున్న ఉచ్చు.. పోలీసుల చేతిలో వర్మ.!
ఉత్తరాంధ్ర యాసలో అభిమానిని ఆటపట్టించిన మెగాస్టార్.! వీడియో వైరల్.
ఉత్తరాంధ్ర యాసలో అభిమానిని ఆటపట్టించిన మెగాస్టార్.! వీడియో వైరల్.