Cantonment Board Jobs 2022: పదో తరగతి అర్హతతో బెల్గాం కంటోన్మెంట్ బోర్డులో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. పూర్తి వివరాలివే..

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన బెల్గాంలోని కంటోన్మెంట్ బోర్డు.. స్టాఫ్‌ నర్స్‌, ప్యూన్‌, సఫాయివాలా పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల..

Cantonment Board Jobs 2022: పదో తరగతి అర్హతతో బెల్గాం కంటోన్మెంట్ బోర్డులో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. పూర్తి వివరాలివే..
Cantonment Board Belgaum
Follow us
Srilakshmi C

|

Updated on: Oct 19, 2022 | 7:26 AM

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన బెల్గాంలోని కంటోన్మెంట్ బోర్డు.. స్టాఫ్‌ నర్స్‌, ప్యూన్‌, సఫాయివాలా పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు, యూనివర్సిటీ నుంచి పదో తరగతి, నర్సింగ్‌లో బ్యాచిలర్స్‌ డిగ్రీ/పీయూసీ/మిడ్‌వైఫరీ/సైకియాట్రిక్‌ నర్సింగ్‌ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో ఏడాది అనుభవం కూడా ఉండాలి. అభ్యర్ధుల వయసు 21 నుంచి 30 ఏళ్లకు మధ్య ఉండాలి. రిజర్వేషన్‌ వర్గాలకు వయోపరిమితి విషయంలో సడలింపు వర్తిస్తుంది. ఈ అర్హతలున్న అభ్యర్ధులు అక్టోబర్ 31, 2022వ తేదీలోపు ఆఫ్‌లైన్‌ విధానంలో కింది అడ్రస్‌కు దరఖాస్తులను పోస్టు ద్వారా పంపించవల్సి ఉంటుంది. దరఖాస్తు సమయంలో ప్రతి ఒక్కరూ రూ.500లు రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. వికలాంగ అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేయడం జరుగుతుంది. ఎంపికైన వారికి కింది విధంగా జీతభత్యాలు చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

పే స్కేల్ వివరాలు.. ప్యూన్‌ పోస్టులకు నెలకు రూ.17,000ల నుంచి రూ.28,950ల వరకు జీతంగా చెల్లిస్తారు. సఫాయివాలా పోస్టులకు నెలకు రూ.17,000ల నుంచి రూ.28,950ల వరకు జీతంగా చెల్లిస్తారు. స్టాఫ్‌ నర్స్‌ పోస్టులకు నెలకు రూ.33,450ల నుంచి రూ.62,600ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అడ్రస్: Chief Executive Officer, Cantonment Board, BC No.41, Khanapur Road, Camp, Belagavi-590001 (Karnataka State).

ఇవి కూడా చదవండి

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.